ప్రపంచంలోకెల్లా అతి పురాతన విశ్వవిద్యాలయమేది? అని
అడిగితే ఈ కాలపు కుర్రాళ్ళకు చప్పున స్ఫురించే పేరు ఆక్స్ ఫర్డ్. నిజానికి ఘనత
వహించిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ మొదలవటానికి 500 ఏళ్ల పూర్వమే హిందూదేశంలో నలందా
విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయిలో మహా వైభవంగా వెలిగిపోతుండేది. ఇంకా చెప్పాలంటే
ఆ కాలాన నలంద ఒక్కటే ప్రపంచం మొత్తంలో ఏకైక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. కొరియా , జపాన్, చైనా, టిబెట్, మంగోలియా, ఇండోనేసియా,
ఇరాన్, గ్రీస్ ,
టర్కీ వంటి దూర దేశాల నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు అక్కడి కొచ్చి వైద్యం ,
తర్కం, గణితం, జ్యోతిషం,
ఖగోళం,వ్యాకరణం, తత్త్వం వంటి
అనేకానేక శాస్త్రాలను సాంగోపాంగంగా
అధ్యయనం చేసేవారు. నలంద ప్రధానంగా బౌద్ధ విశ్వ విద్యాలయం అయినా అక్కడ బౌద్ధ
మత గ్రంథాలు,
ధర్మశాస్త్రాలతో బాటు, వేద వేదాంగాలను, దర్శనాలను , ఉపనిషత్తులను, శ్రుతి స్మృతి
పురాణ ఇతిహాసాలను కూడా సాకల్యంగా బోధించే వారు. రాజనీతి, యుద్ధ కళ , శిల్ప శాస్త్రాల వంటి లౌకిక విద్యలకూ నలంద
పెట్టింది పేరు. మరీ ముఖ్యంగా అక్కడ జగత్ ప్రసిద్ధమైనది అక్కడి అత్యద్భుత గ్రంథాలయ
వ్యవస్థ. ధర్మగంజ అని పిలువబడ్డ ఆ గ్రంథాలయ సముదాయంలోరత్నసాగర , రత్నోదధి,
రత్నరంజక అనే మూడు బహుళ అంతస్తుల భవనాలు ఉండేవి. అందులో తొమ్మిది అంతస్తుల
రత్నోదధి ప్రాచీన పవిత్రగ్రంథాల కాణాచి. శతాబ్దాల తరబడి ఎందరో మహాత్ములు బహు
కష్టపడి సేకరించి నలందలో అందరికీ అందుబాటులో ఉంచిన అపురూప గ్రంథాల సంఖ్య ఎంతో తెలుసా? మొత్తం కలిపి 90
లక్షల పైచిలుకు!
భారత చరిత్రలో స్వర్ణయుగంగా ప్రసిద్ధి చెందిన
గుప్తరాజుల హయాంలో సామాన్య శకం 427 సంవత్సరంలో మొదటి కుమారగుప్తుడు స్థాపించిన
నలంద విశ్వ విద్యాలయం ఇంచుమించుగా ఎనిమిది శతాబ్దాల పాటు ప్రపంచానికి విద్య
గరిపింది. మానవ విజ్ఞానానికి , నాగరికతకు గురుస్థానంగా దేశ దేశాల జిజ్ఞాసువులకు
జ్ఞాన తృష్ణ తీర్చింది. 5,6 శతాబ్దాలలో గుప్తవంశీకుల
తరవాత 7వ శతాబ్దంలో హర్షవర్ధనుడు వంటి కనౌజ్ ప్రభువులు, 8 – 12 శతాబ్దాలలో పాల వంశం పాలకులు తాము అనుసరించేది బౌద్ధాన్నా
, వైదిక మతాన్నా అన్నదానితో నిమిత్తం లేకుండా నలందలోని బౌద్ధ మహావిహారానికి మహారాజ పోషకులుగా నిలిచి
