Friday 28 September 2018

తలకట్టు తెచ్చిన చేటు


పెక్యులరిజం - 15


ఎం.వి.ఆర్‌.శాస్త్రి

.......



తెలిసి చేశారో తెలియక చేశారో గాని - రాజ్యాంగం రాసినవాళ్లు చేసిన ఒక తప్పు హిందూ సమాజానికి శాపమైంది. దేశంలో నూటికి 80 మందిని ప్రధానమైన ఒక ప్రాథమిక హక్కుకు నిష్కారణంగా అది దూరం చేసింది.

భారత రాజ్యాంగంలోని మూడోభాగం (Part III) లో ప్రాథమిక హక్కుల పరిచ్ఛేదంలో Cultural and Educational Rights (సాంస్కృతిక, విద్యాపరమైన హక్కులు) అనే సబ్‌ హెడ్డింగు కింద 29, 30 నెంబర్లు గల రెండు అధికరణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది 29వ అధికరణం గురించి. అందులో ఉన్నదిది.

1. Any section of the citizens residing in the territory of India or any part thereof having a distinct language, script or culture of its own shall have the right to conserve the same.
2. No citizen shall be denied admission into any educational institution maintained by the state or receiving and out of state funds on grounds only of religion, race, caste, language or any of them.

(1. భారత భూభాగంలో నివసించే ఏ వర్గానికి చెందిన పౌరులకైనా తమకు నిర్దిష్టంగా ఉన్న భాషను, లిపిని, సంస్కృతిని కాపాడుకునే హక్కు ఉండును.

2. ప్రభుత్వం నడిపే లేక ప్రభుత్వ నిధులు పొందే ఏ విద్యా సంస్థలోనూ మతం, జాతి, కులం, భాషలలో దేనికారణంగానూ ఏ పౌరుడికీ ప్రవేశం నిరాకరించరాదు.)

ఇందులో వంక పెట్టటానికి ఏమీ లేదు. తమ భాషను, లిపిని, సంస్కృతిని సంరక్షించుకునే హక్కును దేశంలోని అన్ని వర్గాల పౌరులకూ మొదటి క్లాజు దఖలు పరిచింది. కులం, మతం, జాతి, భాషల వివక్షతో ప్రభుత్వ రంగ విద్యాసంస్థలలో భారత పౌరులెవరికీ ప్రవేశం నిరాకరించకుండా రెండో క్లాజు కట్టడి చేసింది. అంతకంటే ఏమి కావాలి?

29వ అధికరణంలోని పదజాలాన్ని బట్టి ఒక విషయం స్పష్టం. ఒక కులం, ఒక మతం, ఒక జాతి, ఒక భాష అన్న తేడా లేకుండా అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని జాతులకు, అన్ని భాషలకు చెందిన భారత పౌరులు యావన్మందికీ అది వర్తిస్తుంది. మెజారిటీ, మైనారిటీ తారతమ్యం అందులో ఎక్కడా లేదు. మైనారిటీలకు మాత్రమే ఆ అధికరణం ఉద్దేశించబడింది అని గాని, అందులో పొందుపరచిన ప్రాథమిక హక్కు మెజారిటీ వర్గమైన హిందువులకు వర్తించదనిగాని మతి ఉన్నవాడెవడూ అనలేడు. ఈ రాజ్యాంగవరం ఉన్నదున్నట్టుగా అమలు జరగటం కంటే ఈ దేశ ప్రజలు కోరుకోగలిగింది ఉండదు. కులపరంగా, భాషాపరంగా, జాతిపరంగా హిందూ సమాజంలో ఎంతోమంది ఎన్నో విధాల ఈనాటికీ ఎదుర్కొంటున్న దారుణ వివక్షను పరిహరించటానికి పై అధికరణం ఎంతో ఉపయోగపడగలదు.

కాని ఏం లాభం? దేవుడు వరమిచ్చినా పుజారి వరమివ్వనట్టు 29వ అధికరణం సమస్త పౌరులకు ఎంతటి మేలు చేస్తేనేమి? రాజ్యాంగ రచయితలు దాని నెత్తిన 'Protection of interests of minorities' (మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ) అనే హెడ్డింగు పెట్టారు. మార్జినల్‌ హెడ్‌నోట్‌ అనబడే ఆ తలకట్టుతో ఈ రాజ్యాంగ అధికరణానికి అర్థం మొత్తం మారిపోయింది. కేవలం మైనారిటీల ప్రయోజనం కోసమే అది ఉద్దేశించబడిందనీ, మెజారిటీ వర్గానికి అందులోని హక్కులు అనుభవించే ప్రాప్తం లేదనీ వాదించేందుకు వాటమైన వీలు చిక్కింది. రాజ్యాంగం ప్రసాదించిన ఒక ముఖ్యమైన ప్రాథమిక హక్కు జనాభాలో 80 శాతానికి అందకుండా పోవటంతో హిందువులు తమ దేశంలోనే రెండో తరగతి పౌరులుగా మారారు.

29వ అధికరణం శీర్షికకూ, దానికింది విషయానికీ మధ్య వైరుధ్యాన్ని అత్యున్నత న్యాయస్థానం అనేక సందర్భాల్లో గుర్తించింది. ఉదాహరణకు T.M.A. Pai Foundation Vs. state of karnataka కేసులో 2002 అక్టోబరు 31న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులోని ఈ వాక్యాలను చూడండి.

“Article 29(1) doesnot refer to any religion, even though the marginal note of the Article mentions the interests of minorities... Article 29(1) gives the right to all sections of citizens, whether they are in a minority, or the majority religions, to conserve their language, script or culture...

“Article 29(2) confers a special right on citizens for admission into educational institutions... to limit this right only to citizens belonging to minority groups will be to provide a double protection to such citizens and to hold that the citizens of the majority group have no special educational rights... We see no cogent reason for such discrimination "

(మార్జినల్‌ నోటు 'మైనారిటీల ప్రయోజనాల'ను పేర్కొన్నప్పటికీ 29(1) అధికరణంలో ఏ మతం ప్రస్తావనా లేదు. 29 (1) అధికరణం అన్ని వర్గాల పౌరులకూ - వారు మైనారిటీలైనా, మెజారిటీ మతానికి చెందిన వారైనా - తమ భాషను, లిపిని, సంస్కృతిని కాపాడుకునే హక్కును ఇచ్చింది.

29 (2) అధికరణం విద్యా సంస్థల్లో ప్రవేశాల విషయంలో పౌరులకు ఒక ప్రత్యేక హక్కును ప్రసాదించింది. ఈ హక్కును మైనారిటీ వర్గాలకు చెందిన పౌరులకు మాత్రమే పరిమితం చేయడమంటే ఆ పౌరులకు డబుల్‌ రక్షణ ఇచ్చినట్టు అవుతుంది. మెజారిటీ వర్గానికి చెందిన పౌరులకు విద్యా విషయమై ప్రత్యేక హక్కులేవీ లేవు అని చెప్పినట్టు అవుతుంది... అటువంటి వివక్షకు సరైన కారణమేదీ మాకు కనపడటం లేదు.)

29వ అధికరణం హెడ్‌ నోట్‌లో మైనారిటీ ప్రయోజనాల పరిరక్షణ అని పేర్కొన్నా, పాఠంలో 'మైనారిటీ' అన్న పదాన్ని వాడలేదు అని పైన ఉటంకించిన తీర్పులో సుప్రీంకోర్టు చెప్పింది. ఇక్కడ ఒక సందేహం రావచ్చు. అధికరణ పాఠంలో 'మైనారిటీలు' అన్నపదం లేనంత మాత్రాన అది మైనారిటీలకు ఉద్దేశించింది కాదు అని ఎలా నిర్ధారించగలం? ఆ ఉద్దేశం రాజ్యాంగ కర్తలకు లేకపోతే 'మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ' అన్న హెడ్‌ నోటును ఎందుకు పెడతారు? రాజ్యాంగం రాసిన అంబేద్కర్ వంటి మహమహులు తెలివి తక్కువ వాళ్లు అని ఎవరు అనగలరు? బలమైన కారణం లేకుంటే అలాంటి శీర్షిక ఎందుకు పెడతారు? శీర్షికలోనే 'మైనారిటీ'లను ప్రస్తావించారు కాబట్టి పాఠంలో మళ్లీ 'మైనారిటీ'లను నొక్కి చెప్పవలసిన అవసరం లేదని వారు భావించి ఉండొచ్చు కదా? లేదా 'మైనారిటీ'లకు మాత్రమే అన్నది పాఠంలో షరాగా చేర్చటం వారు పొరపాటున మరచి ఉండొచ్చుకదా?

సందేహం బాగానే ఉంది. మరి నిజమేమిటో ఎలా తేలాలి? రాజ్యాంగ అధికరణం పరమార్థమేమిటో, దానిని రచించిన వారి అసలు ఉద్దేశం ఏమిటో కనిపెట్టటం ఎలా?

దానికీ మనం బుర్రలు బద్దలు కొట్టుకోవలసిన పనిలేదు. అటువంటి అనుమానం వచ్చినప్పుడు నివృత్తి చేసుకోవడం ఎలా అన్నది పైన ఉటంకించిన తీర్పులో సుప్రీంకోర్టే దారి చూపింది ఇలా :

'రాజ్యాంగంలోనే ఏ అంశానికి సంబంధించి అయినా రాజ్యాంగ కర్తల ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాలంటే దానిని ఖరారు చేసే ముందు రాజ్యాంగ నిర్ణయ సభలో నడిచిన చర్చలను పరిశీలించాలి అని కేశవానంద భారతి కేసులో ఈ న్యాయస్థానం ప్రకటించింది. రాజ్యాంగ నిబంధనలను అర్థం చేసుకోవడానికి రాజ్యాంగ సభ డిబేట్లను పరిగణనలోకి తీసుకోవాలన్నది అందరూ అంగీకరించారు.'

సుప్రీంకోర్టే చెప్పాక ఇక తిరుగులేదు. మరి 29వ అధికరణానికి సంబంధించి రాజ్యాంగ నిర్ణయ సభ రికార్డులు ఏమి చెబుతాయి?ౠ

రాజ్యాంగ ముసాయిదాలో ఈ అధికరణం నెంబరు ఒరిజినల్‌గా 23. రాజ్యాంగ సలహా సంఘం (అడ్వయిజరీ కమిటీ) పలుమార్లు చర్చించి, ఆమోదించిన ముసాయిదాలో 23వ అధికరణం కింద పేర్కొన్నది ఇది.

