Wednesday, 14 March 2018

ఏది అశుద్ధం ? ఏది పరిశుద్ధం ?

మనుధర్మం -7

ఎం.వి.ఆర్.శాస్త్రి
.......

*పురుషుల్ని చెడగొట్టటం  స్త్రీల స్వభావం.పురుషుడు ఎంత విద్వాంసుడైనా స్త్రీల వలలో     తగులుకోవటం సహజం.
*వ్యభిచారం స్త్రీల లక్షణం.
*చెడుబుద్ధి కలిగిన స్త్రీలకు చంచల స్వభావం ఉన్నందువల్ల భర్త ఎంత జాగ్రత్తగా             చూసుకున్నా అతడిపై చెడు భావంతో చెడిపోతున్నారు.
*శయ్య, ఆసనం  , కామక్రోధాలు , కపట స్వభావం ,ద్రోహబుద్ది ,చెడునడవడి స్త్రీలకు     సహజమైనవి.
*మద్యపానం, చెడు సావాసం , పొరుగిళకు పోవటం స్త్రీని చెడగొడతాయి .
*మంత్రం సంస్కారం లేనందువల్ల స్త్రీలు కొందరు అశుభ రూపంతో ఉంటారు. కొందరు     మానసిక వ్యభిచారం చేస్తారు. వారికి ప్రాయశ్చిత్తాలు  చేసి సంస్కరించాలి.
* స్త్రీలు సాక్ష్యానికి పనికి రారు.ఎందుకంటే వారు చపలురు.
* బాలిక అయినా యువతి అయినా , ముదుసలి అయినా ఏ స్త్రీ గృహకార్యాలని స్వతంత్రించి         చేయకూడదు.
*స్త్రీ భర్త శుశ్రూష చేయాలి.
*పురుషులు స్త్రీలను ఎప్పుడూ తమ అధీనంలో ఉంచుకోవాలి.
*స్త్రీలు ఎప్పుడూ ఒకరి రక్షణలో ఉండాలే తప్ప ఒంటరిగా ఎన్నడూ ఉండకూడదు.
*భార్య నేరం చేస్తే తాడుతోనైనా బెత్తంతో నైనా శరీరం వెనకవైపున కొట్టాలి.
*వ్యభిచారం చేస్తున్న భార్యను ఇంట్లో బంధించి ప్రాయశ్చిత్తం చేయించాలి.
*కన్య మర్మాంగంలో వెళ్ళు పెట్టి బాధించిన స్త్రీని తల గొరిగించి ,రెండు వేళ్ళు కోసి,     గాడిదనెక్కించి ఊరేగించాలి.
*తండ్రి ఐశ్వర్యం, కులం చూసుకుని ,మిడిసిపడి,  భర్తను లెక్కచేయక పరపురుషుడిని   తగులుకునే స్త్రీని అందరూ చూస్తుండగా కుక్కలతో కరిపించాలి.
*భర్తను ద్వేషించే భార్యను సంవత్సరం వేచి చూసి ఇంకా మారకపోతే పంపించివేయాలి.     మద్యం తాగేది, దుష్టురాలు ,రోగిష్టి, భర్తకు ప్రతికూలంగా ఉండేది,విపరీతంగా ఖర్చు   చేసేది   అయిన భార్యను వదిలి ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు.

    మొదట ఉన్నవా , తరవాత ఇరికించినవా అన్నదానిలోకి పోకుండా ఇప్పుడు మార్కెట్ లో దొరికే మనుస్మృతి ప్రతులను కలబోసి వెతికితే స్త్రీలను ఉద్దేశించి కించపరిచినట్టుగా ..  క్రూరత్వం , లింగ వివక్ష చూపినట్టుగా ... స్త్రీ ఆత్మగౌరవానికి భంగకరంగా ...ఉన్నాయి అంటూ ఎవరైనా అక్షేపించటానికి ఎంతో కొంత  ఆస్కారం కలిగించేవి ఈ పైన పేర్కొన్నట్టివి ! ఏ కాలంలో నుడివిన నీతులివి ...  ఏ సందర్భంలో , ఏ ఉద్దేశంతో అన్నారు ... మూల శ్లోకానికి పై అనువాదాలు ఎంతవరకు సరిగా ఉన్నాయి అన్నవి పట్టించుకోకుండా వీటివరకే అనుమానపు కళ్ళతో, రంధ్రాన్వేషణ దృష్టితో చూస్తే ఆధునిక మానవతావాదులకు  ఇవి తీవ్రాభ్యంతర కరంగా  కనపడుతున్నాయి.

