జ్యోతిషం మీద నిన్న నా పోస్టుపై మన మిత్రుల మధ్య నడిచిన చర్చను చూశాక ఈ నాలుగు మాటలు రాయాలనిపించింది .
జ్యోతిషాన్నీ, జోస్యాలనూ నేనూ చాలా ఏళ్ళు ఎకసెక్కాలాడిన వాడినే. ఆ మాటకొస్తే ఇప్పుడు టీవీ చానెళ్ళ పనికిమాలిన చర్చల్లో పనికిమాలిన వాళ్ళు చేసే అరిగిపోయిన వాదాలకంటే పదునుగా ; అవతలివాళ్ళు మారు మాట్లాడలేనంత పవర్ ఫుల్ గా !
కాలేజీ చదువు అయి ఇంటికి వచ్చాక మా నాన్న బలవంతం మీద నేను జ్యోతిషం కొంతవరకు నేర్చుకున్నాను . ఆయన చాలా ఏళ్ళు పంచాంగాలు రాసేవాడు. జ్యోతిషం పుస్తకాలు కొనుక్కుని ఎంత చదివినా ఎన్నేళ్ళకూ అంతుబట్టని కిటుకులను అనుభవజ్ఞుడైన గురువు నేర్పగలడు. అలాంటివి కొన్ని మా నాన్న నాకు నేర్పాడు. దాంతో జాతకం ఎలా చూడాలి, లెక్కలు ఎలా వెయ్యాలి, ఫలితాలు ఎలా చెప్పాలి అన్నవి థియరీ వరకూ ఒక మోస్తరుగా అర్థమయ్యాయి. అయినా అప్పట్లో నన్ను నిలువెల్లా ఆవహించిన మార్క్సిజం , భౌతిక వాదం , నాస్తికత్వం నేను నేర్చిన విద్యనూ నన్నే నమ్మనివ్వకుండా చేశాయి. అది ఎంత దాకా అంటే - పెళ్ళికి ముందు మా ఆవిడ జాతకం కూడా నేను అడగలేదు. కనీసం పుట్టిన తేదీ , సమయం తెలుసుకోవాలనీ అనిపించలేదు. నా పెళ్ళికి ముహూర్తం మాత్రం నేనే పెట్టాను !
తరవాత తరవాత నా ఆలోచన మౌలికంగా మారింది. మన పేరుమోసిన హేతువాదులకంటే ఎక్కువ హేతుబద్ధంగా ఆలోచిస్తూ, ప్రతిదాన్నీ అనుమానిస్తూ , లాజికల్ గా తరచి చూస్తూ పోగా పోగా నేను పూర్తి నాస్తికత్వం నుంచి పూర్తి ఆస్తికత్వం వైపు మళ్ళాను. జ్యోతిషం మీద నా అభిప్రాయాలూ మారాయి. ప్రస్తుతం నేను అనుకుంటున్నదేమిటంటే -
1. అడుగు తీసి అడుగు వేయాలంటే తిథి, వారం, వర్జ్యం చూడాలనుకోవటం మూర్ఖత్వం.ప్రతి నిర్ణయమూ జాతకాన్ని బట్టి, గ్రహస్థితిని బట్టే చేయలనుకోవటమూ అవివేకమే. కానీ జీవితంలో, కుటుంబంలో అతి ముఖ్యమైన నిర్ణయం చేసే ముందు జ్యోతిష సలహా కూడా తీసుకోవటం చాల మంచిది.
2. ప్రతిదీ గ్రహాల మీదే ఆధారపడదు. మనిషి చేయగలిగింది చాలాఉంది. గ్రహాల ప్రభావాల నుంచి బయటపడగల శక్తి కూడా మనిషి చేతుల్లో ఉంది. కానీ ఆ ప్రభావాలు ఎలా పనిచేస్తాయి అన్నది తెలుసుకుని , దానిని దృష్టిలో పెట్టుకుని తదుపరి కర్తవ్యాన్ని నిశ్చయించుకుంటే వాలుగాలిలో ప్రయాణం లా సుఖంగా ఉంటుంది. అవసరమైతే ఏటికి ఎదురీదవచ్చు .జ్యోతిషాన్ని పక్కన పెట్టి , అన్ని పర్యవసానాలకు సిద్ధపడి ముందుకు సాగవచ్చు. అది అవసరమా అన్నది తేల్చుకోవటానికి కూడా జ్యోతిష సలహా ఉపయోగపడుతుంది.