23 (1) any minority residing in the territory of India or any part thereof having a distinct language, script and culture of its own shall have the right to conserve the same.

2) No minority whether based on religion, community or language shall be discriminated against in regard to the admission of any person belonging to such minority into any educational institution maintained by the state.

దీనిపై రాజ్యాంగ నిర్ణయ సభలో చర్చ జరిగినప్పుడు పండిట్‌ ఠాకూర్‌ దాస్‌ భార్గవ ఒక సవరణ ప్రతిపాదించాడు. రెండవ క్లాజులో 'మైనారిటీ' స్థానంలో 'సిటిజన్‌'ను చేర్చి ఆయన చేసిన సవరణ ప్రతిపాదన ఇది.

“No citizen shall be denied admission into any educational institution by the state or receiving aid out of state funds on grounds only of religion, race, caste, language or any of them.”

1948 డిసెంబర్‌ 8న రాజ్యాంగ సభలో ఈ సవరణను ప్రతిపాదిస్తూ పండిట్‌ ఠాకూర్‌ దాస్‌ భార్గవ గొప్ప ప్రసంగం చేశారు. కేవలం మైనారిటీలకు పరిమితం చేయకుండా విద్యాహక్కును మొత్తం పౌరులందరికీ వర్తింపజేయటం ఎందుకు అవసరమో వివరిస్తూ ఆయన ఇలా అన్నారు:


''సర్‌! ఈ క్లాజులో మైనారిటీలకు అన్నామంటే మెజారిటీని, మైనారిటీని వేరు వేరు చేసినట్టే కదా? ఈ అధ్యాయానికి పెట్టిన హెడ్దింగ్‌ ఏమిటండి? 'సాంస్కృతిక, విద్యాపరమైన హక్కులు' !అవి పౌరులందరికీ ఉండాల్సినవే కదా? అక్కడ ప్రత్యేకంగా మైనారిటీల ప్రస్తావన ఎందుకు? ఈ 2వ క్లాజును చదివితే మైనారిటీలకు మాత్రమే ప్రత్యేక హక్కులు ఇచ్చినట్టు కనపడుతుంది. కాని జాతి శ్రేయస్సు దృష్ట్యా ఈ విషయంలో మెజారిటీకి చెందినవారి పట్ల కూడా వివక్ష చూపకూడదు. మైనారిటీలకు మాత్రమే ప్రత్యేక హక్కులు ఉండాలి అని, మెజారిటీ వర్గానికి ఉండకూడదు అనడం దురదృష్టకరమైన ఆలోచనా ధోరణి. ఇలా మైనారిటీ, మెజారిటీ మధ్య తేడాపాడాలను పెట్టే అలవాటు మన బ్రిటిషు ప్రభువులకు ఉండేది. విద్యకు సంబంధించిన విషయాల్లో ఎవరి పట్ల వివక్ష లేకుండా మెజారిటీకి, మైనారిటీకి సమాన ప్రతిపత్తిని ఇచ్చేట్టు చేయడం కోసమే ఈ సవరణ.''

ఈ దశలో డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కలగజేసుకున్నారు. పండిట్‌ భార్గవ అభిప్రాయంతో ఆయన పూర్తిగా ఏకీభవించారు. మైనారిటీ, మెజారిటీ అన్న తేడా లేకుండా ఈ ప్రాథమిక హక్కు పౌరులందరికీ సమానంగా వర్తించాలన్న ఉద్దేశంతో తాను మొదటి క్లాజులోని Any minority అన్న పదాన్ని"Any section of the citizens" గా డ్రాఫ్టింగ్‌ కమిటీ సవరించినట్టు ఆయన ప్రకటించారు. ఇక రెండో క్లాజుకు సంబంధించి ఠాకూర్‌ దాస్‌ భార్గవ చేసిన సవరణపై ఓటింగు జరిగింది. ఆ సవరణను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

అదీ - 29వ అధికరణం రూపొంది, రాజ్యాంగంలోని ఎక్కిన కథాక్రమం. విద్యా హక్కుల విషయంలో మైనారిటీ, మెజారిటీ అన్న తారతమ్యం ఉండకూడదని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్ విస్పష్టంగా ప్రకటించిన తరువాత, ఆ మేరకు సవరణ ప్రతిపాదనలను రాజ్యాంగ నిర్ణయ సభ ఏకగ్రీవంగా ఆమోదించిన తరువాత రాజ్యాంగ కర్తల ఉద్దేశానికి సంబంధించి సందిగ్ధతకు తావెక్కడ? ముసాయిదాలోని 'మైనారిటీ' ప్రస్తావనను సరిదిద్ది 'అన్ని వర్గాల పౌరులు'గా రాజ్యాంగ సభ ఖరారు చేసిన దరిమిలా ఈ అధికరణానికి మైనారిటీల హక్కుల పరిరక్షణ అన్న తలకట్టును పెట్టటం తప్పే కదా?

ఔను. ముమ్మాటికీ తప్పే. ఆ సంగతి స్వయానా సుప్రీంకోర్టే అనేక సందర్భాల్లో గుర్తించింది. కాని - రాజ్యాంగంలో ఆ తప్పు చలామణిలో ఉన్నంత కాలమూ కోర్టులు కూడా దానికి అనుగుణ్యంగానే నడుచుకోవాలి. రాజ్యాంగమనేది ఆషామాషీ పత్రం కాదు. చెల్లుబాటు అయినంత కాలమూ అందులోని ప్రతిమాట శిలాశాసనమే. పొరపాటు జరిగిందని రూఢి అయ్యాక అది చెల్లుబాటు కాకుండా సవరించి తీరవలసిందే.

చిక్కేమిటంటే - ఈ పెద్ద పొరపాటు ఇంకెక్కడో కాదు. పోయి పోయి ప్రాథమిక హక్కుల పరిచ్ఛేదంలో జరిగింది. ప్రాథమిక హక్కులు రాజ్యాంగం మూలసూత్రాల కిందికి వస్తాయి. వాటిని మార్చే అధికారం పార్లమెంటుకు కూడా లేదని 1973లో చరిత్రాత్మకమైన కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ప్రకటించింది. అనుల్లంఘనీయమని తాను ప్రకటించిన రాజ్యాంగం బేసిక్‌ స్ట్రక్చర్‌లో భాగం కాబట్టి ప్రాథమిక హక్కులకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనల మంచిచెడ్డల జోలికి సుప్రీంకోర్టు పోదు. 29వ అధికరణంలో లేకపోతేనేమి? మార్జినల్‌ హెడ్‌నోట్‌ అనే తలకట్టులో మైనారిటీల ప్రస్తావన ఉన్నది కదా? కాబట్టి ఆ అధికరణం మైనారిటీలకు మాత్రమే! అదీ మన న్యాయస్థానాల వైఖరి.

“The text and marginal notes of Articles 29 and 30 show that their purpose is to confer those fundamental rights on minority communities”

(29, 30 అధికరణాల పాఠం, మార్జినల్‌ నోట్సును బట్టి ఆ ప్రాథమిక హక్కులను మైనారిటీ కమ్యూనిటీలకు దఖలు పరచడమే వాటి ఉద్దేశమని స్పష్టం)

అని సుప్రసిద్ధమైన కేరళ ఎడ్యుకేషన్‌ బిల్లుపై రాష్ట్రపతి రిఫరెన్సుకు 1958 మే 22న సుదీర్ఘ సమాధానం (1959 1 SCR 995)లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పేర్కొనడం ఇందుకు ఒక నిదర్శనం.

పొరపాటు అని తాను ఎరిగినా దానిని సరిచేసేందుకు సుప్రీంకోర్టు చొరవ చూపనంత మాత్రాన చేతులు ముడుచుకొని కూర్చోనక్కరలేదు. ప్రాథమిక హక్కుల వంటి బేసిక్‌ స్ట్రక్చర్‌ను సవరించకూడదు అన్నది సుప్రీంకోర్టు అభిప్రాయమే తప్ప, రాజ్యాంగంలో అలాంటి ప్రస్తావన ఎక్కడా లేదు. ప్రజాస్వామ్యంలో అసలు యజమానులు, అంతిమ నిర్ణేతలు ప్రజలు. వారు పట్టుబడితే ఒక అధికరణాన్నేఏమిటి, మొత్తం రాజ్యాంగాన్నే మార్చివేయగలరు. జనం నుంచి గట్టి ఒత్తిడి వస్తే ఎంతటి ప్రభుత్వమైనా కదలక తప్పదు.

కాని, ప్రభుత్వం, పార్లమెంటు కదిలేట్టు ఎవరు చేయాలి? అన్యాయానికి గురైన మెజారిటీ వర్గం ప్రజలు, అనగా హిందువులు. కాని ఇప్పటి పరిస్థితుల్లో సామాన్య హిందూ ప్రజలకు ఇలాంటి విషయాలు పట్టేట్టు లేవు.

అదీ అసలు సమస్య.

Sunday 23 September 2018

A landmark Hindu Charter

M V R Sastry

It was a great pleasure and privilege to be part of  Hindu intellectuals meet in IBIS Hotel,  Aerocity New Delhi yesterday .Day and night long deliberations were fruitful.  Outcome : A Hindu Charter of Demands.A big leap in the advance of Hindu cause.

Rahul Dewan of Srijan Foundation was the organiser and Hindu warrior @EqualRights20 was the prime mover. Hindu Charter of Demands went public at a  presser in Delhi press club today. A milestone indeed. Hindu intelligentsia spoke out at last en bloc .



I was hesitant to attend because of other commitments. But I was persuaded by my good  friend MNR . It was hectic schedule but thoroughly enjoyable. It was a pleasure to hear young men and women working in the grassroots driving home their point forcefully , in their own way.

Hindu Charter evolved out of brainstorming by 100 Hindu intellectuals from different walks of life is simple, straight and  pragmatic. I myself had many apprehensions  but am satisfied with  the reasonable consensus on key issues .






I attended several Hindu elite conclaves. But this session of Hindu Charter of Demands HCD was remarkable in many ways . It was an initiative emanated from a handful of Hindu thinkers. With frugal means. They were not sure of how they would mobilise funds for minimum needs. The event took off very well .