  మనుస్మృతి లో అనంతర కాలంలో  వచ్చిచేరిన అశుద్ధ భాగాలను తీసేసి మనువు  అసలైనస్ఫూర్తికి , ఆదర్శాలకు అనుగుణంగా ఉండే శ్లోకాలను మాత్రమె మిగిల్చి ఆర్య సమాజ్ వారు కొన్నేళ్ళ కింద " విశుద్ధ మనుస్మృతి " ని వెలువరిస్తే మన మహా మేధావులు దాని మీదా అశుద్దపు ముద్దలు వేశారు.  మనుస్మృతి లో ఉన్నదంతా అశుద్ధమే ! దానిలో వీరికి కనపడ్డ అశుద్దాన్ని  తీసేసినా మిగిలేది  అశుద్ధమే !మనుస్మృతి మైనస్ అశుద్ధం ఈజ్ ఈక్వల్ టు అశుద్ధం -అని నిర్వచిస్తూ  రావిపూడి వెంకటాద్రి అనే  హేతువాది  "మనుస్మృతి మైనస్ అశుద్ధం " అనే పుస్తకం రాశాడు.

   మనుస్మృతి అశుద్ధ గ్రంథం అని మన మహాజ్ఞానులు తేల్చారు. చాలాసంతోషం.  అది పూర్తిగా అశుద్ధం అయితే పూర్తిగా పరిశుద్ధం అయినది ఇంకేదో ఉండాలి కదా ? అశుద్ధం ఎంత  అశుద్ధమో తేలాలంటే దాన్ని పరిశుద్ధం పక్కన పెట్టి పోల్చి చూడాలి కదా ?

  అలాంటిది ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది ? ప్రపంచంలో  కోట్ల సంఖ్యలో ఉన్న గ్రంథాల్లో ఇది మాత్రమే పరిశుద్ధం అని ఎవరు తేల్చగలరు అన్న సంశయం అక్కర్లేదు. పేరే " పరిశుద్ధ గ్రంథము " అయిన పవిత్ర గ్రంథం ఒకటుంది. అది పరిశుద్ధం కాదని , దానిలో ఉన్నది అశుద్ధమని మన ఈ మహా  మేధావులెవరూ గొంతు చించుకున్న , లబలబ లాడిన దృష్టాంతాలు లేవు.  మనుస్మృతి విషయంలో వలె  వారు ఒంటికి గొడ్డుకారం రాచుకున్నట్టు దాని విషయం లో మండిపడటం లేదు.  కాబట్టి దాని పరిశుద్ధతను వారు సైతం అంగీకరించినట్టుగానే భావించవచ్చు. ఇదిగో ఆ పవిత్ర గ్రంథం :



  ఇప్పుడు దానిలో స్త్రీలకు సంబంధించిన కొన్ని పరిశుద్ధ వాక్యాలను చూద్దాం. :

  ఒకని భార్య త్రోవ తప్పి వానికి ద్రోహము చేసిన యెడల  అనగా వేరొకడు ఆమెతో వీర్యస్ఖలనముగా శయనించిన యెడల ... ఆ పురుషుడు యాజకుని యొద్దకు తన భార్యను  తేవలెను. .. అప్పుడు యాజకుడు మంటికుండతో పరిశుద్ధమైన నీళ్ళు తీసుకొనవలెను. మందిరములో నేలనున్న ధూళిని ఆ నీళ్ళలో వేయవలెను. .. శాపము పొందించు చేదు నీళ్ళు యాజకుని చేతిలోఉండవలెను. ... అప్పుడు యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణము చేయించిన తరువాత ఆ చెడు నీళ్ళను త్రాగించవలెను. ... ఆమె అపవిత్రపరపబడి భర్తకు ద్రోహము చేసిన యెడల ఆమె కడుపు ఉబ్బును . నడుము పడిపోవును. ... ఏ స్త్రీ అయినను తన భర్త అధీనమున  నుండి అపవిత్రపరుపబడిన యెడల నేమి ,  లేక  వానికి రోషము పుట్టి తన భార్య మీద కోపబడిన యెడల నేమి ,వాడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువ బెట్టినప్పుడు యాజకుడు సమస్తము విధి చొప్పున చేయవలెను. ( సంఖ్యా కాండము , 5 వ అధ్యాయము , 12 - 30 వాక్యాలు )

