Saturday 21 March 2020

Beware of Coronavirus


Dr. Kashyap Panganamamula, M.D. 

Director of Therapeutic Endoscopy .
Penn Presbyterian Medical Center ,
Philadelphia , PA , USA 
Email: kashyap.pang@gmail.com

................

Here are some important facts about Coronavirus  (COVID-19) Pandemic , from medical journals as well as professional  experience :



1.80% of the patients have milder disease and 20% will have severe symptoms/ complications
2. Complications are more likely in people above 65 years age, and People with Lung problems, heart failure or Diabetes . But young people can also develop complications and die
3.Asymptomatic patients can also transmit the infection as the virus is present in the airways and
respiratory secretions and possibly account for lot of community spread
4. The virus can survive on surfaces up to 3 days ( not just 12 hours as was stated in some circulating messages)
5.Most common symptoms are fever, dry cough and Shortness of Breath. Some patients are reporting headache, muscle pains. Up to 48% patients can have Gastrointestinal symptoms – including diarrhea, nausea/ vomiting
6.Patients with milder symptoms can isolate themselves but seek medical attention immediately if they have any breathing problems . If you have mild symptoms, make sure you drink lot of fluids to keep yourself hydrated.
7.Severe symptoms in children are not reported but children can get infected and spread the
infection to others
8.  Medications in combination -Azithromycin and Hydroxychloroquine are being studied for treatment and we will know the results soon.
9.There is no vaccine yet (contrary to some messages circulated recently) but some vaccines are being evaluated in clinical trials.
10.Whether rising temperatures ( summer) will stop or slow the spread of infection or not is not known yet. But if it does then there is a chance that virus will return in the winter unless a vaccine comes out by then.

Precautions: 

1.Most important thing is social distancing – Droplets can spread from coughing and sneezing up to 1 meter . (maximum distance is unknown). Maintain a minimum of 6 feet from each other.

2.Wash hands frequently, after using the bathroom, before eating with soap and water for a minimum of 20 seconds or use an alcohol based hand sanitizer, eat only cooked food. Do not touch face, nose and eyes with your hands

3.Those with symptoms should isolate themselves for 2 weeks and should wear a mask. They should not use the same bath room that is used by patients/ suspected patients until it is properly
cleaned with disinfectants– Patients or those with symptoms should flush the toilet with the lid closed as there is evidence that stool also can transmit the infection and flushing causes stool to
create aerosols that can be inhaled by other people using the bathroom
Hope this information will be helpful to our people.


Monday 16 March 2020

ఇకనైనా మీరు మారరా ?!


డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్

(ఊపిరితిత్తుల వైద్య నిపుణులు

WHO - Corona IPC Observer.)

.............

      2019డిసెంబర్ 31 న్యూఇయర్ వేడుకల్లో మునిగితేలే ప్రజానీకానికి తెలియని విఘాతం ప్రపంచ ఆరోగ్య సంస్థ డోర్ తట్టింది.

     ఒకటో తారీకు పొద్దున తలుపు తెరిచి చూసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నివ్వెర  పోయె నిజాలను
తెలుసుకునే లోపే, కంటి ముందర పిడుగు పడితే ఎలా ఉంటుందో, ప్రపంచ ఆరోగ్య సంస్థ లో నున్న వైద్యులకి,  పరిశోధకులకు, పాలక మండలికి వెన్నులో వణుకు వచ్చింది.

      చైనా ఏది చెప్పినా కూడా రెండుసార్లు ఆలోచించాలని ప్రపంచంలో అందరికీ తెలుసు!! కానీ ఈ సారి మాత్రం చైనా చెప్పిన మాటల్లో  కొంత సత్యం కనబడ్డది.

      చిన్నపాటి జ్వరం, ముక్కు కారడం, ఒళ్ళు నొప్పులు, వంటి సాధారణమైన ఫ్లూ లక్షణాలు గా ఉన్న  వైరస్ గమనిస్తూ ఉండగానే, మానవాళిని కుదిపేసే, ప్రపంచ జీవనానికి సవాల్ విసిరే ఓ మహమ్మారిగా coronavirus ప్రత్యక్షమైంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

      కొరోనావైరస్ ఎలా వచ్చింది?ఎలా ఉంటుంది? ఎలా నియంత్రణ చేయాలి? అని తెలుసుకునే లోపు, వేల సంఖ్యలో చైనాలో ప్రజలు దీపపు పురుగులు చచ్చినంత సులువుగా చనిపోయారు.