There was no organizational backing. RSS and BJP brass certainly not in loop. It is a kind of amateur attempt at raising Hindu's voice to end it's Dhimmitude. Because no peers and icons involved , deliberations were frank and free.

HCD was an event conceived and organised in a hurry . Many stalwarts couldn't be roped in . Time , logistical other constraints. First shot being a hit , perhaps they would expand the reach and content in follow-up sessions. This timely effort deserves to be supported by all.

Sri Hanuman Chowdary , Smt Satyavani,  Swami Paripurnananda and yours truly were from Hyderabad at the Delhi Hindu conclave.





All credit for HCD goes to @EqualRights20   .He is the one who has been stressing the need to amend articles 25 to 30 on every platform and in every interaction with every Hindu somebody. He was instrumental in persuading  SP Singh to move constn  amendment bill in LS . HCD too was his idea.He was instrumental in floating our subsequently defunct "Equal Rights" organisation in Hyderabad 3 years ago.

Eminent intellectuals JK Bajaj, RK Ohri, Bharat Gupta, Ratan Sarada, Tapan Ghosh , Madhu Kishwar , Rati Hegde , Sefali Vaidya , RK Khandal , Ramaharita, and K. Seshachalam were among those who participated in HCD exercise.

We should organiseren one such follow up event in Telangana and AP soon.
....

Following is excerpts from the Press release :

Prominent Hindus ask government to end legal discrimination against the Hindu society.

New Delhi, Sep 22.

A group of around one hundred Hindus, including spiritual leaders, academics, authors , public intellectuals and concerned citizens, met in New Delhi and released a Charter of key Hindu Demands for the government of India. The demands were aimed at ending legal discrimination against Hindus by the state/government(?) and the promotion of Indian languages and culture for India’s economic and cultural development.

The key demands are as listed below

1. Granting equal rights to Hindus through the amendment of Articles 26 to 30 of the Constitution in order to remove the current constitutionally sanctioned discrimination against Hindus
2. Enactment of Foreign Contributions (Prohibition) Act by repealing the Foreign Contributions (Regulation) Act, 2010, in oreder to completely ban foreign contributions, except those by OCIs in their personal capacity (This needs to be updated)
3. Enactment of “The Freedom of Religion (Protection of Native Cultural and Religious Traditions, and Prohibition of Institutionalized Religious Conversion Activity) Act” by the Central Government
4. Abrogation of Article 370 , witdraw 35 A, Tripartite division of J&K into States of Kashmir, Ladakh and Jammu and delimitation (needs to be updated)
5. Amendment of Constitution to insert an enabling provision to provide for the expeditious grant of residency or citizenship to persecuted people of Indic faiths (Hindus, Buddhists, Jains and Sikhs) from any country
6. Enactment of “The Hindu Temple and Religious Endowments Act” by the Central Government:
7. Creation of an equal opportunity environment for Indian languages in all areas of endeavor
8. Protecting and promoting the Indigenous cow through state supported creation and propagation of (need to update)…Complete Ban on export of all types of meat/beef, and enactment of the Agricultural Cattle Preservation Act
9. Establishment of Haindava Samskruti Jeernoddhaarana Nigam (Hindu Culture Restoration Corporation) as a Central PSU with an initial seed capital of not less than Rs. 10,000/- Crores and annual grants of equal amount.







.















Friday 21 September 2018

చదువులకు సెక్యులర్‌ చెదలు

పెక్యులరిజం-14

 ఎం.వి.ఆర్‌.శాస్త్రి

...........




కమలాక్షునర్చించు కరములు కరములు...

ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు...

శ్రీ రఘురామ చారు తులసీదళ దామ...

సారపు ధర్మమున్‌ విమల సత్యము...

పాతతరం వాళ్లు చిన్నప్పుడు హైస్కూలు తెలుగు వాచకాల్లో చదివి, ఇప్పటికీ నెమరు వేసుకుంటున్న పద్యాలివి.

ఆ కాలాన సోషల్‌ స్టడీస్‌లో ఇండియాను 'హిందూదేశం' అనేవారు. గుప్తుల కాలపు స్వర్గయుగం గురించి, బహమనీ సుల్తాన్ల మీద కృష్ణదేవరాయలు, అక్బర్‌ మీద రాణాప్రతాప్‌, ఔరంగజేబు మీద ఛత్రపతి శివాజీ చేసిన యుద్ధాల గురించి పాఠాలు చెప్పేవారు. రాముడి నుంచి కృష్ణుడి నుంచి నేర్చుకోవలసినవేమిటో మోరల్‌ క్లాస్‌ మాస్టారు బోధించేవాడు.

ఇందిరాగాంధి రాకాసి పాలనలో దేశానికి 'సెక్యులర్‌' దయ్యం పట్టాక ఆ పాఠాలన్నీ పాపాలు అయిపోయాయి. తన పాపిష్టి అధికారాన్ని గట్టి చేసుకోవడం కోసం కమ్యూనిస్టులతో ఇందిరమ్మ కుదుర్చుకున్న బేరంలో భాగంగా విద్యారంగాన్ని, యూనివర్సిటీలను, అకడమిక్‌ సంస్థలను వామపక్షులకు ధారాదత్తం చేశాక జాతీయ విద్యావ్యవస్థ సర్వభ్రష్టమైంది. నూరుల్‌హసన్‌ అనే కరకు ముస్లిం మతవాదిని ఏరికోరి కేంద్ర విద్యామంత్రిగా నియమించింది మొదలుకుని చదువులకు సెక్యులర్‌ చెదలు పట్టాయి. విద్యావిధానానికి ఎర్రకామెర్లు కమ్మాయి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు లాంటి జాతీయవీరులు మతఛాందస 'మైథాలజీ'లో కల్పిత పాత్రులయ్యారు. శత సహస్రాబ్దాలుగా భారతజాతికి ప్రాణం, ప్రణవం, గమ్యం, మార్గం అన్నీ అయిన రామాయణ, భాగవత, భారతాలు పనికిమాలిన పుక్కిటి పురాణాలైపోయాయి. భారతావనికి దారిదీపమైన భగవద్గీత ఛాందస మతగ్రంధమై, సెక్యులర్‌ విద్యకు నిషిద్ధమైంది.

అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా లాంటి అనేక పాశ్చాత్య దేశాల్లో వేదాలమీద, వేదాంగాలమీద, వేదవిజ్ఞానం మీద, వైదిక శాస్త్రాల మీద, భారత రామాయణాల మీద, భారతీయ ఆధ్యాత్మిక తత్వం మీద ఎన్నో యూనివర్సిటీల్లో విస్తృత అధ్యయనాలు, లోతైన పరిశోధనలు ఎప్పటినుంచో జరుగుతున్నాయి. ప్రత్యేక డిపార్టుమెంట్లు, ఫౌండేషన్లు వాటిమీద పనిచేస్తున్నాయి.

కాని యావత్ప్రపంచం నెత్తిన పెట్టుకుని గౌరవిస్తున్న వేదవిజ్ఞానానికి, హిందూ మతతత్వ బోధలకు అవి పుట్టిన భారతదేశంలో మాత్రం నిలువనీడ లేదు. విద్యా విధానంలో వాటికి సూది మోపినంత చోటు లేదు. సెక్యులర్‌ విశ్వవిద్యాలయాల్లో హిందూమత అధ్యయనం నేరం.

''పూర్వం యుగొస్లావియాలో నా చిన్నప్పుడు స్కూలు పుస్తకాల్లో రామాయణ, మహాభారతాల గురించి చదివినట్టు గుర్తు. ఇండియాలోని స్కూళ్లలో ఇప్పుడు వాటి గురించి చాలా చెబుతారనుకుంటా?'' అని ఒక విదేశీ కంప్యూటర్‌ సైంటిస్టు హిందూమత అభిమాని అయిన పాశ్చాత్య మేధావి మైకేల్‌ డానినోను అడిగాడట.

''అలాంటి సాహసం ఎవరూ చెయ్యలేరు. భారత రామాయణాలను స్కూలు పాఠాల్లో ఎవరన్నా పెట్టబోతే వాళ్లని యాంటీ సెక్యులర్‌, కమ్యూనలిస్టు అని కుళ్లబొడుస్తారు'' అని తాను జవాబిచ్చినట్టు మైకేల్‌ ఈ మధ్య 'ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌'  వ్యాసంలో రాశాడు.

భారతీయతకు ఆత్మ అయిన హైందవాన్ని భారతీయ విద్యనుంచి గెంటివేసి, చదువుల మొదలును చేతులారా నరికివేసే ఖర్మ మనకెందుకు పట్టింది? యోగ, ఆయుర్వేదం, వేదగణితం, వేద విజ్ఞానం వంటి సాంప్రదాయక శాస్త్రాలు, వాటిలోని వైజ్ఞానిక దృక్పథాలను పాఠ్యాంశాల్లో చేర్చాలని విజ్ఞులు సూచించడమే మహాపరాధం; విద్యను కాషాయం చేసే దుర్మార్గం అని కుహనా మేధావుల మంద కందిరీగల్లా మీదపడే దౌర్భాగ్యానికి మూలహేతువేమిటి?

కుహనా సెక్యులర్‌ పైత్యం ముదిరాక సమస్య మరీ విషమించినప్పటికీ, అసలు దెబ్బ రాజ్యాంగాన్ని రాసేటప్పుడే పడింది. విదేశీ దాస్యం తొలిగి, సర్వస్వతంత్రమైన జాతికి దాని సాంస్కృతిక మూలాలను, వైజ్ఞానిక వారసత్వాన్ని పటిష్ట పరిచే విద్యావిధానం ఉండాలన్న పట్టుదల దురదృష్టవశాత్తూ మన రాజ్యాంగ కర్తలకు లేకపోయింది. మతాలకు అతీతంగా యావద్భారత జాతికి గర్వించదగ్గ వారసత్వమైన వైదిక విజ్ఞానాన్ని, దానిలోని శాఖోపశాఖలను, వాటన్నిటికీ మూలకందమైన హిందూమతంలోని సార్వకాలీన, విశ్వజనీన సూత్రాలను విద్యా సంస్థల్లో అధ్యయనం చేయించేందుకు వారు ప్రత్యేక శ్రద్ధ కనపరచలేదు. ఇస్లామిక్‌, క్రైస్తవ దురాక్రమణలకు పూర్వం వలె సాంప్రదాయిక విద్యల బోధన, పరిశోధనలకు ప్రభుత్వ పరంగా భూరి సహాయం అందించి,  భారతదేశాన్ని ప్రపంచ విద్యా కేంద్రంగా మళ్ళీ అభివృద్ధి కానివ్వాలన్న బాధ్యతా వారు మరచారు. అంతటితో ఊరుకోలేదు. పరిపరి విధాల వ్యాఖ్యానాలకూ, వక్రభాష్యాలకూ ఆస్కారం ఇచ్చే రీతిలో రాజ్యాంగంలో 28వ అధికరణాన్ని చేర్చారు.