దాని అభివృద్ధికి సర్వవిధాల తోడ్పడ్డారు. ఖర్చులన్నీ మహారాజులే భరించారు గనుక అక్కడ
విద్య, భోజన , నివాస
వసతి పూర్తిగా ఉచితం . అందులో చోటు దొరకటం
మాత్రం చాలా కష్టం. అక్కడ స్కాలర్ గా చేరాలంటే ఎవరైనా సరే ప్రవేశ పరీక్షలో నెగ్గి
తీరాలి. ఆ పరీక్ష చాలా కఠినం . అయినా
ఎప్పుడు చూసినా పదివేల సంఖ్యకు తగ్గని విద్యార్థులతో, రెండువేలకు పైగా ఆచార్యులతో కళకళలాడిన నలంద
ప్రపంచంలోకెల్లా మొట్టమొదటి రెసిడెన్షియల్ యూనివర్సిటీ . ప్రాచీన మగధ రాజ్యంలో
భాగమై నేటి పాట్నా నగరానికి 90 కిలోమీటర్ల
దూరంలో వెలసిన నలందలో దేశ దేశాల నుంచీ వచ్చిన బౌద్ధ బిక్షువులు ఎందరో సంవత్సరాల పర్యంతం నివసించి , విద్యాసముపార్జన
చేసి వేలాది అపురూప గ్రంథాల వ్రాతప్రతులను కాపీ చేసుకుని బండ్లమీద మోసుకుని
మరలిపోతుండే వారు. నలందలో హర్షవర్ధనుడి
సమకాలికుడైన చైనీస్ యాత్రికుడు హుయెన్ సాంగ్ అనే Xuan Zang సామాన్య శకం
630 – 643 నడుమ భారత పర్యటన కాలంలో రెండేళ్ళ పాటు నలందలో శిలాభద్ర ఆచార్యుడి వద్ద
శిష్యరికం చేసి సంస్కృతం, తర్క వ్యాకరణ , యోగాచారాలను అధ్యయనం చేశాడు. చైనాకు మరలిపోయేప్పుడు 657
ప్రాచీన తాళపత్ర గ్రంథాలను కాపీ చేసుకుని 520 పెట్టెల్లో 20 గుర్రాల
మీద పట్టుకు వెళ్ళాడు. 3705 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో , బహుళ అంతస్థులు
కలిగిన ఏడు బౌద్ధ మఠాలు, ఎనిమిది
వేరువేరు కాంపౌండ్లు , పది దేవాలయాలు,
మెడిటేషన్ హాళ్లు , విశాలమైన క్లాస్ రూములు, తొమ్మిది అంతస్తుల
ధర్మగంజ్ గ్రంథాలయ సదనం, మూదు అంతస్తుల
డార్మిటరీ సముదాయం, తటాకాలు, ఉద్యానవనాలతో నలంద
ప్రాంగణం ఎంత వైభవోపేతంగా విలసిల్లిందీ ఆ యాత్రికుడు కళ్ళకు కట్టినట్టు
వర్ణించాడు. అనంతర కాలాన ఆర్కియలాజికల్ తవ్వకాలలో విద్యాబోధనకు సంబంధించినదిగా
బయటపడ్డ పెద్ద దిబ్బ పొడవు 1400 అడుగులు, వెడల్పు 400 అడుగులు అంటే అప్పటి కట్టడాలు ఎంత గొప్పగా ఉండేవో ఊహించవచ్చు. నాగార్జున ,
పద్మసంభవ , వసుబందు, ధర్మపాల వంటి
మహా విద్వాంసులు నలందలోనే విద్యనేర్చారు. ప్రపంచానికి సున్నను ప్రసాదించి గణిత
శాస్త్ర వికాసానికి తోడ్పడిన ఆర్యభట్ట ఈ విశ్వ విద్యాలయానికి ప్రదానాచార్యుడుగా
ఉన్నాడు.
ప్రపంచంలో ఏ
ఖండంలో ఏ మూల ఏ దేశం వారైనా ... ఏ మతానికి ,ఏ సంప్రదాయానికి , ఏ కులానికి , ఏ
తెగకు చెందినవారైనా.. ఏ దైవాన్ని నమ్మేవారైనా , ఏ దైవాన్నీ నమ్మనివరైనా ...