       అక్కడి నుంచి మొదలైన ఈ  కొరోనా వైరస్ మహమ్మారి , చైనాని తన గుప్పిట్లోకి తీసుకొని, సర్వ నాశనం చేసి,  మిగతా ప్రపంచ దేశాలపై కన్నేసింది.

         ఏ ఏ దేశాల్లో అయితే ప్రజలు వారి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ,అత్యంత నిర్లక్ష్య ధోరణి వహించారో వారిపై     కొరోనావైరస్ పంజా విసిరింది.
            మాకేమీ కాదు, మేము చాలా గట్టి వాళ్లం, మా చుట్టూ మనుషులు, డబ్బు,ధనము, అంతస్తు,  అధికారము, అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్నది, మాకు  కొరోనావైరస్ సోకే అవకాశమే  లేదు, అనుకుని అహంకరించిిన అమెరికా, జర్మనీ, జపాన్, ఇటలీ వంటి అభివృద్ధి చెందిన దేశాల వారే దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. పదుల నుంచి మొదలుకొని, వందలు వేల లెక్కచొప్పున రాలిపోతున్నారు.

        ఇక మన భారతదేశం గురించి మాట్లాడుకుందాం!
        వ్యాధి వచ్చిన తర్వాత కూడా, వ్యాధితో నేనున్నానని  తెలియకుండా  మాయ లో ఉంచే వ్యాధి coronavirus. ఇది ముక్కు, నోటి ద్వారా శరీరంలో ప్రవేశించి ఊపిరితిత్తుల లోపలికి వెళ్లి, ఊపిరితిత్తుల నాశనం మొదలు  అయ్యేంత వరకూ ...ఇది చాలా సర్వసాధారణమైన లక్షణాలు అనుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది వ్యాధిగా మనము భావించి, వైద్యుడి దగ్గరకు వెళ్లి పరీక్షలు చేయించుకొని,ఖర్మగాలి Corona Virus నిర్ధారణ అయితే..... అప్పటికే మీ శరీరంలో పుష్కలంగా, లక్షల లో కోరనా వైరస్  క్రీములు, వ్యాప్తి చెందే ఆస్కారం ఉంది.
      అశ్రద్ధ చేసినట్లయితే, Corona వైరస్ సోకిన మనిషి తెలుసుకొని, చికిత్స విధానము కొరకు  వైద్య వ్యవస్థ ని ఆశ్రయించే టప్పటికి, ఈ వైరస్ ఊపిరితిత్తులు నాశనము చేసి, కుళ్లిపోయే నిమోనియా మార్పులు తెచ్చి, శ్వాస ప్రక్రియలో తీవ్ర అంతరాయం  కలిగిస్తుంది, ఆరడుగుల మనిషిని   అరరోజు లో,  ఆరు అడుగుల ఐ సి యు  మంచంపై  జీవచ్ఛవంలా పడేస్తుంది .

        ఊపిరితిత్తుల్లో సాధారణంగా క్షయ వ్యాధి వచ్చినప్పుడు, అశ్రద్ధ  చేసిన రోగులకు ఆరు నెలలకి , ఫైబ్రోసిస్ (fibrosis- Permanent damaged scaring)అనే శాశ్వతమైన మార్పులు ఏవైతే  వస్తాయో... వాటన్నిటినీ Corona virus  15 నుంచి నెల రోజుల  లోపలే తీసుకొని వస్తుందంటే, ఈ వైరసు   ఎంత  ప్రమాదకర మైనదో, దాని విషము మానవ శరీరాన్ని  ఎంత నాశనం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

         ఇంతటి భయంకరమైన Corona Virus పట్ల ఏ మాత్రం అశ్రద్ధ వహించినా  కోలుకోలేని దెబ్బ శరీరముపై పడడం ఖాయం.

       తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

1)  రోడ్లపై తిరగకుండా, పనులు సాధ్యమైనంత తగ్గించుకుని ఇంటి పట్టున   ఉండడం అత్యుత్తమం.

2) జ్వరము, దగ్గు,తుమ్ములు,ఒళ్ళు నొప్పులు ఆయాసం,ఈ లక్షణాలు వచ్చి రెండు మూడు రోజుల్లో గనక తగ్గకపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.

3) కనీసం నాలుగు గంటలకు ఒకసారి చేతులు ముఖ్యంగా వేలు అరిచెయ్యి శుభ్రంగా సబ్బుతో  కడగడం అవసరం.