28. Freedom as to attendance at religious instruction or religious worship in certain educational institutions.
1) No Religion instruction shall be provided in any educational institution wholly maintained out of state funds.
2) Nothing in clause (1) shall apply to an educational institution which is administered by the state but has been established under any endowment or trust which requires that religious instruction shall be imparted in such an institution.
3) No person attending any educational institution recognised by the state or receiving aid out of state funds shall be required to take part in any religious instruction or to attend religious worship... unless  such person or his guardian has given consent thereto.

''కొన్ని రకాల విద్యాసంస్థలలో మతపరమైన బోధన లేక మతారాధనలలో పాల్గొనే విషయంలో స్వాతంత్య్రం'' అని వర్ణించిన 28వ అధికరణంలో చెప్పిందేమిటంటే-

1) పూర్తిగా ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థల్లో మత బోధన మొత్తానికే నిషిద్ధం.

2) ఏదైనా ధర్మనిధి లేక ట్రస్టు మతబోధన నిమిత్తం ఏర్పరచిన విద్యా సంస్థను ప్రభుత్వమే నడుపుతున్న పక్షంలో అలాంటి విద్యా సంస్థకు పై క్లాజులో చెప్పింది వర్తించదు.

3) ప్రభుత్వ గుర్తింపు పొందిన లేక గవర్నమెంటు ఎయిడ్‌ పొందుతున్న ఏ విద్యా సంస్థలోనూ ఏ ఒక్కరికీ వారికి ఇష్టం లేకుండా మతబోధనలో, లేక మతారాధనలో పాల్గొనమని బలవంత పెట్టకూడదు.

ఈ అధికరణాన్ని దానివరకూ చూస్తే అభ్యంతరకరమైనది ఏదీ కనిపించదు. ఇందులో నిషేధించింది విద్యాసంస్థల్లో మత బోధనను ! అంటే మతపరమైన సూత్రాలనూ, సిద్ధాంతాలనూ, కర్మకాండలనూ బళ్లో విద్యార్థులకు నూరిపోయడాన్ని! మత సంబంధమైన గ్రంథాలనూ, వాటిలో ఈ కాలానికి పనికొచ్చే విషయాలనూ, వైజ్ఞానిక అంశాలనూ తాత్విక లేక శాస్త్రీయ జిజ్ఞాసతో అధ్యయనం చేయడానికి ఏ అభ్యంతరమూ ఉండనవసరం లేదు. మత బోధనను లేక మతశిక్షణను కూడదని చెప్పినంత మాత్రాన మతాల అధ్యయనాన్ని వద్దన్నట్టు కాదు. అటువంటి ఉద్దేశం రాజ్యాంగ కర్తలకు లేదు. 28వ (ముసాయిదా దశలో దాని నెంబరు 22) అధికరణాన్ని ఆమోదించే ముందు రాజ్యాంగ నిర్మాణ సభలో జరిగిన ఈ కింది చర్చే దానికి రుజువు :

పండిట్‌ లక్ష్మీకాంత మైత్ర : గౌరవ సభ్యుడిని నేనొక ప్రశ్న వేయవచ్చా? ఉదాహరణకు కోల్‌కతాలో సంస్కృత కళాశాలలాగా మొత్తం ప్రభుత్వ యాజమాన్యంలోని ఓ కాలేజి ఉంది. అందులో వేదాలు బోధిస్తారు. స్మృతులు బోధిస్తారు. గీత బోధిస్తారు. ఉపనిషత్తులు బోధిస్తారు. అలాంటి సంస్కృత విద్యా సంస్థలు బెంగాల్‌లో వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. పూర్తిగా ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థలో మతబోధన చేయకూడదని మీరు 22(1) అధికరణంలో నిర్దేశించారు.  నేను చెప్పిన సంస్థలు పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే నడుస్తున్నాయి. మరి వాటిలో వేదాలను, స్మృతులను, శాస్త్రాలను, ఉపనిషత్తులను బోధించటం కూడా మతబోధన కిందికే వస్తుందా? అలా అయితే ఆ సంస్థలన్నిటినీ మూసివేయాల్సి వస్తుంది.

డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్ : నా మిత్రుడు మైత్రగారు ప్రస్తావించిన సంస్థల స్వభావమేమిటో నాకు కచ్చితంగా తెలియదు. కాబట్టి చెప్పటం కష్టం.

పండిట్‌ లక్ష్మీకాంత మైత్ర : ఉదాహరణకు ప్రభుత్వ సంస్కృత కళాశాలల్లో భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాలు వగైరాల సంగతి తీసుకోండి.

బి.ఆర్‌.అంబేద్కర్ : మతపరమైన బోధన వేరు. పరిశోధన, అధ్యయనాలు వేరు. ఆ రెండూ పూర్తిగా భిన్నమైనవి. మతబోధన అంటే అర్థం ఇది. ఇస్లాం మతానికి సంబంధించినంతవరకూ మతబోధన అంటే ఒకే ఒక దేవుడిని నమ్మటం. మహమ్మదే చివరి ప్రవక్త అని నమ్మటం. ఇంకా ఇంకా.. దీన్ని మనం పిడివాదపు మత సిద్ధాంతం (dogma) అంటాం. మత సిద్ధాంతానికీ మత అధ్యయనానికీ మధ్య చాలా తేడా ఉంది.

వైస్‌ ప్రెసిడెంట్‌ (హరేంద్ర కుమార్‌ ముఖర్జీ) : ఒక్క నిమిషం. కోల్‌కతా యూనివర్సిటీలో కాలేజీల ఇన్స్‌పెక్టర్‌గా ఉండగా నేను సంస్కృత కళాశాలను తనిఖీ చేసేవాడిని. పండిట్‌ మైత్రగారికి తెలుసు. అక్కడ విద్యార్థులు యూనివర్సిటీ కోర్సు పుస్తకాలతో బాటు సంస్కృత సాహిత్యాన్ని, సంస్కృతంలోని పవిత్ర గ్రంథాలను స్టడీ చేసేవారు. అది మతబోధన అని ఎప్పుడూ అనుకోలేదు. సంస్కృతిని అధ్యయనం చేయడంగానే దాన్ని భావించాం.

పండిట్‌ లక్ష్మీకాంత మైత్ర : అక్కడ జరిగేది రిసెర్చి కాదు. అది మతానికి సంబంధించిన బోధన. మతశాఖల అధ్యయనం. నేనడిగేది ఏమంటే గీతను, ఉపనిషత్తులను బోధించటం మతబోధనగా భావించబడుతుందా? ఉపనిషత్తులను వ్యాఖ్యానించటం రిసెర్చికి సంబంధించిన విషయం కాదు.

వైస్‌ ప్రెసిడెంట్‌ : అది విద్యార్థులకు బోధించటమే అవుతుంది. సంస్కృత కళాశాలలో ఒక ముస్లిం విద్యార్థి ఉన్న వైనం నాకు తెలుసు.

హెచ్‌.వి. కామత్‌ : ఒక మత సముదాయం పూర్తిగా ఆ మత సముదాయానికి చెందిన విద్యార్థులకు మాత్రమే నడిపే స్కూళ్లలో మతబోధన కంపల్సరీ కాకూడదని నా మిత్రుడు డాక్టర్‌ అంబేడ్కర్‌ అభిప్రాయమా?

డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్ : అది వారి ఇష్టం. కంపల్సరీ చేయాలా వద్దా అనేది వారే నిర్ణయించుకోవాలి. ఇక్కడ మనం చెప్పేదల్లా స్కూలును ఏ మతం వారు నడుపుతున్నారో ఆ మతానికి చెందని పిల్లలకు ఆ చదువును కంపల్సరీ చేసే హక్కు ఉండకూడదన్నదే.

ప్రొఫెసర్‌ శిబ్బన్‌ లాల్‌ సక్సేనా : 'మత బోధన' గురించి మీరు ఇప్పుడు ఇచ్చిన వివరణను రాజ్యాంగంలో చేర్చాలి.

డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్ : అలాంటి సందర్భాలు తమ ముందుకు వచ్చినప్పుడు కోర్టులు నిర్ణయిస్తాయి లెండి.

(https://indiankanoon.org/doc/1745468/)

అరుణారాయ్‌కీ, భారత ప్రభుత్వానికి నడుమ దాఖలైన రిట్‌పై 2002 సెప్టెంబర్‌లో ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.ఎం.ధర్మాధికారి పైన ఇచ్చిన రాజ్యాంగ సభ చర్చపై ఇలా వ్యాఖ్యానించారు.

Constitutional debate and the concluding remark of Dr.B.R. Ambedkar give an indication of the framers of the Constitution. Article 28 (1) therefore does not prohibit introduction of study of religions in the state educational institutions including those wholly or partly aided by the state. As a matter of fact, study of religions has been considered neccessary for the unity and integrity by India.
(https://indiankanoon.org/doc/623978/)


(రాజ్యాంగ సభలో జరిగిన చర్చ, దాని చివరలో డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్ రిమార్కు రాజ్యాంగకర్తల అంతరంగాన్ని సూచిస్తాయి. కాబట్టి ప్రభుత్వ విద్యా సంస్థలలో మతాల అధ్యయనాన్ని ప్రవేశపెట్టడాన్ని 28(1) అధికరణం నిషేధించదు. పూర్తిగానో, పాక్షికంగానో ప్రభుత్వ ఎయిడ్‌తో నడిచే విద్యాసంస్థలకు ఇది వర్తిస్తుంది. వాస్తవానికి మతాలను అధ్యయనం చేయటం భారతదేశ ఐక్యతకు, సమగ్రతకూ అవసరం.)

