Friday, 29 June 2018

ఎమర్జన్సీ ప్రసాదం

పెక్యులరిజం - 2

ఎం.వి.ఆర్. శాస్త్రి



    1948 నవంబర్‌ 15 సోమవారం.

    భారత రాజ్యాంగ నిర్ణయ సభ న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ హాలులో ఉదయం 10 గంటలకు కొలువుతీరింది. ఉపాధ్యక్షుడు డాక్టర్‌ హెచ్‌.సి.ముఖర్జీ అధ్యక్ష స్థానంలో ఉన్నారు. స్వతంత్ర భారతావని కోసం తయారవుతున్న నూతన రాజ్యాంగం ముసాయిదాపై క్లాజుల వారీగా చర్చ కొనసాగుతున్నది.

    'ఇప్పుడు సవరణలలోకి వెళదాం. సవరణ నెంబర్‌ 98. ప్రొఫెసర్‌ కె.టి.షాది'  అని అధ్యక్షులు పిలవగానే బిహార్‌ సభ్యుడు ప్రొఫెసర్‌ కె.టి. షా లేచి-

     'మొట్టమొదటి అధికరణంలోని మొదటి క్లాజులో 'సెక్యులర్‌, ఫెడరల్‌, సోషలిస్టు' పదాలను చేర్చి 'India shall be a secular, Federal, Socialist Union of States' అని మార్చాలని నేను ప్రతిపాదిస్తున్నాను' అన్నారు. అందుకు కారణాలను వివరిస్తూ చేసిన ప్రసంగంలో ఆయన ఇలా చెప్పారు:

      'మనది సెక్యులర్‌ రాజ్యమని ప్రతి వేదిక మీద పదేపదే వింటున్నాము. అది నిజమైతే ఆ మాట రాజ్యాంగంలోనే ఎందుకు జోడించకూడదు ? అలా చేస్తే అపార్థానికీ, అనుమానికీ ఎలాంటి ఆస్కారం ఉండదు కదా ? మనం నమూనాలుగా తీసుకున్న విదేశీ రాజ్యాంగాలలో 'సెక్యులర్‌' అన్న పదం లేదన్న సంగతి నేను ఒప్పుకుంటాను. కాని మన అవసరాన్ని బట్టి, రాజ్య స్వభావాన్ని స్పష్టంగా, ధృఢంగా వర్ణించేందుకు మన రాజ్యాంగంలో ఆ పదాన్ని ఇప్పుడు ఎందుకు చేర్చకూడదు ?'

     అప్పుడు రాజ్యాంగం డ్రాఫ్టింగ్‌ కమిటీ ఛైర్మన్‌ అయిన గౌరవ సభ్యుడు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ లేచి షా సవరణ ప్రతిపాదనను కరాఖండిగా వ్యతిరేకించారు ఇలా..

     'అధ్యక్షా! ప్రొఫెసర్‌ కె.టి.షా సవరణను నేను అంగీకరించలేను. ముసాయిదాపై చర్చ ప్రారంభంలోనే నేను చెప్పినట్టు - రాజ్యాంగం అనేది రాజ్యానికి సంబంధించిన వివిధ అంశాల పనిని క్రమబద్ధం చేసే మెకానిజం మాత్రమే. రాజ్య విధానం (పాలసి) ఏమిటి ? సాంఘిక, ఆర్థిక పార్శ్వాల్లో సమాజ వ్యవస్థ ఎలా ఉండాలి ? అనేవి కాలాన్ని, పరిస్థితులను బట్టి ప్రజలే నిర్ణయించవలసిన విషయాలు. దాన్ని రాజ్యాంగంలో నిర్దేశించకూడదు. అలా నిర్దేశించడమంటే ప్రజాస్వామ్యాన్ని మొత్తంగా నాశనం చేయటమే. సాంఘిక వ్యవస్థ ఫలానా రూపంలోనే ఉండాలని మీరు రాజ్యాంగంలో పేర్కొన్నారనుకోండి. దానివల్ల, తాము ఏ విధమైన సాంఘిక వ్యవస్థలో ఉండాలనుకుంటున్నారన్నది నిర్ణయించే స్వేచ్ఛను మీరు ప్రజల నుంచి లాగేసినట్టే అవుతుంది'.




     సభ్యులు గోవింద్‌ దాస్‌, హెచ్‌.వి.కామత్‌లు కూడా సవరణను వ్యతిరేకించారు. అప్పుడు సభాపతి సభ అభిప్రాయం కోరారు.

      'The Motion Was negatived'
      సవరణ ప్రతిపాదన తిరస్కరించడమైనది.

[https://indiankanoon.org/doc/163623/]

     క్లాజుల వారీ చర్చ అంతా పూర్తయ్యాక చివరిరోజు 1949 అక్టోబర్‌ 17న చిట్టచివరగా రాజ్యాంగం పీఠికను రాజ్యాంగసభ పరిశీలించింది. మౌలానా హస్రత్‌ మొహాని, హెచ్‌.వి.కామత్‌, ఎం.తిరుమలరావు, తానుపిళ్లై, షిబన్‌ లాల్‌ సక్సేనాలు రకరకాల సవరణలు ప్రతిపాదించారు. సభ్యుల సవరణలన్నిటినీ తిరస్కరించి, డ్రాఫ్టింగు కమిటీ సమర్పించిన ఫీఠికను రాజ్యాంగసభ ఆమోదించింది.