   ఒకడు ఒక స్త్రీని పెండ్లి చేసుకుని ఆమెను కూడిన తరువాత ఆమెను ఒల్లక ... ఈమె యందు కన్యాత్వము నాకు కనపడలేదని చెప్పిన యెడల తలిదండ్రులు ఆ ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదాని కన్యాత్వ లక్షణములను తీసుకొని రావలెను . ... పట్టణపు పెద్దల ఎదుట ఆ బట్టను పరచవలెను. ... ఆ చిన్నదాని యందు కన్యకా లక్షణములు కనపడని యెడల ఆమె తండ్రి ఇంటి యొద్దకు ఆ చిన్నదానిని తీసుకుని రావలెను. అప్పుడు ఆ ఊరివారు ఆమెను రాళ్ళతో చావగొట్టవలెను.... ఒకడు మగనాలితో శయనించుచుండగా కనపడిన యెడల వారిద్దరూ చంపబడవలెను.  ( ద్వితీయోపదేశ  కాండము  , 22 వ అధ్యాయము, 13 -22 వాక్యాలు. )

  ఒకడు దాసితో శయనించి వీర్యస్ఖలనము చేసిన యెడల ... పాపపరిహారార్థ బలియగు పొట్టేలు వలన ... పాపము విషయమై అతనికి క్షమాపణ కలుగును ( లేవీయకాండము , 20 వ అధ్యాయము , 20 - 23 వాక్యాలు ) 

 యజమానుడు   దాసుడికి  ( పెళ్లిచేసి ) భార్యనిచ్చిన తరువాత ఆమె వానివలన పిల్లలను కనిన యెడల ఆ భార్యయు ఆమె పిల్లలును యజమానుని సొత్తు అగుదురు. వాడు ( యజమానిని విడిచి వెళ్ళదలుచుకుంటే )ఒంటరిగానే పోవలెను. ... ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన యెడల దాసులైన పురుషులు వెళ్లిపోవునట్లు అది వెళ్లిపోకూడదు. ( నిర్గమ కాండము , 21 వ అధ్యాయము , 3-7 వాక్యాలు )

  బెయేరి కుమారుడైన   హోషెయ కు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు : 

... నేను దాని బట్టలను పెరికి వేసి దిగంబరురాలినిగా చేసి ... మీ తల్లి పోకిరి చూపు చూడకయు , దాని స్తనములకు పురుషులను చేర్చుకొనకయు నుండునట్లు మీరు ఆమెతో వాదించుడి. ... దాని మార్గములు దానికి కనపడకుండ గోడ కట్టుదును. దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరతును... నీ తల్లిని నేను నాశనము చేతును.... మీ కుమార్తెలు వేశ్యలైరి. మీ కోడండ్లును వ్యభిచారిణులైరి.... యెహోవాకు విశ్వాస ఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి.  ( హోషెయ  1/1  ,  2 /1- 10  ,  4/ 5- 14  ,  5 / 7 )

   మీరు ఆడువారినందరిని బ్రదుకనిచ్చితిరా ? ...  మీరు పిల్లలలో పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి. పురుష సంయోగము ఎరుగని ప్రతి ఆడుపిల్లను మీ నిమిత్తము బ్రతుకనీయుడి .( సంఖ్యా కాండము , 31 వ అధ్యాయము , 15 -18 వాక్యాలు )

ఈ అమృతవాక్కులకే ఆశ్చర్యపోతున్నారా ? కొత్తగా వినేవారికి ఏకంగా మూర్చ తెప్పించే పరిశుద్ధ  వాక్కులు ఇంకా చాలా ఉన్నాయి.

(ఇంకా ఉంది )





 




No comments:

Post a Comment