అక్షర లక్షలు విలువచేసే వాక్కులివి. జడ్జిగారన్నట్టు హిందూమతాన్నీ, క్రైస్తవాన్ని, ఇస్లాంను తులనాత్మక అధ్యయనం చేసి, ఆయా మతాల మూల సిద్ధాంతాలు ఏమిటో వాటి మంచి చెడ్డలేమిటో తైపారు వేసే సదవకాశాన్ని ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులకు కల్పిస్తే దేశానికి నిస్సందేహంగా గొప్ప మేలు జరుగుతుంది.

దురదృష్టమేమిటంటే రాజ్యాంగ కర్తల ఉద్దేశం ఎంత ఉదాత్తమైనా వారు పెట్టిన రాజ్యాంగ సూత్రం నానా వక్రీకరణలకు లోనైంది. తులనాత్మక పరిశీలనకైతే దిక్కులేదు. కాని క్రైస్తవ విద్యాసంస్థలలో బైబిల్‌ను, ముస్లిం విద్యాసంస్థలలో ఖొరాన్‌ను, ఆయా మతాల సిద్ధాంతాలను ఆయా మతాల విద్యార్థులకు నూరిపోసి విద్యాబోధన పేరిట మతబోధను యథేచ్ఛగా చేయగలుగుతున్నారు.జ్ఞాన సముద్రం, విజ్ఞాన సర్వస్వం, విశ్వజనీనం అయిన సర్వోత్కృష్ట హైందవ మతానికి, దాని శాఖోపఖశాఖలకూ, వాటికి ప్రాతిపదిక అయిన వేద వేదాంగాలకు, అనేక శాస్త్రాలకు మాత్రం ప్రభుత్వ విద్యా సంస్థలలో నో ఎంట్రీ! పోనీ క్రైస్తవ, ఇస్లాం మతాల వారి లాగా ఎయిడెడ్‌ విద్యాసంస్థలను సొంతంగా నడుపుకుందామా అంటే మెజారిటీ మతం అయిన నేరానికి ఆ భాగ్యమూ లేదు.

ఏతావతా విద్యారంగంలో హిందూమతం రెంటా చెడిన రేవడి. మతమౌఢ్యానికే తప్ప మత విజ్ఞానానికి సోకాల్డ్‌ సెక్యులర్‌ జమానాలో నో చాన్స్‌!!

Saturday 15 September 2018

కట్జూగారి భలే తీర్పు !

పెక్యులరిజం - 13
- ఎం.వి.ఆర్‌.శాస్త్రి

............



హిందువులకు అన్యాయం చేసిన రాజ్యాంగ అధికరణాల్లో ఆర్టికల్‌ 27 తక్కువది కాదు. కాని మత స్వేచ్ఛకు సంబంధించిన ఇతర రాజ్యాంగ అధికరణాల మీద దృష్టి సారించినంతగా హైందవ మేధావుల, మతపెద్దల, హిందూసంస్థల చూపు దీనిమీద పడలేదు. 25,26,30 వంటి అధికరణాలమీద వందల సంఖ్యలో వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి కాని 27వ అధికరణాన్ని సవాలు చేసిన కేసులను వేళ్ళమీద లెక్కించవచ్చు. దాంతో ఈ అధికరణం మంచి చెడ్డలను, సాధక బాధకాలను సాకల్యంగా విశ్లేషించే అవకాశం ఉన్నత న్యాయవ్యవస్థకు దొరకలేదు.

ఇది వేరెవరో కాదు - స్వయానా సుప్రీంకోర్టే ఒప్పుకున్న నిజం. హజ్‌ సబ్సిడీని సవాలు చేస్తూ 27వ అధికరణం కింద ప్రసిద్ధ హిందూత్వవాది ప్రఫుల్‌ గొరాడియా భారత ప్రభుత్వం మీద వేసిన దావాపై తీర్పులో ఏడేళ్ళ కింద (2011లో) సుప్రీంకోర్టు ఏమన్నదో చూడండి:

"There are not many decisions which have given an indepth interpretation of Article 27. The decision in.. 1954 Shirur Mutt case held that.. Article 27 is not attracted. The same view was taken in Jagannath Ramanj Das Vs. State of Orissa. The decision in T.M.A. Pai foundation Vs. State of Karnataka does not really deal with Article 27 at any depth".

(''రాజ్యాంగం 27వ అధికరణాన్ని లోతుగా వ్యాఖ్యానించిన కోర్టు తీర్పులు ఎక్కువ లేవు. 1954 నాటి శిరూర్‌ మఠం కేసులో 27వ అధికరణం దానికి వర్తించదని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పింది. అదే సంవత్సరం ఒరిస్సా ప్రభుత్వంపై జగన్నాథ్‌ రామానుజ దాస్‌ కేసులోనూ అంతే. 2003 సంవత్సరం కర్నాటక ప్రభుత్వంపై టి.ఎం.ఎ.పాయి ఫౌండేషన్‌ దావాలో కూడా 27వ అధికరణాన్ని కోర్టు నిర్ణయంలో చర్చించలేదు''.)

అంటే - రాజ్యాంగానికి షష్టిపూర్తి అయ్యే సమయానికి కూడా 27వ అధికరణానికి సంబంధించి ఎన్నదగ్గ కోర్టు తీర్పులు సుప్రీంకోర్టు ధ్రువీకరించిన ప్రకారమే కేవలం మూడు!

చరిత్రాత్మకమైన శిరూర్‌ మఠంకేసు (AIR 1954 SC 282) లో 27వ అధికరణం గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన వివరణ ఇది:

What is forbidden by Article 27 is the specific appropriation of the proceeds of any tax in payment of expenses for the promotion or maintenance of any particular religion or religious denomination. The reason underlying this provision is obvious. Ours being a secular state and there being freedom of religion guaranteed by the constitutions, if is against the policy of the constitution, to pay out of public funds any money for the promotion or maintenance of any particular religion or religious denomination.

(ప్రత్యేకంగా ఒక మతాన్ని లేక మతశాఖను ప్రోత్సహించడానికి, లేక పోషించటానికి అయ్యే ఖర్చులను ఎలాంటి పన్ను యొక్క రాబడి నుంచి భరించటాన్ని 27వ అధికరణం నిషేధించింది. దీనికి కారణమేమిటో కనపడుతూనే ఉంది. మనది సెక్యులర్‌ రాజ్యం. మత స్వాతంత్య్రానికి రాజ్యాంగం గ్యారంటీ ఇచ్చింది. కాబట్టి ప్రత్యేకంగా ఒక మతాన్నో, మతశాఖనో ప్రోత్సహించడానికి, లేక పోషించటానికి ప్రభుత్వ నిధులను ఉపయోగించటం రాజ్యాంగ తత్వానికి విరుద్ధం.)

అదృష్టవశాత్తూ మన పూర్వుల కాలంలో ఇలాంటి రాజ్యాంగ న్యాయం లేదు. కాబట్టి బతికిపోయాం. ప్రభుత్వ ధనాన్ని మత అవసరాలకు ఖర్చు పెట్టకూడదన్న నిషేధం వెనకటి రాజుల కాలంలో ఉండి ఉంటే మన ప్రసిద్ధ దేవాలయాలు, ఊరూరా చిన్నా పెద్దా గుళ్ళు, మఠాలు, గురుకులాలు, వేద పాఠశాలలు, వేదవిజ్ఞాన అధ్యయన సంస్థలు కొన్ని వందల సంవత్సరాల కిందటే ఇప్పటి అధోగతికి చేరేవి.

సరే! మనం ఉన్నది సెక్యులర్‌ రాజ్యంలో కాబట్టి సెక్యులర్‌గానే ఆలోచిద్దాం. ప్రత్యేకంగా ఒక మతాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వ నిధులను ఖర్చుపెట్టటాన్ని 27వ అధికరణం నిషేధిస్తుందని పై తీర్పులో సుప్రీంకోర్టు సెలవిచ్చింది కదా? మరి ఏటేటా మహమ్మదీయులు మక్కాకు చేసే హజ్‌యాత్రకు సబ్సిడీ కింద ప్రభుత్వ నిధులను ఖర్చుపెట్టటానికి రాజ్యాంగం ఒప్పుకుంటుందా? అది ప్రత్యేకంగా ఒక మతాన్ని ప్రభుత్వ నిధులతో  ప్రోత్సహించటం కాదా?

ఇంతకుముందు ప్రస్తావించిన సుప్రీంకోర్టు కేసులో ప్రఫుల్‌ గొరాడియా గారు సరిగ్గా ఇదే ప్రశ్న వేశాడు. దానికి 2011 జనవరి 28న జస్టిస్‌ మార్కండేయ కట్జు, జస్టిస్‌ జ్ఞాన్‌సుధా మిశ్రాల డివిజన్‌ బెంచి  ఏమని తేల్చిందో చూడండి:

"In our opinion Article 27 would be violated if a substantial part of the entire income tax collected in India, or a substantial part of any other tax collected in India, were to be utilized for promotion or maintenance of any particular religion or religious denomination. In other words, suppose 25 per cent of the entire income tax collected in India was utilized for promoting or maintaining any particular religion or religious denomination, that in our opinion, would be violative of Article 27

"..... it is nowhere mentioned in the Writ Petition as to what percentage of any particular tax has been utilized for the purpose of the Haj pilgrimage.  ...If only a relatively small part of any tax collected is utilized for providing some conveniences or facilities or concessions to any religious denomination, that would not be violative of Article 27".

(https://indiankanoon.org/doc/709044/)

''ఇండియాలో వసూలయ్యే మొత్తం ఆదాయపు పన్నులో పెద్ద భాగాన్ని, లేక ఇంకే పన్ను వసూళ్ళ నుంచయినా పెద్ద భాగాన్ని ఒక మతం లేక మత శాఖ మీద ఖర్చుపెట్టినప్పుడు మాత్రమే 27వ అధికరణం ఉల్లంఘన అవుతుంది. ఉదాహరణకు ఆదాయపు పన్ను మొత్తం వసూళ్ళలో ఏ 25 శాతాన్నో ఒక మతం లేక మతశాఖ మీద వినియోగించే పక్షంలో 27వ అధికరణం అతిక్రమణ కిందికి వస్తుంది.