4) బయట తిరిగేటప్పుడు సాధ్యమైనంతవరకు  మనిషి - మనిషి  మధ్య మూడు నుంచి ఆరు అడుగుల దూరం ఉండేట్టు ఎవరికి వారు జాగ్రత్త పడగలిగితే ఈ వ్యాధి వ్యాప్తిని చాలావరకు అరికట్ట వచ్చు. (Social Distancing.)

5) పార్కులు, క్లబ్బులు , థియేటర్లు , ఫంక్షన్ హాల్స్ వంటి పబ్లిక్ స్థలాలు, ఆటోలు, బస్సులు,  ట్రైను, ఏరోప్లేన్, వంటి ప్రయాణ మాధ్యమాలు సాధ్యమైనంతవరకు అవాయిడ్ చేయాలి.

6) కుదిరితే అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలో, కొత్త వారు ఎవరు వచ్చినా క్షుణ్ణంగా  వారి ఆరోగ్య వివరాలు తెలుసుకొని, వారు  కూడా పరిశుభ్రత నియమావళి పాటించాలి. వారికి గనక పై వ్యాధి లక్షణాలు ఉన్నట్టయితే నిర్మొహమాటంగా  పరీక్షలు నిర్వహించాలి.

7) పోషకాహారం తినవలసిన అవసరం ఎంతైనా ఉంది. చైనాలో మాంసాహార  మార్కెట్లోనే ఈ వ్యాధి పురుడుపోసుకుంది అని గుర్తుంచుకుని మాంసాహారులు  జాగ్రత్త పడాలి.


       అంతా ప్రభుత్వమే చేస్తుంది గా!!

       అంతా ప్రభుత్వమే చేస్తుందనుకుని, మన బాధ్యత కూడా ప్రభుత్వంపై నెట్టేయడం, కరోనా వ్యాధి కంటే భయంకరమైన ఆలోచన వ్యాధి.  ఎవడి ఇల్లు వాడే జాగ్రత్త పరచుకోవాలి! ఎవరి వొళ్లు వారే కాపాడుకోవాలి!

        తెలిసీ తెలియని వాళ్లు సోషల్ మీడియాలో చేసే పిచ్చి వాగుళ్లకు మోసపోకుండా ,  వైద్యం గురించి ఏమీ తెలియని మహానుభావులు చెప్పే చచ్చుపుచ్చు చిట్కాల మాయలో పడకుండా భిన్నమైన,   Corona virus గురించి వాస్తవాలు తెలుసుకొని అప్రమత్తంగా ఉండక పోతే కొంప కొల్లేరు అవ్వడం ఖాయం!!




Thursday 12 March 2020

బ్రహ్మ చెప్పిన కరోనా మందు!!


ఎం.వి.ఆర్. శాస్త్రి

.......................

     ఇప్పుడు  మొత్తం ప్రపంచాన్ని ఠారెత్తిస్తున్న కొత్త మహమ్మారి కరోనా వైరస్. ఈ  ఉపద్రవపు విస్తృతి, తీవ్రత  గురించి  మిత్రుడు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్  నిన్న రాత్రి వివరిస్తూంటే  నాకు  యోగవాసిష్ఠం లో కర్కటి ఉపాఖ్యానం గుర్తుకొచ్చింది.

     ఇదీ ఆ కథ :

     కర్కటి అని ఓ మహారాక్షసి . దానిది అంతులేని ఆకలి. ఎన్ని వందల, వేల మంది మనుషుల్ని అప్పడాల్లా నమిలేసినా దానికి ఆకలి తీరేది కాదు. ఇలా కాదు;  భూలోకంలోని సమస్త ప్రాణులనూ ఒకే సారి మింగ గలిగితే ఎంత బాగుండు ! అప్పుడు కానీ నాకు కడుపు నిండదు – అని ఆ రాక్షసికి ఓ చిన్న కోరిక పుట్టింది. ఎడతెగని ఆకలి బాధ తీరటానికి అదొక్కటే దారి అని దానికి తోచింది. ఎలాగైనా దాన్ని సాధించి తీరాలని ఒంటికాలి మీద నిలబడి తీవ్రమైన తపస్సు చేసింది. హిమాలయ శిఖరం మీద వెయ్యేళ్ళ పాటు సాగిన రాక్షసి భీకర తపస్సు ధాటికి లోకాలు అల్లాడాయి. బ్రహ్మదేవుడు దిగివచ్చి వరం కోరుకోమన్నాడు.

