Thursday 24 May 2018

ఏమి సాధించారు యువరానర్‌ ?!


ఉన్నమాట

ఎం‌.వి.ఆర్‌.శాస్త్రి

.......


    'మీరు బిజెపికి 'బి' టీమ్అని రాహుల్గాంధి అంటున్నాడు. మీరేమంటారు?'

     'పిచ్చి రాహుల్గాంధీకి కర్ణాటక రాజకీయాల ఎబిసిడిలు తెలియవు. తమకి అవసరమైనప్పుడు మమ్మల్ని వాడుకున్న కాంగ్రెసువాళ్లు ఇప్పుడు మమ్మల్ని 'బి' టీమ్అంటున్నారు. నేను చాలాసార్లు చెప్పాను. దేశంలో ప్రజాస్వామ్యానికి బిజెపి కంటే కాంగ్రెస్ఎక్కువ ప్రమాదకారి. ఇవాళ మేము బిజెపి పక్కన నిలబడి ఒక దగ్గు దగ్గితే చాలు. కాంగ్రెసు కర్ణాటకలో కొట్టుకుపోతుంది'.

    ఇదీ - కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నెలరోజుల ముందు దేవయ్య కొడుకు కుమారస్వామి 'మింట్‌'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినమాట. అతడికి బుద్ధి అనేది ఉండి, అన్నమాటకు కట్టుబడి, ఎన్నికల స్వయంవరంలో ప్రజలు వరించిన బిజెపి పక్కన నిలబడి ఉంటే, నిజంగా అంతపనీ జరిగేదే ! జనం చీకొట్టి కాలితో తన్ని పారేసిన కాంగ్రెస్కర్ణాటకలో మట్టి కొట్టుకు పోయేదే ! తన తాహతును తాను గుర్తెరిగి, బిజెపి ఇవ్వజూపిన ఉపముఖ్యమంత్రి పదవికి అతడు తృప్తిపడి ఉంటే ప్రజాభీష్టానికి తగ్గట్టు సుస్థిర ప్రభుత్వం ఏర్పడేదే !

    కాని, కాంగ్రెసు శకునులు తనకి ముఖ్యమంత్రి పదవిని ఎరవేసే సరికి అదే కుమారస్వామి దురాశతో అడ్డం తిరిగాడు. 'బిజెపి కంటే ఎక్కువ ప్రమాదకారి'గా తాను తలచి, ఎన్నికల్లో భీకరంగా పోరాడిన కాంగ్రెసుతోనే సిగ్గు ఎగ్గూ లేకుండా ఇప్పుడు కుమ్మక్కు అయ్యాడు.

     'జనతాదళ్‌ (ఎస్‌) లో 'ఎస్‌' అంటే 'సెక్యులర్‌' కాదు, 'సంఘ్‌' ! జెడి (ఎస్‌) అనేది నిజానికి 'జనతాదళ్సంఘ్పరివార్‌', అది బిజెపికి 'బి' టీమ్‌' అని ఎన్నికల ప్రచారంలో ఈసడించిన రాహుల్అనబడే 'పప్పు' ఎన్నికల్లో తన పార్టీని కర్ణాటక ప్రజలు తన్ని తగలేసిన తరువాత జనం గెలిపించిన భాజపాకు అధికారం అందనీయకూడదన్న అక్కసుతో అదే 'బి' టీమ్ని నెత్తికి ఎత్తుకున్నాడు. ఎన్నికల సమయంలో చడామడా తిట్టుకున్న, బద్ధ శతృవుల్లా కత్తులు దూసుకున్న కాంగ్రెసు, జెడి (ఎస్‌) లు ఇరువురి నోట్లోనూ మన్ను పడినట్లు ఫలితాల్లో తేలగానే నీతీ రీతీ లేకుండా చేతులు కలిపారు. ప్రజలు కోరుకున్న భాజపాకు రాష్ట్రాన్నేలే అవకాశం దక్కనివ్వకుండా లాలూచీ అయ్యారు.

    మెడమీద తల, దానిలోపల మెదడు ఉన్న మనిషికైనా ఇది అనైతికం, అప్రజాస్వామికం, పచ్చి అవకాశవాదం అని అర్థమవుతుంది. బిజెపికి శాపాలు పెట్టటమే పనిగా పెట్టుకున్న మన మెదడు పుచ్చిన కుహనా మేధావుల  కామెర్ల కళ్లకు మాత్రం కాంగ్రెసు, జెడి (ఎస్‌) అపవిత్ర కలయిక మహానీతిబద్ధంగా కనపడుతున్నది.