''... హజ్‌యాత్ర మీద ఏ పన్ను వసూళ్ళ నుంచి ఎంత శాతాన్ని వినియోగించారన్నది రిట్‌ పిటీషన్‌లో ఎక్కడా పేర్కొనలేదు. ఏ పన్ను వసూళ్ళ నుంచయినా ఒక చిన్న భాగాన్ని ఏదైనా మతంవారి సౌకర్యాలు లేక రాయితీల నిమిత్తం కేటాయించినట్లయితే 27వ అధికరణానికి భంగం కలగదు."

తీర్పు  భేషుగ్గా ఉంది. ఎటొచ్చీ ఒకటే సందేహం. హజ్‌ సబ్సిడీ లాంటి అవసరాలకు సంబంధిత శాఖ బడ్జెటు నుంచి కదా ప్రభుత్వం ఖర్చు పెట్టేది? ఏ శాఖకు కేటాయించిన మొత్తం ఏఏ పన్ను వసూళ్ళ నుంచి ఎంతెంత శాతం అన్నది ఏ సూపర్‌ కంప్యూటర్‌ అయినా ఎలా లెక్క కట్టగలదు? ఏ పన్ను నుంచి వసూలు అయిన మొత్తంలో ఎంత శాతాన్ని హజ్‌ సబ్సిడీకి వినియోగించారు అని అడిగితే ప్రభుత్వమైనా జవాబు చెప్పగలదా? ప్రభుత్వానికే కష్టమైనప్పుడు కోర్టును ఆశ్రయించిన ఒక సామాన్య న్యాయార్థి నుంచి అలాంటి లెక్కలను ఆశించటం ఎంతవరకు సబబు? పన్ను వసూళ్లలో పర్సెంటేజి వివరాలు లేవన్న కారణంతో కేసు కొట్టేయ్యటం న్యాయమేనా?

ఇంకో సంగతి. ఏ పన్ను వసూళ్ళ నుంచి అయినా చిన్న భాగాన్ని ఒక మతం మీదో మత శాఖమీదో ఖర్చుపెట్టటంలో తప్పులేదు; దానివల్ల 27వ అధికరణానికి భంగం వాటిల్లదు అని సుప్రీంకోర్టు న్యాయపీఠం తేల్చి చెప్పింది  కదా? దాని ప్రకారం రేపు అమర్‌నాథ్‌ యాత్రకో, చార్‌ధామ్‌ యాత్రకో వెళ్ళే హిందువులకు రైలు ఛార్జిల్లో సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించవచ్చా? కోర్టువారు గీసిన 25 శాతం కటాఫ్‌కి తక్కువగా ఇన్‌కంటాక్సు లేక కస్టమ్స్‌ డ్యూటీ మొత్తం వసూళ్ళలో ఏ 20 శాతమో సదరు అవసరానికి ఖర్చు పెడతామంటే సుప్రీంకోర్టు సమర్థిస్తుందా?

''హిందూమతం పెద్దపులి. మైనారిటీ మతాలు చిన్న మేకలు. ఆ పులిబారి నుంచి ఈ మేకలను రక్షించటానికే మేము భూమి మీదికి వచ్చాం'' అన్నది నడమంత్రపు రాజకీయ జీవులు అల్లిన అబద్ధం. నిజానికి మైనారిటీ మతాలకు హిందూదేశం ఇచ్చేంత స్వేచ్ఛ, రక్షణ ప్రపంచంలో మరెక్కడా దొరకవన్నది చరిత్ర చాటే యదార్థం. పరమత సహనం హిందువుల రక్తంలోనే ఉంది. ఆ హిందువులు మెజారిటీగా ఉన్నంతవరకే మైనారిటీలు క్షేమంగా ఉండేది. ఈ సంగతి మిగతా మతాలవారికీ తెలుసు. క్షుద్ర రాజకీయ శక్తుల అండ చూసుకుని రెచ్చిపోయే మతపిచ్చిగాళ్ళ నోళ్ళు పెద్దవి అయి ఉండొచ్చు. కాని అన్య మతాలకు చెందిన ప్రజల సంఖ్యతో పోల్చినప్పుడు కరకు మతవాదుల సంఖ్య తక్కువే. కాబట్టే ప్రజా జీవితానికి సంబంధించినంతవరకూ మన దేశంలో మతపరమైన ఉద్రిక్తత ఎప్పుడోగాని తలెత్తదు. హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు కలిసే ప్రశాంతంగా సహజీవనం చేయగలుగుతున్నారు. కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ సామాన్య పౌరులు మతాలపోరు లేకుండా జీవిస్తున్నారు.

కుటిల రాజకీయ నాయకులు, జాతి వ్యతిరేక విచ్ఛిన్నశక్తులు, మిడిమేలపు మీడియా, వంకర బుద్ధి మేధావులు అగ్గిపుల్లలు గీసి మతాల మధ్య మంట పెట్టటానికి ఎన్ని కుట్రలు చేస్తున్నా సాధారణ మహమ్మదీయులకు, సాధారణ క్రైస్తవులకు హిందువుల పట్ల ద్వేషం, శత్రుత్వ భావం లేవు. తమ తమ మతాలకు వలెనే హిందూమతానికీ ప్రభుత్వ ఖజానా నుంచి ప్రోత్సాహకాలు అందనే కూడదని వారు పంతం పడతారని వాదించటం సరికాదు.

మాట వరసకు- దేశంలో ధూపదీప నైవేద్యాలకే తెరవులేని లక్షలాది హిందూ దేవాలయాల ఉద్ధరణకో, మరొక దైవ కార్యానికో నిధుల నిమిత్తం జాతీయ ప్రభుత్వం ఒక కొత్త పన్ను లేక లెవీని ప్రతిపాదించిందనుకుందాం. ఎవరిమీదా నిర్బంధం లేదు; ఇష్టమైనవారే దానిని చెల్లించవచ్చు అని అందులో ఆప్షను కూడా ఇస్తారనుకుందాం. రాజ్యాంగం 27వ అధికరణం దానిని అనుమతిస్తుందా? హజ్‌ సబ్సిడీ విషయంలో సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం మొత్తం పన్ను వసూళ్ళలో కొంత భాగాన్ని మాత్రమే హిందూమత సంస్థల ప్రోత్సాహానికో, పోషణకో వెచ్చిస్తామని చెబితే కోర్టులు ఒప్పుకుంటాయా?


ఆ సంగతి న్యాయప్రవీణులు చెప్పాలి. న్యాయస్థానాలు నిగ్గు తేల్చాలి. నాకైతే అనుమానమే. ''మతస్వాతంత్య్రానికి సంబంధించిన రాజ్యాంగ అధికరణాలు అన్ని మతాలకూ సమానంగా వర్తించే మాట నిజమే. కాని అవి ప్రధానంగా మైనారిటీల రక్షణకే ఉద్దేశించినట్టివి. ఆ వాస్తవాన్ని గుర్తుపెట్టుకునే కోర్టులు న్యాయనిర్ణయం చేయాలి'' అని ఉన్నత న్యాయవ్యవస్థ కుండబద్ధలు కొట్టిన వైనాన్ని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా?

దేశంలో అత్యున్నత న్యాయపీఠాలు అధిష్ఠించిన న్యాయమూర్తుల విజ్ఞతను విమర్శించటం తగదు. న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని, గౌరవాన్ని చులకన చేయటం మన వొంటికి మంచిది కాదు. కాబట్టి విమర్శలు, వ్యాఖ్యానాలు వద్దు. హజ్‌ సబ్సిడీ కేసులో 27వ అధికరణం గురించి ఇచ్చిన వివరణకు ముక్తాయింపుగా జగమెరిగిన న్యాయమూర్తి మార్కండేయ కట్జూ, జస్టిస్‌ జ్ఞాన్‌సుధా మిశ్రాలు ఈ దేశం గురించి, ఇక్కడి ప్రజలను గురించి, వారి సంస్కృతి గురించి ప్రకటించిన అమూల్యాభిప్రాయాన్ని మాత్రం ఆలకించండి.

India is broadly a country of immigrants like North America. 92% of the population of India consists of descendents of immigrants.. It is the greatness of the funding fathers that under the leadership of  Pandit Jawaharlal Nehru they decided to declare India a secular country instead of a Hindu country.. because 92 per cent of the people are descendants of immigrants, the only policy which can work and provide for stability and progress is secularism and giving equal respect to all communities, sects etc.

(ఉత్తర అమెరికాలాగే ఇండియా స్థూలంగా వలసదారుల దేశం. భారత జనాభాలో నూటికి 92 మంది ఇక్కడికి వలస వచ్చినవారి సంతతే! సంస్థాపక పితరుల గొప్పతనమేమిటంటే జవహర్‌లాల్‌ నెహ్రూ నాయకత్వాన వారు ఇండియాను హిందూదేశంగా కాకుండా సెక్యులర్‌ దేశంగా ప్రకటించారు. ప్రజల్లో 92 శాతం వలసదారుల సంతతి అయినందున అన్ని మతవర్గాలకూ, అన్ని శాఖలకూ సమాన గౌరవం ఇవ్వటం ద్వారానే   ప్రగతి, సుస్థిరత సాధ్యం!)

అన్ని మతాలకూ, అన్ని మతశాఖలకూ సమాన గౌరవం ఇవ్వాలనటం వరకూ పేచీలేదు. ఇతర మతాలను అణగదొక్కి తమకు మాత్రమే ప్రత్యేక హక్కులు ఇవ్వాలని హిందువులెవరూ కలనైనా కోరరు. కాని 'అమెరికాలాగే భారతదేశం కూడా వలసదారుల నానాజాతి సమితి' కాబట్టి సెక్యులరిజం ఒక్కటే దానికి దిక్కు' అన్న అవగాహనే తప్పు. ఎక్కడి నుంచో వచ్చిన ఆర్యులు భారతదేశాన్ని దౌర్జన్యంగా ఆక్రమించారని మాయదారి మాక్స్‌ముల్లర్లు పుట్టించిన తప్పుడు సిద్ధాంతాన్ని ప్రపంచమంతా ఏనాడో తుంగలో తొక్కినా ఇంకా వలసల కళ్ళతోనే ఈ దేశాన్ని చూసే అజ్ఞానులను ఏమనాలి? ఇటువంటి కుహనా మేధావులు న్యాయనిర్ణేతలైతే భారతీయ మతానికీ, దాని విలక్షణ సంస్కృతికీ న్యాయం ఎలా చేకూరుతుంది?

