మనుధర్మం -8
ఎం.వి.ఆర్.శాస్త్రి.....
Let your women keep silence in the churches: for it is not permitted unto them to speak ; but they are commanded to be under obedience , as also saith the law.... And if they will learn anything let them ask their husbands at home; for it is a shame for women to speak in the church. ( I Corinthians , 14/ 34,35 )
మీ ఆడవాళ్ళను సమావేశాలలో నిశ్శబ్దంగా ఉండమని చెప్పండి.ఎందుకంటే వారికి మాట్లాడేందుకు అనుమతి లేదు .అలా అని ధర్మశాస్త్రం చెబుతున్నది. వారు ఏమైనా నేర్చుకోవాలనుకుంటే ఇంట్లో తమ భర్తలని అడగాలి. చర్చి సమావేశంలో స్త్రీ మాట్లాడటం సిగ్గుచేటు. ( కోరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక , 14 / 34 , 35 )
Wives, submit yourselves onto your own husbands , as unto the Lord. For the husband is the head of the wife, even as Christ is the head of the Church.. ( Ephesians , 5/22,23 )
మహిళలారా ! ప్రభువునకు వలే మీ సొంత భర్తలకు లోబడి యుండుడి ! క్రీస్తు చర్చికి శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. ( ఎఫెసీయులకు పత్రిక , 5/22,23 )
Let the woman learn in silence with all subjection . But I suffer not a woman to teach ,not to usurp authority over the man , but to be in silence. ( I Timothy , 2/ 11, 12)
స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొన వలెను .స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని , ఉపదేశించుటకైనను , పురుషుని మీద అదికారము చలాయించుటకైనను ఆమెకు నేను సెలవియ్యను ( తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2/11,12 )
ఒక స్త్రీ గర్భవతియై మగపిల్లను కనిన యెడల ఆమె ఏడు దినములు పురిటాలై ఉండవలెను. ఆమె తాను ముట్టుదై కడగా నుండు దినములను బట్టి పురిటాలై యుండవలెను. ఆమె తన రక్తశుద్ధికై 33 దినములు కడగా నుండవలెను. పరిశుద్ధమైన దేనిని ముట్టకూడదు. పరిశుద్ధ స్థలములో ప్రవేశించకూడదు... ఆమె ఆడపిల్లను కనిన ఎడల రెండు వారములు పురిటాలై ఉండవలెను. 66 దినములు కడగా ఉండవలెను. ( లేవీయ కాండము , 12 వ అధ్యాయము , 2 -5 వాక్యాలు )
స్త్రీ పురుషుని నుండి కలిగెనే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. స్త్రీ పురుషుడి కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ( కోరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక, 11/8,9 )
విన్నారు గదా ?!
*ఆడది పుట్టింది మగవాడి అనుభవం కోసం.
*చర్చి లాంటి సమావేశ స్థలాల్లో ఆడది నోరెత్తకూడదు.
*ఓ భార్యలారా ! మీ మొగుళ్లకు లోబడి బతకండి. చర్చికి యేసు ప్రభువు అయినట్టు నీ మగడు నీకు ప్రభువు.
*ఆడది నోరుమూసుకుని పడి ఉండాలి . మగాడికి ఎదురు చెప్పకూడదు.మగవాడి మీద అధికారం చలాయించడానికి దేవుడి అనుమతి లేదు.
*పెళ్ళికి ముందు భర్త ఒకడికి దాసుడు అయితే .. పెళ్ళయ్యాక భర్త బయటికి వెళ్ళిపోయినా .. భార్యాబిడ్డలు మాత్రం యజమాని సొత్తుగానే పరిగణించాలి. భర్తకు తప్పినా భార్యకు దాస్యం తప్పదు.
*పెళ్ళయ్యాక కన్యాత్వపు " బట్టపరీక్ష"లో నవ వధువు కన్నె కాదని తేలితే కన్నవాళ్ళ ఇంటిదగ్గర ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలి.
*మొగుడికి కోపం వచ్చి తన భార్య వేరొకడితో వ్యభిచరించిందని ఆరోపణ చేస్తే "యాజకుడు " ఆమె కడుపు ఉబ్బి నడుము పడిపోయేట్టు చేసే చెడు నీళ్ళు తాగించాలి.