సంపన్నులైనా , నిరుపెదలైనా ... ప్రతిభ, జిజ్ఞాస, శ్రద్ధ ఉండి ప్రవేశ పరీక్షలో నెగ్గితే చాలు ... మా విశ్వ
విద్యాలయానికి రావచ్చు. ఇష్టమైన విద్యలను, వాటికి సంబంధించిన శాస్త్రాలను మహా మహా మహోపాధ్యాయుల సన్నిధిలో దమ్మిడీ ఖర్చు
లేకుండా , చదువుకూ తిండికీ బసకూ పైసా రుసుము కట్టాల్సిన పనిలేకుండా ... జ్ఞానతృష్ణ
తీరేదాకా ఎన్నేళ్ళయినా ఇక్కడే ఉండి అభ్యసించవచ్చు. ఇక్కడి జగత్ ప్రసిద్ధ
గ్రంథాలయంలో భద్రపరచిన లక్షలాది అపురూప
ప్రాచీన గ్రంథాల వ్రాతప్రతులను తీరుబడిగా
అధ్యయనం చేయవచ్చు. ఎన్ని కావాలంటే అన్ని గ్రంథాలను ఉచితంగా కాపీ చేసుకుని పోవచ్చు
.... అని బంపర్ ఆఫర్ ఇచ్చే యూనివర్సిటీ లేక విద్యా విజ్ఞాన సంస్థ ఈ 21 వ
శతాబ్దంలోనే ప్రపంచం మొత్తం మీద ఒక్కటీ లేదు. మానవజాతి అదృష్టం కొద్దీ పదహారు
శతాబ్దుల కిందటే విజ్ఞాన సర్వస్వమనదగిన అటువంటి మహా విద్యా సంస్థ హిందూ
దేశంలో శతాబ్దాల పర్యంతం మహా
వైభవంగా నడిచింది. ,మల్టీబిలియనీర్లు , ట్రిలియనీర్లు కొల్లలుగా ఉన్న ఈ ఆధునిక
యుగంలో ఏ వదాన్యుడూ , ఏ సూపర్ రిచ్ సూపర్ పవర్ ప్రభుత్వమూ తలపెట్టని లోకోత్తర
మహత్కార్యాన్ని ఒక మోస్తరు రాజ్యాల బౌద్ధ, హైందవ ప్రభువులు , పేరు ప్రచారం ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంగా చేపట్టి కావలసినన్ని వనరులు, హంగులు, మడిమామత న్యాలూ
సమకూర్చి ధన్యులయ్యారు. ఆ అద్భత వ్యవస్థ అలాగే నిరాఘాటంగా కొనసాగిఉంటే మానవ
విజ్ఞానం మరింత వేగంగా పురోగమించగలిగేది. మానవాళికి మహోపకారం జరిగేది.
కాని మన దౌర్భాగ్యం ! ఎందరో మహానుభావులు ఎన్నో
శతాబ్దాల పాటు పడిన శ్రమ , చేసిన త్యాగం , సాధించిన విజయం అన్నీ చివరికి బూడిదలో
పోసిన పన్నీరు అయిపోయాయి. మతమౌడ్యం జడలుకట్టిన ఇస్లామిక్ మతోన్మాదం బారిన పడి మొత్తం
ప్రపంచానికి విజ్ఞాన ఖని , విద్యల కల్పవల్లి అయిన నలందా మహా విహార విశ్వ విద్యాలయం
సర్వనాశనం అయింది. అక్షరజ్ఞానం లేని ఒక నీచ నికృష్ట నరరూప రాక్షసుడి మతమౌడ్యం మూలంగా మంటల్లో దగ్ధమై అక్షరాలా బూడిదే అయింది. దానివల్ల
సనాతన ధర్మానికి, బౌద్ధ మతానికి, మొత్తంగా మానవ విజ్ఞానానికి , నాగరికతకు ఎవరూ అంచనా అయినా
కట్టలేనంత తీవ్ర విఘాతం జరిగింది.