Thursday 6 September 2018

దగా పడ్డది హిందూమతం


పెక్యులరిజం - 12

ఎం.వి.ఆర్‌.శాస్త్రి
..............




ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః

తస్మా ద్ధర్మో న హంతవ్యో మానో ధర్మో హతోవధీత్‌

ధర్మాన్ని మనం భక్షిస్తే ధర్మం మనల్ని భక్షిస్తుంది. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. కాబట్టి ధర్మాన్ని ఎప్పుడూ చెడగొట్టకూడదు. చెరపబడని ధర్మం మనల్ని చెరపకుండును గాక!

ఇది ఎన్నో వేల సంవత్సరాలుగా మన పుణ్యభూమిలో ప్రజలకూ, ప్రభువులకూ శిరోధార్యమైన ధర్మసూత్రం.
నాణెం లాగే ధర్మానికీ రెండు ముఖాలు. ధర్మం బొమ్మ అయితే దైవం బొరుసు. ఆ దైవాన్ని చేరడానికి దారి చూపేది మతం. కాబట్టి ధర్మం కాపాడబడాలంటే మతాన్ని కాపాడి తీరాలి.

ఆ వివేకంతోటే యుగయుగాల్లో తరతరాలుగా ఈ వేదభూమిని ఏలిన ధర్మ ప్రభువులందరూ సనాతన ధర్మానికి, దానికి ప్రతిరూపమైన వైదిక మతానికి.. ఆ మతంలో భాగమైన శాస్త్రాల అధ్యయన, బోధనలలో నిమగ్నమైన గురుకులాలకు, విద్యా పీఠాలకు.. మతానికి ఆలవాలమైన దేవాలయాలకు.. ధర్మ ప్రచారానికి, మతవ్యాప్తికి, దైవ సేవకు అంకితమైన పుణ్యాత్ముల పోషణకు సకల విధాల తోడ్పడ్డారు. విదేశీ రాకాసులు వచ్చిపడి హిందూ దేశాన్ని శతాబ్దాల పర్యంతం తమ కబంధ హస్తాల్లో చిక్కించుకోసాగిన తరవాత కూడా కృష్ణదేవరాయల వంటి మహారాజులు తిరుమల నుంచి సింహాచలం దాకా తెలుగునాట ఎన్నో ప్రాచీన దేవాలయాలకు వేల ఎకరాల మాన్యాలు, వెలలేని రత్నాభరణాలు, పూజాదికాలకు కైంకర్యాలకు లోటు రాకుండా శాశ్వతమైన ఏర్పాట్లు చేసి తరించారు. ఒక మోస్తరు సంస్థానాలకు మాత్రమే అధిపతి అయి, రాజకీయ ఆర్థిక సమస్యలు ఎన్నో ఉండికూడా అహల్యాబాయి హోల్కర్‌ అనే మహాసాధ్వి.. అన్యమత రాక్షస శక్తులు ధ్వంసం చేసిన సోమనాథ్‌, కాశీ వంటి పుణ్యక్షేత్రాలను పునరుద్ధరించి చరితార్థురాలైంది. దేశమంతటా జీర్ణ దేవాలయాల ఉద్ధరణకు, ప్రసిద్ధ దేవస్థానాల వైభవానికి, జగద్గురు శంకర పీఠాలకు, పుష్పగిరి, మంత్రాలయం వంటి ఎన్నో మఠాలకు, అనేకానేక మత సంబంధ సంస్థలకు హిందూ రాజులు, చిన్నా పెద్దా సంస్థానాధీశ్వరులు చేసిన దానధర్మాలకు లెక్కలేదు. మతపరమైన కార్యకలాపాలకు, దేవతామూర్తుల ఉత్సవాలకు, ధర్మ కార్యాలకు హిందూ ప్రభువులు ఇచ్చిన భూరి విరాళాలు ఎంత చెప్పినా తరగనివి.

పైన ఉదాహరించిన సహాయాలు, దానధర్మాలు అన్నిటికీ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మహారాజులు, మహారాణులు, సంస్థానాధీశ్వరులు తమ ఇంట్లో ఇనప్పెట్టెలోంచి తీసి ఇచ్చారా? లేదు. రాజ్య కోశాగారం నుంచే ఆయా దైవ సేవలకు, ధార్మిక కార్యాలకు ఖర్చు పెట్టారు. ఆ కోశాగారం డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? పన్నులు, శిస్తులు, రుసుముల రూపేణా ప్రజలు చెల్లించిన సొమ్ము అది.

అనగా - పన్నులు వగైరాల రూపేణా ఖజానాకు జమపడే సొమ్మును అవసరమైన మేరకు మతం కోసం ప్రభువులు ఖర్చు పెట్టటం అనేది మన దేశంలో ఆది నుంచీ ఉన్న ఆనవాయితీ.

ఒక హిందూమతం, ఒక్క హిందూదేశం అనే ఏమిటి? తూర్పు, పడమర తేడా లేకుండా ప్రపంచమంతటా అన్ని కాలాల్లో ఉన్న పద్ధతే ఇది. 17వ శతాబ్దం వరకూ ఐరోపాలో రాజులు క్రైస్తవ మత ప్రచారకులుగా, చర్చి చేతిలో రాజకీయ ఆయుధాలుగా పనిచేసి, ప్రభుత్వ వ్యవస్థనంతటినీ క్రైస్తవ మతానికి ఎలా పాదాక్రాంతం చేశారో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. మన దేశంలోనూ ఢిల్లీ సుల్తాన్ల హయాంలో, మొగలాయీల కాలంలో ఇస్లాం ఆధికారిక మతం. నవాబులు, పాదుషాలు ముస్లిం మతవ్యాప్తికి, మసీదుల నిర్మాణానికి, ముస్లిం సంస్థల నిర్వహణకు పెద్ద మొత్తాలు ఖర్చు పెట్టేవారు. ఇస్లామిక్‌ మత సంస్థలకు, మత ప్రచారకులకు పన్నుల నుంచి మినహాయింపు ఇచ్చేవారు. కాఫిర్లయిన హిందువులను చంపకుండా వదిలేసినందుకు ప్రతిగా ప్రతి హిందువు తలకూ లెక్కగట్టి జిజియా పన్ను వసూలు చేసేవారు. ముస్లింలు కానివారి మీద ఎడాపెడా పన్నులు బాదేవారు.




సెక్యులరిజం పొద్దుపొడిచి, చర్చి భల్లూకపు పట్టునుంచి ఐరోపా రాజ్యవ్యవస్థ విముక్తమైందని మనవాళ్లు చెప్పిన కాలంలోనూ క్రైస్తవ మతానికి ప్రభుత్వాల నుంచి రకరకాల ప్రోత్సాహకాలు దొరికేవి. ఎక్కడిదాకానో ఎందుకు? భారతదేశం సంగతే చూడండి. క్రైస్తవ మతం దూకుడుకు కాస్తో కూస్తో మూకుతాడు వేసిందని అందరూ భావించే బ్రిటిషు పాలనలోనూ దేశంలో ఎన్నో ఆంగ్లికన్‌ చర్చ్‌లు ప్రభుత్వ ఖర్చుతో నిర్మాణమయ్యాయి. వాటికీ, కాథలిక్‌, ప్రొటెస్టంట్‌ అన్న తేడా లేకుండా దేశంలోని ఇతర చర్చ్‌ల నిర్వహణకూ బ్రిటిషు ప్రభుత్వం తన ఖజానా నుంచి నిధులు ఇచ్చేది. ఈ వ్యవహారాలు చూడటానికి ప్రభుత్వంలో ప్రత్యేకంగా Ecclesiastical (క్రైస్తవ మత సంబంధమైన) డిపార్టుమెంటు ఒకటి ప్రత్యేకంగా ఉండేది. ఈస్టిండియా కంపెనీ కాలం నుంచీ నిరాఘాటంగా సాగుతూ వచ్చిన చర్చి సహాయ కార్యకలాపాల క్రమబద్ధం నిమిత్తం 1927లో The Indian Church Act అనే చట్టం వచ్చింది. గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా రెవిన్యూల నుంచి చర్చిలకు వాటికి సంబంధించిన కార్యకలాపాలకు ప్రభుత్వ గ్రాంటు మంజూరు చేయడానికి అందులో అవకాశం ఇచ్చారు. కలకత్తాలోని బిషప్‌ ఆధ్వర్యంలో, గవర్నర్‌ జనరల్‌ ఆమోదంతో, ఇండియాకు సంబంధించిన బ్రిటిష్‌ విదేశాంగ మంత్రి ప్రమేయంతో ఈ వ్యవహారాలు నడిచేవి. ఇండియా నుంచి తట్టాబట్టా సర్దుకుని ఇంగ్లీషువాళ్లు పోయాక 1948 మార్చిలో Ecclesiastical డిపార్టుమెంటును ఎత్తేశారు.

ఇదీ చరిత్ర. దీన్ని బట్టి అర్థమయ్యేదేమిటంటే, ఆంగ్లమానస పుత్రులైన మన మేధావులు నెత్తిన పెట్టుకునే ఇంగ్లీషు దొరలు కూడా ఈ దేశంలో తమ పెత్తనం సాగినంత కాలమూ, పన్నుల రూపంలో ఈ దేశ ప్రజల నుంచి వసూలు చేసిన దానిలో పెద్ద మొత్తాలను తమ క్రైస్తవ మతం అభివృద్ధికి - దానికోసం ప్రత్యేకంగా ఒక డిపార్టుమెంటు పెట్టి మరీ ఖర్చు చేశారు. సెక్యులర్‌ మహామేధావుల దృష్టిలో వంక లేని అభ్యుదయ వాదులైన మహమ్మదీయులు కూడా తమ హయాంలో తమ మతానికి ప్రభుత్వం నుంచి పెద్ద సహాయాలు పొందారు.