    కర్ణాటక అసెంబ్లీలో ఎన్నికలు జరిగిన మొత్తం సీట్లు 222. అందులో బిజెపి గెలుచుకున్నవి 104. పూర్వపాలక పక్షం కాంగ్రెసుకు దక్కినవి 78. త్రిముఖ పోటీలో మూడో పార్టీ జెడి (ఎస్‌) కి వచ్చినవి 38. ప్రజల తీర్పు మొగ్గింది ఎవరివైపు అన్న విషయంలో ఏమాత్రమైనా అస్పష్టత ఉందా ?


    నికరమైన మెజారిటీ ఉండాలంటే కావలసిన సంఖ్య 112. అవి బిజెపికి 8 మాత్రమే తక్కువ. 'మేజిక్ఫిగర్‌' అనేది మీడియావాళ్లు, అమాంబాపతు మేధావులు పుట్టించిన మాట. 'మాజిక్ఫిగర్‌'కి కచ్చితంగా చేరితేగాని పార్టీకైనా రాజ్యాధికారం అపేక్షించే హక్కు ఉండదని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. స్పష్టమైన మెజారిటీ తమకు ఉన్నట్టు చూపిస్తేగాని, ప్రభుత్వం ఏర్పాటుకు పార్టీనీ గవర్నరు పిలవనేకూడదన్న రూలు ఏదీ లేదు.

     ముఖ్యమంత్రి నాయకత్వంలో మంత్రిమండలి ఉండాలని రాజ్యాంగం 163 అధికరణం చెబుతుంది. ముఖ్యమంత్రిని, ఆయన సలహా మేరకు మంత్రులను గవర్నరు నియమిస్తారని, రాష్ట్ర విధానసభకు మంత్రిమండలి సమష్టిగా బాధ్యత వహిస్తుందని 164 అధికరణం నిర్దేశిస్తుంది. ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రిగా ఎవరిని ప్రాతిపదిక మీద నియమించాలన్నది గవర్నరు విజ్ఞతకు రాజ్యాంగం వదిలేసింది. తన విచక్షణాధికారం మేరకు గవర్నరు చేసే నిర్ణయమే ఫైనల్అని, దానిని ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదని 163 అధికరణం స్పష్టం చేసింది.

    అసెంబ్లీకి సమష్టి బాధ్యత వహించాలంటే మంత్రి మండలికి సభలో మెజారిటీ ఉండాలి. సభా విశ్వాసం పొందడానికి సరిపడా మెజారిటీ పార్టీకీ ఎన్నికల్లో దక్కనప్పుడు, ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరిని పిలవాలన్నది రాజ్యాంగంలో వాచ్యంగా ఎక్కడా పేర్కొననప్పుడు అప్పుడున్న పరిస్థితికి తగ్గట్టు, ప్రజాభీష్టానికి అనుగుణంగా తాను ఉచితమని భావించిన నిర్ణయం గవర్నరు చేయాలి. ఇందుకు సంబంధించి వివిధ సందర్భాల్లో న్యాయస్థానాలు, రాజ్యాంగ నిపుణులు, సర్కారియా కమిషన్‌ (1983), పుంచ్ఛి కమిషన్‌ (2007) లాంటి ఉన్నతస్థాయి విచారణ సంఘాలు వెలిబుచ్చిన ఏకాభిప్రాయం ఏమిటంటే..

స్పష్టమైన మెజారిటీ పార్టీకీ రానప్పుడు గెలిచిన స్థానాల ఆధిక్యాన్ని బట్టి వరసక్రమంలో ప్రాధాన్యం ఇలా ఇవ్వాలి.

1. ఎన్నికలకు ముందే కుదిరిన పొత్తుకు,

2. సంఖ్యాపరంగా అన్నిటిలోకి పెద్దపార్టీకి,

3. ఎన్నికల తరువాత కలిసిన పొత్తుకు,

4. బయటినుంచి మద్దతుపై ఆధారపడిన ఎన్నికల అనంతర పొత్తుకు.