నలందను మళ్ళీ కోలుకోలేనంతగా
సర్వనాశనం చేసిన పాపాత్ముడి పేరు
బఖ్తియార్ ఖిల్జీ. వాడి పేరు లోని ఖిల్జీని చూసి తెలియనివారు అతడిని 13 వ
శతాబ్దంలో హిందూ దేశాన్ని చెరబట్టిన ఖిల్జీల పారంపర్యానికి చెందినవాడని పొరబడతారు. కాని కాదు. వాడొక తాదూ
బొంగరం లేని ఆవారాగాడు. తబకాత్ -ఇ- నాసిరీ
గ్రంథంల్ 548 నుంచి 552 వరకూ పేజీల్లో మౌలానా మిన్హాజ్ ఉద్దీన్
, అబూ ఉమర్ ఉస్మాన్ లు
తెలిపిన వివరాల ప్రకారం అతడు
ఆఫ్గానిస్తాన్ లో ఖిల్జీ తెగ వాడు. ,పందొమ్మిదో ఏట ఘజినీ లో ముహమ్మద్ ఘోరీ
దర్బారుకు వెళ్లి సైన్యంలో
చేర్చుకోమన్నాడు. అతగాడి వికారపు మొగం, పొట్టి వాలకం , పొడుగు చేతులు చూస్తేనే సుల్తానుకు అసహ్యం వేసి
గెంటేశాడు. అక్కడినుంచి దిల్లీ వెళ్లి కుతుబుద్దీన్ ఐబక్ ను కలిశాడు. అక్కడా
పరాభవం అయింది. తరవాత 1193 ప్రాంతాల్లో అవద్ చేరాడు. అక్కడ తన పినతండ్రికి చిన్న జాగీరు ఉండేది. అతడు చనిపోయాక
ఆ జాగీరు బఖ్తియార్ పరమయింది, ఆ ఆసరాతో కొంతమంది కిరాయి
సైనికులను, కాసిని గుర్రాలను , ఆయుధాలను సమకూర్చుకుని
చుట్టుపక్కల ప్రాంతాల మీద పడ్డాడు. దొమ్మీలు, దౌర్జన్యాలు,
దోపిడీలు చేస్తూ అందిన కాడికి ఊళ్లు, చిన్నా చితకా రాజ్యాలూ ఆక్రమిస్తూ , అపార సంపద కొల్లగొడుతూమెల్లిగా కుతుబుద్దీన్ సుల్తాన్ దృష్టిలో పడి గౌరవ సన్మానం అందుకున్నాడు. దరిమిలా ఇంకా
మదించి , రెట్టించిన క్రౌర్యం తో మునేర్, బిహార్ ల వైపు కార్చిచ్చు లా చెలరేగి 1197 లో కాబోలు నలంద పరిసరాలలో దాపురించాడు.
7వ శతాబ్దంలో చైనీస్ యాత్రికుడు
హుయెన్ సాంగ్ కళ్ళారా చూసి వర్ణించిన దానిప్రకారం ఏకంగా 3705ఎకరాల మేర విస్తరించిన నలందా మహావిహార విశాల ప్రాంగణం చుట్టూ ఎత్తైన
ఇటుక గోడ ఉండేది. ప్రధాన ద్వారం చాలా పెద్దగా ఉండేది. విద్యా బోధన జరిగే భవన
సముదాయానికి వేరుగా సంఘారామం మధ్యలో ఎనిమిది పెద్ద బహుళ అంతస్తుల భవనాలు ఉండేవి. అంతరిక్షపు
అబ్జర్వేటరీలు ఉన్న పై గదులు మబ్బులను తాకుతూందేవి. ఎంత దూరానికైనా కనిపించే పెద్ద
పెద్ద టవర్లు , భవన సముదాయాల పైన కళాత్మకంగా అమర్చిన చిన్న గోపురాలు చూస్తే
సంస్కారం ఉన్న సహృదయులకు కన్నులవిందు అవుతుంది. కానీ చదువు సంస్కారం ఏ కోశానా లేని
, విద్యా ప్రాంగణాలంటూ ఉంటాయని కూడా తెలియని బఖ్తియార్ ఖిల్జీ అనే మూర్ఖ ముష్కరుడి పాపిష్టి దృష్టికి అది ఒక పెద్ద కోటలా కానవచ్చింది. దోచుకోవటానికి
అక్కడ అపార సంపద ఉంటుందని దుర్బుద్ధి పుట్టింది, సదరు “బిహార్ కోట” (Hisar-i-Bihar) ను కొల్లగొట్టటానికి శరవేగంతో లోట్టలేస్తూ దౌడుతీశాడు.