     “ ముక్కు ద్వారా వాసన లోపలికి పోయినంత తేలిగ్గా నేను వ్యాధి రూపంలో మనుషుల హృదయం లోకి ప్రవేశించాలి. జీవమున్న సూదిలా సూక్ష్మరూపంలో వ్యాపించి ప్రపంచంలోని జీవులను కడుపారా భోం చేయాలి. ఆ ఒక్క వరమివ్వు చాలు “అన్నది కర్కటి. బ్రహ్మగారు సరే అన్నాడు. నువ్వు కోరుకున్నట్టే సూక్ష్మాతి సూక్ష్మమైన సూది రూపంలో ‘విషూచిక’ అనే పేరుగల వాత రోగానివి అవుతావు. ప్రజల ప్రాణవాయువుద్వారా ముక్కులోంచి ప్రవేశించి మనుషుల హృదయప్రదేశాన్ని ఆక్రమిస్తావు. గుండె, కాలేయం ,ఊపిరితిత్తులు లాంటి అవయవాలను పీడించి వారిని నాశనం చేస్తావు ‘ అని వరమిచ్చాడు. అయితే  దానికి కూడా కొన్ని షరతులు వర్తిస్తాయి అన్నాడు. 
     
       అవేమిటంటే :
1.                   1. తినకూడని వాటిని తినేవారిని, చెయ్యకూడని పనులు చేసేవారిని , చెడు ప్రదేశాల్లో ఉండేవారిని , శాస్త్రవ్యతిరేకంగా నడిచేవారిని, దుర్మార్గులను  సుబ్బరంగా  హింసించి ఆరగించవచ్చు.
2.      
           2.మాయరోగం అన్నది వ్యాపించాక , చెడ్డవాళ్ళతో   పాటు మంచి వాళ్ళూ దాని బారిన పడతారు. అయితే దానినుంచి బయటపడటానికి బ్రహ్మగారు మంత్రరూపంలో ఓ ఎస్కేప్ రూట్ ఇచ్చాడు. ఆ మంత్రాన్ని శ్రద్ధగా అనుష్ఠిస్తే చాలు గుణవంతులు విషూచికావ్యాధి కోరలనుంచి తప్పించుకోగలరట!
       



   వేల సంవత్సరాల కిందటి  యోగ వాసిష్ఠంలోని ఉత్పత్తి ప్రకరణం లో ఈ కథవింటే దానికీ మనలను ఇప్పుడు వొణికిస్తున్న కరోనా వైరస్ కూ చాలా పోలికలు కనిపిస్తాయి. ఈ వైరస్ కూడా ముక్కుద్వారానో , మూతిద్వారానో , చేతుల ద్వారానో ప్రాణవాయువుతోబాటు లోపలికి పోయి గుండెలోనో, దానిదగ్గరి ఊపిరి తిత్తులలోనో, పక్క వాటాలోనో  కాపురంపెట్టి నానా బీభత్సం చేస్తుందని డాక్టర్లు మొత్తుకుంటున్నారు. కప్పలు, పాములు తినే చైనా వాళ్ళూ , ఎద్దు మాంసం లేనిదే  ముద్దదిగని తూర్పు, పడమర  దేశాల వాళ్ళూ , మతం పేర రక్తపుటేర్లు పారించిన వాళ్ళూ కరోనా కోరల్లో నజ్జు అవుతున్నారు. వాటికన్ , మక్కా లాంటి క్షేత్రాలే మనిషి జాడలేకుండా మూతపడి , ఇటలీలాంటి దేశాలు మొత్తానికి మొత్తం దిగ్బంధమై , చైనావాళ్ళు పైకి చెప్పుకోలేని ఘోరకలితో గొల్లుమంటూ ప్రపంచమంతటా హాహాకారాలు దద్దరిల్లుతున్నా , ముంచుకొచ్చిన పీడకు మందు ఏమిటో పాలుపోక ఆధునిక వైద్యశాస్త్రం చేతులెత్తేసిన స్థితిలో పాత పురాణం లో బ్రహ్మ చెప్పిన ఈ విషూచికా మంత్రమే  రేపు బాధిత జనాలకు తారకమంత్రం అవుతుందేమో?! ఎవరు చెప్పగలరు ? ఈ సంగతి తెలిస్తే ఏ అమెరికా వాడో  ఈ విషూచికా మంత్రానికి అర్జెంటుగా పేటెంటు కొట్టెయ్యడా ?!

ఓం హ్రీం హ్రాం రీం రాం విష్ణు శక్తయే  నమః
ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం
ఓం హరహర నయనయ పచపచ మథమథ
ఉత్సాదయ దూరే కురు స్వాహా హిమవంతం గచ్ఛ జీవ
సః సః సః చంద్రమండల గతోసి స్వాహా