3.అనుభవజ్ఞుడైన జ్యోతిషుడు ఒకరి జాతకం చూడగానే ఆయుర్దాయం, శరీర తత్త్వం, ఏ సమయంలో ఏ రకమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారముంది, ఏ పీరియడ్ లో ఎలాంటి జబ్బులు రావచ్చు, ఎలాంటి ఆపరేషన్లు జరగవచ్చు అన్నవి చెప్పగలడు . వాటిపై ముందస్తు హెచ్చరిక ఉంటే , వైద్యపరంగా సకాలంలో సరైన చికిత్స పొందటానికి వీలు ఉంటుంది. కాంప్లెక్సు కేసుల్లో సరైన డయాగ్నసిస్ చేసేందుకు వైద్యులకు కూడా జ్యోతిష పరిజ్ఞానం పనికొస్తుంది. అందుకే ఈ కాలంలో కొంతమంది డాక్టర్లు రోగి తత్వాన్ని , వల్నరబిలిటీ నీ మదింపు చేయటానికి ఆస్ట్రాలజీనీ ఒక ఇన్ పుట్ గా పరిగణిస్తున్నారు.మెడికల్ ఆస్ట్రాలజీ ఇవాళ పెద్ద గిరాకీ ఉన్న సబ్జెక్టు.
4. పిల్లలను ఏ కోర్సులో చేర్పించాలో నిర్ణయించే ముందు వారి జాతకానికి ఎలాంటి విద్యలూ వృత్తులూ రాణిస్తాయన్నది కూడా తెలుసుకుంటే .. తలితండ్రుల కలలకు పసివాళ్ళను బలిచేసే దుర్మార్గం కాస్త తగ్గవచ్చు.
5. వ్యక్తిగత జీవితంలో పెద్ద రిస్కులు తీసుకుని , ఖరీదైన ప్రయోగాలు చేయబోయేముందు జ్యోతిష్కుడి ఒపీనియన్ కూడా తీసుకుంటే ఆనక చేతులు కాల్చుకుని జీవితాంతం బాధపడే అవస్థ కొంతలో కొంత తప్పవచ్చు.
6. బిడ్డల పెళ్ళిళ్ళలో జ్యోతిషం చేయగల ఉపకారం ఎంతో ఉంది. జాతకాలు చూసుకోవటం అంటే పంచాంగాల గుణ మేళన చక్రాల్లో వధూవరుల నక్షత్రాలను బట్టి పట్టికలో మార్కులు చేసి 18 దాటితే పాస్ , దానికి ఒకటి తగ్గినా ఫెయిల్ అని కొట్టిపారేయటం కాదు. ఆశ్లేష అత్తకు గండం, మూలా నక్షత్రం మామకు గండం అని మూర్ఖంగా నమ్మటం కాదు. సబ్జెక్టు తెలిసిన, వాక్శుద్ధి గల, డబ్బు ఆశ మరీ ఎక్కువ లేని జ్యోతిషుడు వధూవరుల పొంతనలను చూసి, వైవాహిక జీవితం లో compatability ని మదింపు చేయటంలో మంచి సలహా ఇవ్వగలడు. పెళ్ళిళ్ళు చేయించే ప్రతి పురోహితుడూ జ్యోతిష పండితుడు కాడు. పెద్ద ఎత్తున మీడియాలో పబ్లిసిటీ ఇచ్చుకునే ప్రతి గాడిదా జ్యోతిష్క చక్రవర్తి కాడు .
7. ప్రజలలో నూటికి 95 మంది జ్యోతిషాన్ని నమ్మేవారు. ప్రతివారూ మంచి జ్యోతిష్కుడిని సంప్రదించాలనే కోరుకుంటారు. కానీ ఇవాళ డిమాండుకు తగ్గట్టు సప్లయి లేదు. నిజమయిన జోస్యులకంటే మోసగాళ్ళే , ఏమీ తెలియని ఏబ్రాసులే ఎక్కువ . ఈ దురదృష్టకర స్థితి మారాలంటే ఒక క్రమపద్ధతిన జ్యోతిష శాస్త్రాన్ని అభ్యసించే వారి సంఖ్య పెరగాలి. సమర్థులైన జ్యోతిషులను తయారు చేసేందుకు సీనియర్లు, వృత్తిపరమైన సంస్థలు, విద్యాసంస్థలు ఇంకా ముందుకు రావాలి.
8. చెపుతూ పొతే ఇలా చాలా ఉన్నాయి. జ్యోతిషం మీద బహిరంగంగా రాళ్లు వేస్తూ , తమ వరకూ వచ్చేసరికి అడ్డమైన జ్యోతిష్కుల చుట్టూ చాటున తిరగటం కాదు చేయవలసింది. సాంప్రదాయిక విద్య అయిన జ్యోతిషాన్ని సమాజంలో ఎక్కువ మందికి ఇంకా ఎక్కువ మేలు చేసేలా ఎలా అభివృద్ధి చేయగలమన్నదే ఇప్పుడు ఆలోచించవలసింది.

No comments:
Post a Comment