అతడి వెంట ఉన్న 200 మంది సాయుధ రౌతులలో మొదటి జట్టులో 18 మంది మాత్రమే అతడి వెంట
ఉన్నారు. వారిని చూసిన వారు పరదేశి వ్యాపారులు కాబోలు అనుకున్నారు తప్ప వేల
మందిని ఊచకోత కోసి ఆ ఊరును వల్లకాడు చేయటానికి వచ్చిన నరపిశాచులన్న సందేహం ఎవరికీ
కలగలేదు.
ఎవరి జోలికీ వెళ్ళకుండా ఎవరికీ
ఇబ్బంది కలగనీయకుండా తమ మానాన తాము ప్రశాంతంగా విద్యల అద్యయన అధ్యాపనాలు చేసుకుంటున్న
సజ్జనులకు ఎవరైనా హాని చేయవచ్చు; చదువుల తల్లి నడయాడే
పవిత్ర ప్రాంగణం మీద పైశాచిక దాడి జరగవచ్చు అన్న ఊహే అంతవరకూ ఎవరికీ రాలేదు. విదేశీ
తురుష్కులు విరుచుకు పడి పలు రాజ్యాలను ఆగమాగం చేస్తున్నారని తెలిసినా చదువుల నెలవులో
నిష్కారణంగా తలలు నరికేంతటి రాక్షసత్వానికి వారు పాల్పడగలరని మన ధర్మ
ప్రభువులెవరూ ఆ కాలాన శంకించ లేదు. బహుశా అందువల్లే అనేక వేల ఎకరాల విశాల నలంద
మహావిహారం రక్షణ ,భద్రత ల విషయం ఎవరూ పట్టించుకోలేదు. అదే బఖ్తియార్ ఖిల్జీకి కలిసివచ్చింది.
జరగకూడని ఘోరం జరిగిపోయింది. కేవలం 200 మంది తురుష్క ముష్కరులు పదివేల మంది విద్యార్థులను, మూదు వేలకు పైగా ఆచార్యులను, వేలాది బౌద్ధ
బిక్షువులను పరమ కిరాతకంగా ఊచకోత కోశారు. మళ్ళీ ఎన్నడూ కోలుకోలేనంతటి భయానక విధ్వంసం
సాగించారు. ఆ సమయాన ఖిల్జీ పక్కనే ఉంది చరిత్రలో
కనీ వినీ ఎరుగని ఆ దారుణ మారణకాండలో స్వయానా పాపిష్టి పాలు పంచుకున్న శంశముద్దీన్ అనే వాడి నుంచి సమాచారం రాబట్టి తబకాత్
నాసిరీ గ్రంథంలో ముస్లిం చరిత్రకారులు మిన్హాజ్ , ఉస్మాన్ లు రికార్డు
చేసిన ప్రకారం –
The band of Holy Warriors reached the
gateway of the fortress and began the attack. Muhammad Bakhtyar threw himself
into the postern of the gateway of the place, and they captured the fortress ,
and acquired great booty. The greater number of the inhabitants of that place
were Brahmans , and the whole of those Brahmans had their heads shaven ; and
they were all slain. There were a great
number of books there ; and when all these books came under the observation of the Musalmans , they summoned a number of Hindus
that they might give them information respecting the import of those books; but
the whole of the Hindus had been killed. On becoming acquainted with the
contents of those books, it was found that the whole of that fortress and city
was a college, and in the Hindu tongue , they call a college Bihar.