* ఆడడానిని రేప్ చేస్తే ఆ నేరం పొట్టేలు బలితో సరి.
*మగ బిడ్డను కంటే బాలింతకు వారం రోజులు ముట్టు , 33 రోజులు మైల. అదే ఆడపిల్లను కంటేనో ? రెండు వారాలు ముట్టు , 66 రోజులు మైల!
పుట్టే బిడ్డ ఆడ అయినా మగ అయినా ప్రసవ ప్రక్రియ ఒకటే. బాలింత శరీర ధర్మం ఒకటే. అయినా మగబిడ్డ కంటే ... ఆడబిడ్డకు జన్మనిస్తే తల్లికి నెలరోజులు ఎక్కువ అంటు. ముట్టు కాలపరిమితి రెట్టింపు రోజులు ఎక్కువ.
ఇవీ "పరిశుద్ధగ్రంథం" లో పలికిన స్త్రీ ధర్మాలు.
ఇప్పుడు మన పెద్ద నోళ్ళ హేతువాదులను , సోకాల్డ్ స్త్రీవాదులను, భలే మానవతావాదులను కొన్ని ప్రశ్నలు అడుగుదాం .
మనుస్మృతి లో స్త్రీ తండ్రి, భర్త ,పుత్రుల రక్షణలో ఉండాలని అన్నందుకే మనువు స్త్రీకి స్వాతంత్ర్యం హరించాడని మీరంతా పాపం చాలా ఆవేశపడుతున్నారు కదా ? మొగుడి కాళ్ల దగ్గర ఆడది నోరుమూసుకుని పడి ఉండాలని " పరిశుద్ధ గ్రంథం చెప్పటం స్త్రీకి చాలా గొప్ప స్వాతంత్ర్యం ఇచ్చినట్టు అవుతుందా ?
స్త్రీని ఆదిశక్తి గా , సృష్టి స్థితి లయ కారులైన త్రిమూర్తులకు జన్మనిచ్చిన మూలపుటమ్మగా కీర్తించే హిందూ మతం , స్త్రీలను గౌరవించి పూజిస్తేనే దేవతలు సంతోషిస్తారని చెప్పిన మనుధర్మం మీ కంటికి స్త్రీల పాలిటి ఆజన్మ శత్రువులుగా ... పురుషాధిక్య పైత్యంతో స్త్రీ జాతిని కాళ్లకింద క్రూరాతి క్రూరంగా తొక్కివేసిన మహా పాపులుగా కనపడుతున్నారు కదా ? మగవాడు ఆడదాని కోసం పుట్టలేదు. ఆడదే మొగవాడు అనుభవించటం కోసం పుట్టింది అని బైబిల్ సెలవివ్వటం మాత్రం మీ దృష్టిలో స్త్రీజాతి ఔన్నత్యాన్ని పెంచటం అవుతుందా ? మగబిడ్డకు కంటే ఆడబిడ్డ విషయంలో రెండు రెట్లు ఎక్కువ అశౌచం పాటించాలని చెప్పటం స్త్రీల పట్ల తగని వివక్ష చూపటం కాదా ?
మరి మనుస్మృతిలో ఉన్నదని మీరనునుకుంటున్న దానికంటే నూరు రెట్లు ఎక్కువ డామేజింగు గా ఉన్న బైబిల్ గురించి మీరు మాట్లాడరెందుకు ? మీ నోటి తీట అంతటినీ ఎంతసేపూ హిందూ మతం మీద , మనుధర్మం మీదే చూపిస్తారెందుకు? హిందూసమాజం ఏనాడో మూలన పడేసిన మనుస్మృతి అనే ఒక గ్రంథం లో ఎక్కడో ఏదో ఉన్నదని ఎవరో మీకు చెప్పినదానికే అఘాయిత్యాలేవో జరిగిపోతున్నట్టు మీరు పెడబొబ్బలు పెడుతూంటారు కదా ? ప్రపంచంలోకెల్లా పెద్దమతాల్లో ఒకటైన క్రైస్తవానికి సంబంధించి వందకోట్లకు పైగా జనం నేటికీ పవిత్రగ్రంథంగా పూజించే బైబిల్ లో మనుస్మృతి లో ఉన్నదానికంటే వందరెట్లు ఎక్కువ పురుషాహంకారం, స్త్రీద్వేషం ఉన్న సంగతి మీ కళ్ళకు , చెవులకు ఆనవా ? ఇందులోని మతలబు ఏమిటి? హిందూ మతం మీద మీరు కక్కుతున్న విషాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ?