    ప్రస్తుత కర్ణాటక విషయంలో ఎన్నికలకు పూర్వం పొత్తు అనేది రెండు పార్టీల నడుమ లేదు. కాబట్టి ప్రాధాన్య క్రమంలో సింగిల్లార్జెస్ట్పార్టీకి అవకాశం ఇవ్వడం సముచితం. అంటే సంఖ్యాపరంగా అత్యధిక స్థానాలు గెలుచుకున్న భారతీయ జనతాపార్టీకి మొదటి అవకాశం ఇవ్వడం సరైన నిర్ణయం. నిర్ణీత వ్యవధిలోగా సభావిశ్వాసం చూరగొనడంలో పార్టీ విఫలమైతే, తరువాత అవకాశం ఎన్నికల తరువాత పొత్తు కలిపిన కాంగ్రెసు, జెడి (ఎస్‌) కూటమికి ఇవ్వాలి. సభా విశ్వాసం పొందడం దానివల్ల కూడా కాకపోతే రాష్ట్రపతి పాలన విధించాలి.

    కర్ణాటక గవర్నరు వజుభాయి అనుసరించింది రాచమార్గాన్నే ! రంగంలో ఉన్నవి మూడే పార్టీలు. వాటిలో మెజారిటీకి బహు చేరువలో ఉన్నది బిజెపి ఒక్కటే. దానిని వదిలేసి ఎక్కడో అడుగున పడి ఉన్న కాంగ్రెసును గాని, దానికంటే అధ్వాన్నమైన జెడి (ఎస్‌) ను గాని పట్టించుకునే వీలేలేదు. కాబట్టి గవర్నరు బిజెపి పక్ష నాయకుడు యడ్యూరప్పను ముఖ్యమంత్రిగా నియమించారు. అది ముమ్మాటికీ సముచితం, ప్రజాస్వామ్యబద్ధం.



     నీతిని ఏనాడో ఒగ్గేసిన కాంగ్రెసు వారు, గూటి పెంపుడు చిలకలైన  మేధావులు, మీడియా పక్షపాతులు సమంజస నిర్ణయాన్ని అంతలా తప్పు పట్టారు కదా ! ఒకవేళ ఎన్నికల ఫలితాలు తారుమారై ఉంటే ? కాంగ్రెసు వాళ్లు కలలుగన్నట్టు వారిదే సింగిల్లార్జెస్ట్పార్టీ అయి ఉంటే ? వారి భాషలో 'బి' టీమ్అయిన జెడి (ఎస్‌) కాస్తా '' టీమ్బిజెపితో పొత్తు కలిపి, రెండిటికీ కలిసి స్పష్టమైన మెజారిటీ కనపడి ఉంటే ? ఇప్పుడు కాంగ్రెసు బాండుమేళం భాజాలు వాయిస్తున్న ప్రకారమే గవర్నరు స్పష్టమైన మెజారిటీ ఉందన్న కారణంతో బిజెపి-జెడి (ఎస్‌) అలయెన్సు నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమించి ఉంటే ? ఇవే పలుగాకులు ఎంతలా గుండెలు బాదుకునేవి !? ప్రజాస్వామ్యం మర్డరై పోయిందంటూ ఎంత గోలపెట్టేవి !?

    నిజానికి గవర్నరు అలాంటి పని ఎక్కడ చేస్తాడోనని ఫలితాలు తెలిసే ముందు వరకూ కాంగ్రెసు హడలిపోయింది. ఒకవేళ తాము సింగిల్లార్జెస్ట్పార్టీగా అవతారమెత్తితే, సింగిల్లార్జెస్ట్పార్టీ అయిన తమకు మొదటి అవకాశం ఇవ్వకుండా, ఎన్నికల తరువాత నీతిమాలిన పొత్తు కలిపిన బిజెపి-జెడి (ఎస్‌) కూటమికి ఆహ్వానం పంపి రాజ్యాంగ స్ఫూర్తిని గవర్నరు వమ్ముచేశాడు; కాబట్టి మాకు న్యాయం చేయండంటూ రాత్రికి రాత్రి సుప్రీంకోర్టు తలుపు తట్టటానికి కాంగ్రెసు 'సిబాల్‌'లు పిటిషన్లు సిద్ధం చేసుకున్నారు కూడా !