[Tabakat-i- Nasiri, By Maulana Minhaj -ud-
Din ,Abu - Umar-i- Usman , Translated by
Major HG Raverty P
552]
(పవిత్ర
యోధుల దళం కోట ప్రధాన ద్వారాన్ని చేరుకొని దాడి మొదలెట్టింది. ముహమ్మద్ బఖ్తియార్ అక్కడి
పక్కద్వారం మీదికి లంఘించి కోటను వశపరచుకుని గొప్ప సంపద కొల్లగొట్టాడు. అక్కడ
నివసిస్తున్నవారిలో అత్యధికులు బ్రాహ్మణులు. వారందరూ శిరోముండనం చేయించుకుని
ఉన్నారు. మొత్తం అందరినీ నరికివేశారు.
అక్కడ కొల్లలకు కొల్లలుగా గ్రంథాలు
ఉన్నాయి. ఆ విషయం ముసల్మాన్ల దృష్టికి వచ్చినప్పుడు ఆ గ్రంథాలలో ఏమున్నదో
తెలియపరచటం కోసం పలువురు హిందువులను పిలిపించమన్నారు. కాని అప్పటికే హిందువులు
యావన్మందీ చంపివేయబడ్డారు. ఆ గ్రంథాల ఆనుపానులు ఆరా తీసిన మీదట ఆ కోట, ఆ నగరం
నిజానికి ఒక కాలేజీ అని అర్థమయింది. హిందూ భాషలో కాలేజీని విహార్ ( బిహార్) అని
పిలుస్తారు.)
అది అపార ధనరాశులు
ఉండే కోట కాదు; చదువులు నేర్పే కాలేజీ అని పొట్ట కొస్తే అక్షరం ఉండని నీచ నికృష్టుడికి
అర్థమయ్యేసరికి మహా విలయం జరిగిపోయింది. పదివేలకు పైగా విద్యార్థులు, రెండు
వేలకు పైగా ఆచార్యులతో కళకళలాడిన మహోన్నత విశ్వ కళా పరిషత్తులో కనీసం పుస్తకాలలో విషయం ఏమిటన్నది చూసి
చెప్పటానికి ఒక్క విద్యావంతుడూ మిగలలేదంటే సామూహిక జన సంహారం ఏ స్థాయిలో జరిగిందో, ఆరు
అంతస్థుల బౌద్ధ విహారంలో, తొమ్మిది అంతస్థుల గ్రంథాలయ సముదాయంలో ,
అనేకానేక చైత్యాలూ, ఆరామాలూ , ఆవాస హర్మ్యాలలో ఎన్ని రోజులపాటు
ఎన్ని తలలు నరికారో , ఎంతటి రక్తపుటేరులు పారాయో తలచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది.
ఏ పాపమెరుగని , చీమకైనా హాని తలపెట్టని అహింసావ్రత నిష్టా గరిష్టులైన వేలాది
విద్వాంసులను మేరలేని మతవిద్వేషం తో రాక్షసంగా ఊచకోత కోసిన తరవాత అక్కడి లక్షలాది
గ్రంథాలను ఏమి చేయాలన్న ప్రశ్న ఉదయించింది. అలాంటి సమస్యే దానికి కొన్ని శతాబ్దాల
పూర్వం ఒక ఖలీఫా ముందుకు వచ్చింది.
When the Persian capital of Ctesiphon in province of
Khvarvaran (today Iraq) fell to the Muslims in 637 ... ... Waqqas wrote to Caliph Umar asking what should be done with
the books at Ctesiphon. Umar
wrote back: "If the books contradict the Qur'an, they are blasphemous. On
the other hand, if they are in agreement, they are not needed, as for us Qur'an
is sufficient." Thus, the huge library was destroyed and the books were
thrown into fire or the river Euphrates.