మరి - విదేశీ పీడ విరగడై, స్వతంత్ర దేశానికి సొంత రాజ్యాంగం రాసుకునే సందర్భాన న్యాయంగా అయితే ఏమి చేసి ఉండవలసింది? ఇంచుమించు ఏడు శతాబ్దాలు విదేశీమతాల రాజకీయ ప్రాబల్యం కింద నలిగి, నానా విధాల ఆంక్షలతో సతమతమై, ఎన్నో ఒత్తిళ్ళను తట్టుకుని తన ఉనికిని కాపాడుకునేందుకు నానా అవస్థపడిన హిందూమతానికి స్వేచ్ఛగా వర్థిల్లేందుకు ప్రభుత్వపరంగా ఇవ్వగలిగిన తోడ్పాటునంతా ఇవ్వవద్దా? నూటికి 80 మందికి పైగా హిందువులైన దేశంలో పన్నుల రూపేణా వసూలయ్యే మొత్తంలో కొంతమేరకు హిందూమతం శ్రేయస్సుకు, అభివృద్ధికి ప్రత్యేకంగా ఖర్చు పెట్టటానికి ఎవరికైనా అభ్యంతరం ఎందుకుండాలి?

న్యాయంగా అయితే ఉండక్కర్లేదు. దాదాపు ఒక వెయ్యి సంవత్సరాలు విదేశీ మతాల దాష్టీకంలో నానా అగచాట్లు పడి, అన్ని విధాల కుంగిన దేశం మళ్ళీ తెప్పరిల్లాలంటే ఆ దేశానికి ప్రాణం అయిన సనాతన ధర్మం, దానికి ఆలంబనమైన హిందూమతం చల్లగా వర్ధిల్లాలి. దానికి స్వదేశీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి, సర్వవిధాల సహాయపడాలి. హిందూమతం సర్వతోముఖ వికాసానికి ఆర్థిక సమస్య తలెత్తకుండా రాజ్యాంగపరంగా గట్టి కట్టుదిట్టాలు చేయాలి.

- అని మీరు, నేను అనుకోవచ్చు. ఇది స్వతంత్ర భారతానికి ఒక రాజ్యాంగం రాసేందుకు కొలువుదీరిన వారికి ఇలాంటి పాతకాలపు చాదస్తాలు లేవు. హిందూమతం అంటూ ఒకటున్నదనీ, శతాబ్దాలపాటు పడిన బాధల నుంచి కోలుకోవడానికి దానికి రాజ్యం నుంచి తోడ్పాటు అవసరమనీ తలపోసేటంత సంకుచిత మనస్తత్వం వారికి లేదు. వారి ఆరాటమల్లా ఎంతసేపూ మైనారిటీ మతాలమీద! మైనారిటీలకు ఇవ్వటానికి వీలు పడనిది ఏదీ మెజారిటీ మతానికీ అనుమతించకూడదు అన్నదొక్కటే వారికి తెలిసిన సెక్యులర్‌ న్యాయం. ఆ సమవర్తిత్వంతోటే రాజ్యాంగం 27వ అధికరణంలో ప్రశస్తమైన కట్టడి చేశారు. ఇలా :

27. Freedom as to payment of taxes for promotion of any particular religion. No person shall be compelled to pay any taxes, the proceeds of which are specifically appropriated in payment of expenses for the promotion or maintenance of any particular religion or religious denomination.

(27. ప్రత్యేకంగా ఒక మతాన్ని ప్రోత్సహించడం కోసం పన్నులు కట్టడానికి సంబంధించిన స్వాతంత్య్రం. ప్రత్యేకంగా ఒక మతాన్ని గాని, మతశాఖను గాని ప్రోత్సహించడానికి లేక పోషించటానికి అయ్యే ఖర్చులను చెల్లించటానికి ఏ రకమైన పన్నుల రాబడిని అయినా నిర్దిష్టంగా ఉపయోగించదలిస్తే - అట్టి పన్నులను చెల్లించాలని ఏ వ్యక్తినీ బలవంత పెట్టకూడదు.)

ఇస్లాం మతాన్నో, క్రైస్తవ మతాన్నో పోషించటానికి ఒక పన్ను వేస్తామంటే మెజారిటీ అయిన హిందువులు ఎలాగూ ఒప్పుకోరు. మెజారిటీ ప్రజలకు ఆమోదయోగ్యంగా అలాంటి పన్ను వేస్తే గీస్తే మెజారిటీ అయిన హిందూమతం మీదే వేయాలి కదా! మెజారిటీ ప్రజలు కోరుకున్నా సరే అలాంటి పన్ను వనరు ఏదీ హిందూమతానికి ఎప్పటికీ అందుబాటులోకి రాకుండా 27వ అధికరణం శాశ్వతంగా తలుపులు మూసింది.

పన్ను అనేది వేస్తే పౌరులందరూ దానిని కట్టి తీరాలి. వారిలో అన్ని మతాలవారూ ఉంటారు. వేరే మతం కోసం ఉపయోగపడేదానిని తాను ఎందుకు చెల్లించాలి అని ఇతర మతాలవారు అభ్యంతరం తెలపటం సహజం. తమ మతం ఒక్కటే సత్యమని, మిగతావన్నీ తప్పుడు మతాలనీ నమ్మేవారు ముమ్మాటికీ దానికి అంగీకరించరు. అంగీకరించాలని వారిని బలవంతపెట్టటం అన్యాయం, దుర్మార్గం. అక్కడివరకూ పేచీ లేదు. ఇష్టపడని వేరే మతం వారి నుంచి ఏ మత పన్నునూ బలవంతంగా వసూలు చేయరాదు. ఒప్పుకుందాం. కాని ఇతర మతస్థులకు కూడా అభ్యంతరం ఉండని సందర్భాల సంగతేమిటి?



మాట వరసకు అయోధ్యలో రామాలయ పునర్నిర్మాణం హిందువుల చిరకాల వాంఛ. దానిపై హిందూ, ముస్లిం వర్గాల మధ్య నడుస్తున్న వ్యాజ్యం సుప్రీంకోర్టులో చివరి దశకు చేరింది. హిందువుల సెంటిమెంటు గాఢతను గుర్తించి మహమ్మదీయులు పెద్ద మనసుతో కాస్త వెనక్కి తగ్గే అవకాశం అత్యల్పంగా అయినా లేకపోలేదు. ఏ పెద్ద మనుషుల మధ్యవర్తిత్వమో ఫలించనూవచ్చు. లేదా సుప్రీంకోర్టు నిర్ణయం అనుకూలంగా రానూవచ్చు. ఇంకేదో అద్భుతం జరిగి రామాలయ నిర్మాణానికి ముస్లిం సోదరులు స్వచ్ఛందంగా సహకరించనూ వచ్చు. ఒకవేళ అలాంటిదేదో జరిగినా - నిర్మాణ వ్యయం నిమిత్తం ఏదైనా కొత్త పన్ను లేక లెవీని అందరి ఏకాభిప్రాయంతో ప్రభుత్వం విధించాలనుకుంటే రాజ్యాంగ 27వ అధికరణం దానిని అనుమతిస్తుందా? నిర్బంధమేమీ లేదు; ఎవరినీ బలవంతపెట్టం. ఐచ్ఛికంగా ఇచ్చేవారి నుంచే వసూలు చేస్తాం అనే పద్ధతిన ఏదైనా పన్నులాంటిది హిందూ మత ప్రయోజనం కోసం విధించగల అవకాశం రాజ్యాంగరీత్యా ఇప్పుడున్నదా?

ఇస్లాం, క్రైస్తవాలు విదేశీ మతాలు. ప్రపంచంలో క్రైస్తవ దేశాలు, ముస్లిం దేశాలు డజన్ల సంఖ్యలో ఉన్నాయి. వాటి ప్రభుత్వాల చేతిలో అపార ఆర్థిక వనరులు ఉన్నాయి. ఇండియా లాంటి దేశాల్లో ఆ మతాల వ్యాప్తికి లక్షల కోట్ల బడ్జెటుతో పనిచేసే మతవ్యవస్థలున్నాయి. జోషువా ఫౌండేషన్లు, ఇస్లామిక్‌ బ్రదర్‌ హుడ్‌లు సరేసరి. ఎన్నో సంపన్న దేశాల, విదేశీ సంస్థల అండ, దండ ఉన్న మతాలకు నిధుల లేమి ఉండదు. అంతర్జాతీయంగా ఏ అండా లేనిది ప్రపంచంలో మూడో పెద్ద మతమైన హైందవానికి! దానికి ఏకైక ఆలంబనం ఇండియా! ఉన్న ఆ ఒక్క హిందూ దేశంలోనూ ప్రభుత్వాదరణ కరువైతే.. పన్నుల రూపేణా జమపడే ప్రజల సొమ్మును ఆ ప్రజల్లో నూటికి 80 మంది ఆచరించే మతం అభివృద్ధికి ఖర్చుపెట్టే వీలు లేకపోతే ఇక హిందూమతం ఎలా బతకాలి? శతాబ్దాల పర్యంతం అన్యమతాల నుంచి ఎదుర్కొన్న సమస్యల నుంచి బయటపడేందుకు స్వరాజ్యంలోనూ ప్రభుత్వం చేయూత ఇవ్వకపోతే హిందూమతం ముందుకు ఎలా పోతుంది?

విషాదం ఏమిటంటే మతానికి సాయపడటం ప్రభుత్వ బాధ్యత అని సహస్రాబ్దాలుగా ఈ దేశంలో పాటించబడిన రాజధర్మాన్ని మన్నించాలన్న వివేకం ఆధునిక కాలపు పాలకులకు లేదు. తెలియకపోతే దానిని వారికి తెలియజెప్పాలన్న విజ్ఞత హిందూసమాజానికీ లేదు. అసలైన బాధితులలోనే చలనం లేనప్పుడు ఆ అన్యాయాన్ని సరిచేయటం పాలకులకు, రాజకీయ గోమాయువులకు ఏమి పట్టింది?
1

Saturday 1 September 2018

వేదం మనకు వరమా? శాపమా?

వేదం మనకు వరమా ? శాపమా? వేదం ఎందుకు? ఎవరి కోసం? వేద.సంస్క్రతి ప్రాధాన్యం ఏమిటి?
ఈ విషయాల మీద రెండేళ్ల కింద హైదరాబాద్ శివారు రామచంద్రాపురం లో రేమెళ్ళ అవధాని గారి వేదభారతి సభలో నా ప్రసంగం. ఇప్పుడే ఒక మిత్రుడు పంపారు.
https://youtu.be/wAm8b0yebVk