ఇక చివరిగా ...
ఇంద్రియాలు ఎంతటివారినైనా పడగొట్టగలవు కాబట్టి కన్నతల్లి , కన్నబిడ్డ, తోబుట్టువు లతో పురుషుడు ఒంటరిగా ఒకే ఆసనం మీద ఉండకూడదు అని మనుస్మృతి హితవు పలికితే ... 'చూశారా! కన్నతల్లికీ, కన్నకూతురికీ ,తోడబుట్టినడానికి కూడా వావివరసలేరుగని కాముకత్వాన్ని మనువు అంటగట్టాడ'ని మీలో కొందరు బుద్ధిమంతులు గావుకేకలు పెట్టారు కదా ? మరి బైబిల్ " పాతనిబంధన" లోని ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు ఉపాఖ్యానం గురించి మీరు ఏమంటారు? కావాలంటే ఆ పరిశుద్ధ వాక్కులు ఇక్కడ చూడండి :
లోతు, అతడి ఇద్దరు కుమార్తెలు ఒక గుహలో నివసించిరి . అట్లుండగా అక్క తన చెల్లెలితో - మన తండ్రి ముసలివాడు. లోకమర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలగా చేసుకొందము రమ్మని చెప్పెను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షా రసము త్రాగించిన తరువాత అతని పెద్దకుమార్తె లోపలి వెళ్లి అతనితో శయనించెను. ...మరునాడు రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత చిన్నది లేచి అతనితో శయనించెను. ఆలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. ( ఆది కాండము , 20 వ అధ్యాయము, 30 - 36 వాక్యాలు )
మహాజ్ఞానులారా , చెప్పండి! పవిత్ర బైబిల్ లో పేర్కొన్న ఆ గొప్ప తండ్రికీ అతడి కన్నకుమార్తెలు ఇద్దరికీ మధ్య ఉన్నది మీ దృష్టిలో " పవిత్ర, హేతుబద్ధ, ప్రగతి శీల మరియు సమాజాన్ని ముందుకు తీసుకుపోయే " సంబంధమా ? కాల దోషం పట్టిన మనుస్మృతిలో స్త్రీపురుష సంబంధాలపై విధించిన పూర్వకాలపు కట్టుబాట్లకే ఇల్లెగిరిపోయేట్టు రంకెలు వేస్తున్న మీరు , ఇప్పటికీ ప్రపంచమంతటా కోట్లమంది భక్తితో పారాయణం చేస్తున్న పవిత్ర గ్రంథం లోని ఇలాంటి రోతల గురించి నోరు మెదపరెందుకు ?
రోషం, పౌరుషం లేని హిందువుల మీదే తప్ప తమ జోలికి వస్తే శాస్తి చేసే అన్య మతాల మీద మీ ప్రతాపం పనిచేయదా ?