    అయితే కథ అడ్డం తిరిగి బిజెపి సింగిల్లార్జెస్ట్పార్టీ అయ్యేసరికి కాంగ్రెస్పిల్లిమొగ్గ వేసి, జెడి (ఎస్‌) తో పొత్తు కలిపింది. జెడి (ఎస్‌) తో తమ ఆపద్ధర్మ అక్రమ సంబంధాన్ని గవర్నరు గౌరవించకపోవడం రాజ్యాంగ విరుద్ధమంటూ కొత్తబాణీలో అర్థరాత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

    కాంగ్రెసు వాళ్లు నీతి, నియామాల జంజాటాన్ని కాశీలో ఏనాడో వదిలేశారు కాబట్టి వారి అడ్డగోలు వాదాలకు ఎవరూ విలువ ఇవ్వక్కర్లేదు. మధ్య గోవా, మణిపూర్‌, మేఘాలయ రాష్ట్రాల్లో సీట్లపరంగా అతిపెద్ద పార్టీగా ఉన్న తమను కాదని ఎన్నికల అనంతరం కుదిరిన భాజపా అలయెన్సుకు గవర్నరు అధికారం అప్పగించటం దుర్మార్గమనీ, సభా విశ్వాసం పొందుతారా లేదా అన్నది చూడకుండా సింగిల్లార్జెస్ట్పార్టీకి తొలి అవకాశం ఇచ్చి తీరాలనీ తాము చేసిన గంభీర భాషణాన్ని వాళ్లు సమయానుకూలంగా తూనాబొడ్డు అనవచ్చు గాక. ఆశ్చర్యం ఏమిటంటే - అన్నీ తెలిసిన సుప్రీంకోర్టు అడ్డగోలు వాదానికి 'ఔట్ఆఫ్ది వే' గా పోయి చెవిని ఒగ్గడం ! తనకు మాలిన పనిని తీరికూర్చుని తనపైన వేసుకోవడం.

     సర్వోన్నత న్యాయస్థానం అయినంత మాత్రాన ఏది పడితే తగవులో తలదూర్చే అధికారం సుప్రీంకోర్టుకు లేదు. సుప్రీంకోర్టు 'ఒరిజనల్జూరిస్డిక్షన్‌' ను నిర్వచించిన 131 అధికరణంలో - కేంద్రానికీ రాష్ట్రాలకూ నడుమ, రాష్ట్రాల మధ్య ఉత్పన్నమైన తగవుల ప్రస్తావన మాత్రమే ఉన్నది. ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారంలో తమకు అన్యాయం జరిగిందని భావించినవారు వెళ్లవలసింది రాష్ట్ర హైకోర్టుకే తప్ప సుప్రీంకోర్టుకు కాదు. దీనిపై ఒరిజినల్ఫిటిషన్ను గాని, రిట్పిటిషన్ను గాని విచారించే జూరిస్డిక్షన్సుప్రీంకోర్టుకు లేదని రాజ్యాంగ వేత్తల అభిప్రాయం.

     కేంద్ర ప్రభుత్వానికి ప్రమేయం ఉన్న విషయమైతే సుప్రీంకోర్టు తప్పక విచారించవచ్చు. కాని ఇప్పటి కేసులో కేంద్రప్రభుత్వానికి సంబంధం లేదు. నిర్ణయం చేసింది గవర్నరు. అతడు 154 అధికరణం కింద భారత రాష్ట్రపతి చేత రాష్ట్రానికి ఎగ్జిక్యూటివ్హెడ్గా నియమించబడ్డవాడు. కేంద్రప్రభుత్వ ప్రతినిధి లేక ఏజంటు కానేకాడు. తన అధికారాలను ఉపయోగించి, విధి నిర్వహణలో చేసే పనికి సంబంధించీ గవర్నరు న్యాయస్థానానికీ జవాబు చెప్పనవసరం లేదని రాజ్యాంగం 361 (1) అధికరణం 'ఇమ్యూనిటి' కల్పించినప్పుడు, విధి నిర్వహణలో భాగంగా ముఖ్యమంత్రి నియామకానికి సంబంధించి గవర్నరు చేసిన నిర్ణయంలో వేలుపెట్టే అధికారం సుప్రీంకోర్టుకు లేదు.


     ముఖ్యమంత్రిగా గవర్నరు నియమించిన యడ్యూరప్ప ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోకపోయినా, బలనిరూపణకు గవర్నరు అతడికి ఇచ్చిన గడువును సుప్రీంకోర్టు ఏకపక్షంగా తలచిందే తడవుగా కుదించి, రెండు రోజుల్లోనే బలపరీక్ష జరగాలని చెప్పడం సుప్రీంకోర్టు తన పరిధికి మించి గవర్నరు విచక్షణాధికారంలో కలగజేసుకోవడంగానే సామాన్య పౌరులకు అభిప్రాయం కలుగుతుంది.