[ Jurji Zaydan in The History of the Islamic
Civilization, vol. III, pp.42-51]
( ఇప్పటి ఇరాక్ లోని ఒక
రాష్ట్రంలో పర్షియన్ రాజధాని టెసిఫోన్ 637లో ముస్లిముల వశమైనప్పుడు ఆ నగరంలో
దొరికిన గ్రంథాలను ఏమి చేయాలని వక్కాస్ అనేవాడు ఖలీఫా ఉమర్ కు లేఖ రాశాడు. ఆ
గ్రంథాలు కురాన్ కు విరుద్దంగా ఉంటె దైవ దూషణ నేరం చేసినట్టు కాబట్టి అవి ఉండటానికి వీల్లేదు. ఒకవేళ అవి కురాన్
బాధలకు అనుగుణ్యంగా ఉన్నా అవి అక్కరలేదు. ఎందుకంటే మనకు కురాన్ ఒకటే చాలు “ అని
ఖలీఫా గారి ధర్మనిర్ణయం! ఇంకేం? బ్రహ్మాండమయిన గ్రంథాలయాన్ని ధ్వంసం చేసి వెలలేని
పుస్తకాలను యూఫ్రటిస్ నదిలో పారేశారు – అని The History of the Islamic Civilizationగ్రంథం మూడో సంపుటం 42-51 పేజీలలో ఇస్లామిక్
విద్వాంసుడు Jurji Zaydan రాశాడు.
బఖ్తియార్ ఖిల్జీ కూడా
అతడికి సరితూగే వాడే. నలంద లోని అపురూప
గ్రంథాల భాండాగారాన్ని నాశనం చేయకండి అని పుస్తకాల విలువ తెలిసిన వారు
ప్రాధేయపడితే అతగాడో ప్రశ్న వేశాడట. ఆ పుస్తకాలలో అల్లా గురించి , మహమ్మద్ ప్రవక్త
గురించి ఉన్నదా?అని.
‘లేదు’ అని వారన్నారు. అయితే మానవాళికి ఆ పుస్తకాలు అక్కరలేదు. వాటిని తగలెట్టండి
అన్నాడట ఆ శుంఠ ! అనుచరులు అంతపనీ చేశారు. 90 లక్షల
గ్రంథాలను కాల్చి బూడిద చేయటం మాటలా? మహమ్మదీయ పవిత్ర యోధులు
ఆ పుణ్యకార్యం పూర్తి చేయటానికి మూడు నెలలు పట్టింది. అంతకాలమూ ఆరని మంటల్లో
అరుదైన అపురూప గ్రంథాలు కాలుతూనే ఉన్నాయి.
విజ్ఞాన సర్వస్వమైన ఒక మహా
విద్యా వ్యవస్థను నామరూపాలు మిగలకుండా
సర్వనాశనం చేసిన నీచాతినీచ మానవ మృగం పేరు తలవటమే పాపం . మరి ఆ పరిసరాలలోని
మునిసిపల్ టౌనుకూ , రైల్వే స్టేషనుకూ
భక్తియార్ పూర్ అంటూ ఆ దూర్తుడి పేరు కొనసాగించి ఈ నాటికీ లక్షల జనం దానిని నిత్యం స్మరించేలా చేసిన మనకాలపు
సెక్యులర్ ప్రభువులను ఏమనాలి? ముస్లిం మతోన్మాదం మూలంగా జాతికి జరిగిన ఘోరాపచారాన్ని జాతి
జనులకు తెలియకుండా అబద్ధాల అల్లికలల్లి –బఖ్తియార్ అనే సాదుజీవి అసలు నలంద మొగమే ఎరుగడు.. అతడు కూల్చినది
వేరేదో బౌద్ధ మఠం. నిజానికి బౌద్ధం మీద విద్వేషంతో వరసగా దాడులు చేసి , నలందను కూల్చినది హిందూ మతోన్మాదులనీ..... ఇద్దరు
అడుక్కుతినే బ్రాహ్మణులు తమ మీద ఎవరో చెడు
నీళ్ళు పోసారన్న కక్షతో పన్నెండేళ్ళు సూర్యోపసాసన చేసి తంత్ర శక్తితో కార్చిచ్చుని
సృష్టించి మొత్తం అన్ని వేల ఎకరాలలోని
భవనాలనూ, గ్రంతాలనూ
కాల్చేశారని కట్టుకతలల్లి అదే ప్రామాణిక
చరిత్ర అని తెగబడి డబాయిస్తున్న డి.ఎన్.ఝా లాంటి కమ్యూనిస్టు కబోది మేధావి గణాలను
ఏమని పిలవాలి?
No comments:
Post a Comment