తేనె లాంటి రామాయణంలో విషం వెతికే విష పురుగులు బైబిల్ లో తొంగి చూసే సాహసం చేయరు, quran గురించి ఆలోచించాలంటే నిద్దట్లో కుడా ఉలిక్కిపడతారు మన సాహస వీరులు.. ఇదీ వీళ్ళ ధైర్యం.. రామాయణ కల్పవృక్షం కంటే రామాయణ విషవృక్షం తేరగా తేలికగా చవకగా నవనవలాడే కవర్ పేజీతో ఆత్మవిశ్వాసం పొగరు తొణికిసలాడే సమాజోద్ధరకుని ఇరుకు ముఖంతో, ఓ ముష్టి మేధావి ముందుమాటతో, "ఏం చేస్కుంటావో చేసుకో" అనే అహంకారం లో అద్దిన అక్షరాలతో, తన ఇష్టం వచ్చినట్టు చిత్తానికి తోచింది బరికి పారేసి, హిందువుల ముఖాల మీదికి విసిరిపారేసి, "ఇదిగో వినండి నా భవిష్యవాణి, వాల్మీకి కంటే నేనె గొప్ప, ఇదే ఒరిజినల్ రామాయణం, కావాలంటే చూసుకోండి భవిష్యత్తులో వాల్మీకి రామాయణం కంటే రామాయణ కల్పవృక్షం కంటే నా విషం చదివే వాళ్లే ఉంటారు. నా విషరాతలే ఎక్కువ ముద్రించబడతాయి. చైనా భక్త బృందం (కమ్యూనిస్టులు) భక్తి ముందు మీ రామ భక్తి నిలువదు . RGV లాంటి అరాచకవాదులు నా భక్తులు గా మారుపోతారు.." అని వాక్రుస్తారు..
ReplyDeleteపుస్తక ప్రదర్శనల్లో విష పుస్తకం కళ్లెదురుగా కనిపించినా మనకెందుకులే అని పక్క షెల్ఫ్ దగ్గరికి పోయే బాధ్యతారాహిత్య హిందువులే మా బలం(కొద్దీ రోజుల క్రితం కాకినాడ లో జరిగిన బుక్ ఫెయిర్ లో ప్రశ్నించి ఉన్నాను)..
ఇందుకున్నమాట.. అది "ఉన్నమాట"..
నేను ఇస్లాం గురించి వ్యాసాలు మొదలుపెట్టినపుడు నన్ను "పొరపాటు చహెస్తున్నారేమో!" అని వ్యాఖ్యానించంది సాటి హిందువులే!అప్పటికే సాక్ష్యం మ్యాగజైను దగ్గిర నేనూ ఇతర హిందువులూ పదే పదే "మీరు మీ మతంలో ఉన్న మంచిని చెప్పుకుని అది నచ్చినవాళ్ళు మీ మతాన్ని అనుసరిస్తే మాకు అభ్యంతరం లేదు,కానీ హిందూమతం గురించి తెలిసీ తెలియని తనంతో మీ అతి తెలివిని చూపిస్తూ వ్యాఖ్యానించకండి" అని చాలా ఓపిక చేసుకుని చెప్పినా ఆపకుండా విషం కక్కుతున్నాకనే అతన్ని చాలెంజి చేస్తూ వేసిన పోష్టులు అవి.అయినా హందువులు అలాంటి మంచితనం చూపించారు.నేను సాక్ష్యం యజమానిని సవాలు చేసింది రెండు కండిషన్ల మీద 1.ఇక్కడ ఇస్లాము గురించి చెప్పినవి ఖురానులో లేవనీ నేను అబద్ధాలు చెప్తున్నాననీ నిరూపించగలరా?2.అలా నిరూపించలేని పక్షంలో హిందూమతం గురించి ప్రస్తావిస్తున్న మీ బ్లాగులోని పాత పోష్టుల్ని తొలగించి ఇకముందు హిందూమతం గురించి మీ బ్లాగులో పోష్టులు వెయ్యకుండా ఉందగలరా? అని.ఆ పెద్దమనిషి ఆ రెంటిలో ఏదీ చెయ్యకుండా ఉండిపోయాడు - అక్కడికీ మొత్తం 18 పోష్టులూ పూర్తయ్యాక మళ్ళీ మూడు సార్లు కామెంటులు వేసి అడిగినా గమ్మునుండిపోయాడు.
ReplyDeleteతర్వాతెప్పుడో వేరే వ్యక్తి తీసెయ్యమని అడిగీతే అతను అడిగిన తీరు చూసి జాలిపడి తీసేశాను.అదీ మన మనస్తత్వం! కమలహాసన్ ఇప్పటికి లేకపోయినా ఉలిక్కిపడి అదుగో హిందూ టెర్రరిజం అని గగ్గోలు పెట్టాడు గానీ భవిష్యత్తులో నిజంగానే హిదూ టెర్రరిజం అవసరం వస్తుందని అనిపిస్తున్నది.