    గవర్నరు అనుమతించిన ప్రకారం ఎడ్యూరప్ప బల నిరూపణకు 15 రోజుల అవకాశం వల్ల కొంపలేమీ మునిగిపోవు. కర్ణాటకలో రాజ్యాంగ ప్రళయమేదీ వచ్చిపడదు. అంత సమయం ఇస్తే పదవులో, డబ్బులో ఎరచూసి తమ ఎమ్మెల్యేలను ఎత్తుకుపోతారని కాంగ్రెసు-జెడి (ఎస్‌) లు పెడుతున్న గావుకేకలను ఎవరూ పట్టించుకోవలసిన పనిలేదు. ఎందుకంటే వారి పొత్తే అనైతికం.

     ముఖ్యమంత్రి పదవిని ఆశచూపి, కోరుకున్నన్ని మంత్రి పదవులతో ప్రలోభపరిచి జెడి (ఎస్‌) ను కాంగ్రెసు తన బుట్టలో వేసుకోవటమే నీతిబాహ్యం. వారి పంచన చేరిన వారందరూ టోకున అమ్ముడుపోయిన బాపతే అయినప్పుడు, వారిలో కొందరిని చిల్లరగా మరొకరు కొనుగోలు చేస్తే నీతికి, న్యాయానికి వాటిల్లే అదనపు హాని ఏమీ ఉండదు. అమ్ముడుపోవడానికి వారి ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నప్పుడు కొనుక్కొనే వారు ఎప్పుడూ ఉంటారు. తమ ఎమ్మెల్యేల మీద తమకే నమ్మకం లేక బందెల దొడ్లో బంధించి ఉంచినవారు, దొడ్లో నుంచి ఎవరో ఎవరినో ఎక్కడ ఎగరేసుకుపోతారోనని లొల్లి పెట్టటమే విడ్డూరం. సుప్రీంకోర్టు అంతటి వారు నీతిమాలిన లొల్లిని మన్నించి చక్రం అడ్డువేయటం మరీ హాస్యాస్పదం.

      ముందు అనుకున్న ప్రకారం 15 రోజుల గడువు లభించి ఉంటే యడ్యూరప్ప దొంగల బజారులో నుంచి తనకు తక్కువ పడిన తొమ్మిది తలకాయలను వీలైతే కొనుగోలు చేసేవాడేమో ? అది తప్పుడు పని, అధికారం కోసం గడ్డికరవకూడదు అన్న వివేకం ఉన్నవాడైతే బలపరీక్ష గెలవలేక రాజీనామా చేసేవాడేమో !?

      సుప్రీంకోర్టు వారు అర్థరాత్రి తలుపులు తెరిచి, తెల్లవారు ఝాము దాకా విచారణ జరిపి, ప్రసాదించిన ఇన్స్టంట్న్యాయం వల్ల ఇందులో మొదటి ప్రమాదాన్ని అయితే అడ్డుకోగలిగారు. మంచిదే !


     కాని దాని పర్యవసానమేమిటి ? 218 సీట్లకు పోటీచేసి, అందులో 147 చోట్ల డిపాజిట్లను పోగొట్టుకుని, 38 స్థానాలు మాత్రం గెలిచిన జెడి (ఎస్‌) అధికారాన్ని తన్నుకుపోయింది. ప్రజల మాండేటు పొంది 104 సీట్లతో మొదటి స్థానంలో నిలిచిన బిజెపికి అధికారం దక్కకుండా, జనం తిరస్కరించిన రెండో పార్టీ అండతో 38 సీట్ల మూడో నెంబరు వాడు రాష్ట్రాన్ని ఏలుతున్నాడు.

     ఇది ప్రజాస్వామ్యబద్ధమేనా ? రాజ్యాంగ స్ఫూర్తికి విహితమేనా ? దీనివల్ల నీతిమాలిన బేరసారాలు, నీచనికృష్ట పదవీ రాజకీయాలు పెరుగుతాయా ? తగ్గుతాయా ?

     సుప్రీంకోర్టు వారికే తెలియాలి.

[ జాగృతి వారపత్రిక 28 మే 2018 } 



No comments:

Post a Comment