గొప్పింటి సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. దేశాన్నేలే మహారాజులు వాళ్ల అబ్బాయికి మన పిల్లని ఇమ్మని కబురంపారు. చేసుకుంటే అమ్మాయి మహారాణి అవుతుంది.
ఒక్కటే లోపం . అబ్బాయికి కళ్ళు లేవు. బంగారంలాంటి పిల్లను చూస్తూ చూస్తూ చూపులేనివాడికి ఎలా ఇస్తాం అని మథనపడ్డాడు తండ్రి. పదిమందిని సంప్రదించాడు. కులం, వంశం, కీర్తి, ఆచారం లాంటి విషయాలు బాగా విచారించాక నా కూతురిని మీ అబ్బాయికి ఇస్తానని అవతలివారికి మాట ఇచ్చాడు.
ఇచ్చాక ఆ సంగతి అమ్మాయికి తెలిసింది. అమ్మానాన్నా తనకు పెళ్లిచేయదలచిన అబ్బాయి గుడ్డివాడు అని విన్నవెంటనే ఆమె ఒక పని చేసింది. నా తరఫున నిర్ణయం చెయ్యటానికి మీరెవరు అని కన్నవాళ్ళ మీద కేసు పెట్టిందా? లేదు. మొగుడూ మొద్దులూ -పెళ్ళీ పెటాకులూ – సెక్సూ నీడ్సూ గురించి మోడరన్ పాఠాలు చెప్పే విశృంఖల స్వేచ్చలమ్మలు అప్పటికింకా పుట్టలేదు .
నా భర్త చూడలేని లోకాన్ని ఇకపై నేనూ చూడను అని నిశ్చయించి ఒక వస్త్రాన్ని తెప్పించింది. దాన్ని చాలా మడతలు వేసి కళ్ళకు కట్టేసుకున్నది. ఆమె పేరు గాంధారి. అదిమొదలు మళ్ళీ ఆమె గంతను విప్పలేదు. నూరుగురు పిల్లలను కన్నా ఒక్కరినీ ఎన్నడూ కళ్ళారా చూడాలనీ అనుకోలేదు. మొత్తం ప్రపంచ వాజ్మయం లో ఇటువంటి మహాసాధ్వి మరొకరు ఉన్నారా?
ఆ గాంధారి మన ఆడపడుచు. ఆమె తండ్రి సుబలుడు , అన్న శకుని, అనంతరం అతడి కొడుకు ఏలిన గాంధార రాజ్యం నిన్నమొన్నటి వరకూ విశాల భారత దేశంలో భాగం.
...... ........
మహా శక్తివంతమైన ఖలీఫాలకే ఎదురొడ్డి నిలవటం తో కాబూల్ రాజు రణబల్ లేక రత్నపాల్ పేరు మధ్య ఆసియా అంతటా మారుమోగిపోయింది. అతడిని హీరోగానో, విలన్ గానో పెట్టి చాలా జానపద కథలు ప్రచారంయ్యాయి. రణబల్ లేక రత్నపాల్ పేరు చెపితేనే అరబ్బులు ఉలిక్కిపడేవారు.
రెండు శతాబ్దాలు పైగా లెక్కలేనన్ని దాడులు చేసి , తాత్కాలిక విజయాలు ఎన్ని సాధించినా కాబూల్, జాబూల్ హైందవ రాజ్యాలను లొంగతీయటం కొమ్ములు తిరిగిన అరబ్బు మహాసామ్రాజ్యం వల్ల కాలేదు. పరాజయాలకు గురైన ప్రతిసారీ హిందువులు శక్తులు కూడతీసుకుని తిరిగి పుంజుకుని పోగొట్టుకున్నవి తిరిగి రాబట్టుకునేవారు. 18 భీకర దండయాత్రలను తట్టుకుని తమ దేశాన్నీ, ధర్మాన్నీ విదేశీయుల బారి నుంచి కాపాడుకున్నారు.
https://youtu.be/Gc2FTU3pWTE
No comments:
Post a Comment