సింహాచల దేవస్థానంలో ప్రసాదాల తయారీ ని ఏరికోరి ఒక క్రైస్తవుడికి అప్పచెపుతారు .
ప్రపంచంలోకెల్లా పెద్ద హిందూ దేవస్థానమైన తిరుమల తిరుపతి దేవస్థానాల్లో అన్య మతస్తులది ఇష్టారాజ్యం . వారి మీద చర్య తీసుకోబోతే న్యాయ స్థానాలే చక్రం అడ్డువేస్తాయి. శ్రీవారి ఆలయ సమీపానే అన్యమత ప్రచారాలు జరుగుతుంటే సమర్థంగా అరికట్టే దిక్కు లేదు.
హిందు దేవాలయాల్లో ఎన్నో చోట్ల అర్చకులమీద , పూజా విధానాల మీద , పవిత్ర సంప్రదాయాలమీద అడ్డగోలుగా కర్ర పెత్తనం చేసేది చర్చిలకు వెళ్లే అధికారులు. ఆలయ కమిటీలలో ఏరికోరి నియమించేవారిలో ఎక్కువమంది హిందూ మతంలో విశ్వాసం లేని అన్యులు లేక నాస్తికులు.
రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా చిన్న పెద్దా దేవస్థానాలకు సరిగ్గా ఎదురుగా కొండలమీద , గుట్టల మీద పెద్దపెద్ద శిలువలు , లౌడ్ స్పీకర్ ఊదర లు షరా మామూలే.
శ్రీశైల దేవస్థానంలో షాపుల కేటాయింపులో అన్యమతస్థుల ప్రాబల్యం ఎప్పటినుంచో ఉంది .అదే పరిస్థితి మరికొన్ని చోట్లా ఉన్నది.
ఈ అడ్డగోలు అవ్యవస్థకు అంతూ అదుపూ కనిపించటం లేదు. పట్టుబట్టి అమీతుమీ తేల్చే దమ్ము, ధైర్యం పేరు గొప్ప మత సంస్థలలో కరువయ్యాయి. పీఠాధిపతులు ఎవరి రంధిలో , ఎవరి లంపటాల్లో వారు బిజీ .
దిక్కు తోచని ఈ స్థితిలో ఏమి చేయాలి , ఎవరికీ పట్టనప్పుడు తమ మతాన్ని, దేవస్థానాల పవిత్రతని కాపాడుకోవడానికి తామే ఎలా కదలాలి అన్నది దేవుడిమీద , దేవాలయాలమీద విశ్వాసం ఉన్న సామాన్య భక్తులే నిర్ణయించుకోక తప్పదు. ఎక్కడికక్కడ ఎవరికి వారు చొరవ తీసుకుని , అంతా కూడబలుక్కుని ఏదో ఒక గట్టి ఉద్యమం తెస్తే కానీ ఈ చిరకాలపు చికాకు తొలగదు. మరి కొద్ది నెలల్లో ఓట్ల బిచ్చగాళ్లు ఇంటింటికీ రాబోతున్న ఈ సమయమే పట్టపగ్గాలు లేని రాజకీయ పెత్తందారులనూ వారి తాబేదారులనూ మొత్తంగా రాజకీయం గాళ్లనూ మన కాళ్ళ దగ్గరికి రప్పించుకొని మన దేవస్థానాలకు దుష్ట గ్రహాల పీడను శాశ్వతంగా వదిలించటానికి సరైన అదను.
No comments:
Post a Comment