     ఆ విధంగా డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌, అల్లాడి కృష్ణస్వామి, కె.ఎం.మున్షి, సర్దార్‌పటేల్‌  వంటి దిగ్దంతులు బాబూ రాజేంద్రప్రసాద్‌ అగ్రాసనాధిపత్యంలో కొలువైన స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్ణయ సభ ఖరారు చేసిన రాజ్యాంగ పీఠిక మనది - 'Sovereign, Democratic Republic'(సర్వసత్తాక, ప్రజాస్వామ్య రిపబ్లిక్ ) అని మాత్రమే అభివర్ణించింది. 'సెక్యులర్‌' అనే విశేషణం లేకుండానే 1950 నుంచి 27 ఏళ్ల పాటు భారత రాజ్యాంగం నిరాఘాటంగా నడిచింది.


      కాని ఇప్పుడు మీరు రాజ్యాంగ పీఠికను చూస్తే 'Sovereign Socialist Secular Democratic Republic' అని (సర్వసత్తాక సోషలిస్టు సెక్యులర్‌ ప్రజాస్వామ్య రిపబ్లిక్‌) దర్శనమిస్తుంది. 'సోషలిస్టు, సెక్యులర్‌' అన్న విశేషణాలు అవసరమా అన్నది 1948లోనే మహామహులైన మన రాజ్యాంగ కర్తలు వివరంగా చర్చించి, అవేవీ అక్కర్లేదని తోసిపుచ్చారు కదా? మరి మొదట వద్దనుకున్న ఆ పదాలు రాజ్యాంగంలోకి ఎప్పుడు చేరాయి ? ఎలా చొరబడ్డాయి ?

      ఈ నడమంత్రపు చొరబాటు ఇందిరమ్మ పుణ్యం!

      రాజ్యాంగమనేది అక్షరం మార్చకూడని వేదవాక్కు ఏమీ కాదు. కాలాన్నిబట్టి, పరిస్థితులను బట్టి దాన్ని ఎన్నడైనా, ఎలాగైనా మార్చుకోవడానికి రాజ్యాంగ పితరులే అవకాశం కల్పించారు. మొదటి పాతికేళ్లలోనే రాజ్యాంగానికి డజన్లకొద్దీ సవరణలు జరిగిపోయినప్పుడు ఇందిరాగాంధి హయాంలో ఇంకో సవరణ కావడానికి సూత్రరీత్యా ఎవరికీ అభ్యంతరం ఉండనక్కర్లేదు. సర్వోత్కృష్టమైన పార్లమెంటులో సక్రమంగా చర్చించి, అన్ని పక్షాలనూ సంప్రదించి ప్రజాస్వామ్య బద్ధంగా, వేరే దురుద్దేశాలు లేకుండా యధావిధిగా సవరణ కానిచ్చి ఉంటే దానిని ప్రజల నిర్ణయంగా శిరసావహించవలసిందే.

       కాని జరిగిందేమిటి ? ఈ దిక్కుమాలిన సవరణ 1977లో దాపురించింది. అదీ  రాజ్యాంగాన్ని చెరబట్టిన ఎమర్జన్సీ గాఢాంధకారంలో! తన ఎన్నిక చెల్లదన్న అలహాబాద్‌ హైకోర్టు తీర్పును వమ్ముచేసి, తన కుర్చీని కాపాడుకోవటం కోసం రాజ్యాంగ వ్యవస్థలకు, ప్రజాస్వామ్య విలువలకు వలువలు వొలిచిన ఇందిరమ్మ అఘాయిత్యాల కాలంలో!! ప్రజల పక్షాన నిలిచిన రాజకీయ పార్టీల, ప్రజా సంస్థల నాయకులందరినీ జైళ్లలో వేసి, పత్రికలకు సెన్సార్‌ సంకెళ్లు వేసి, రాక్షస ఆంక్షలతో పౌర స్వేచ్ఛలను, భావ స్వాతంత్య్రాన్ని కాలరాచిన పైశాచిక స్వైరవిహారంలో!! పౌర హక్కులలాగే సుప్రీంకోర్టు, హైకోర్టుల చేతులనూ కట్టివేసి రాజ్యాంగ సవరణలను, శాసనాల చెల్లుబాట్లను న్యాయస్థానాల్లో సవాలు చేసే వీలే లేకుండా ఇండియా రాజ్యాంగాన్ని 'ఇందిర రాజ్యాంగం'గా మార్చుకునేందుకు మహాతల్లి బలవంతంగా తెచ్చిపెట్టిన ఇరవై పేజీల 42వ రాజ్యాంగ సవరణలో ఈ పీఠిక మార్పు ఒక భాగం!


      రాజ్యాంగం అమలయ్యాక ఇప్పటికి వందకు పైగా సవరణలు జరిగాయి. అన్నిటిలోకి అత్యంత వివాదాస్పదమైనది, ఏకంగా రాజ్యాంగాన్నే ఎడాపెడా ఇష్టానుసారం మార్చివేసిన నికృష్టపుదీ ఎమర్జన్సీ నాటి ఈ 42వ సవరణ! ఇందులో రాజ్యాంగ పీఠికకు 'సెక్యులర్‌' దినుసును జోడించింది రాజ్యవ్యవహారాల్లో మత ప్రమేయం ఉండరాదన్న సద్భావంతో కాదు. అమ్మగారి సుపుత్రుడు సంజయ్‌గాంధి జనాభాను తగ్గించేందుకు వీరతాడు మెడలో వేసుకొని, గర్భనిరోధ ఆపరేషన్లను ఎవరికి పడితే వారికి, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా, నిర్బంధంగా చేయించి ముఖ్యంగా ముస్లింలకు కంటగింపు అయ్యాడు. అలా దూరమైన మైనారిటీ ఓటు బ్యాంకును మభ్యపెట్టి మళ్లీ కాంగ్రెసు వైపు తిప్పుకోవడం కోసం ఇందిరమ్మ 'సెక్యులర్‌' పాచిక విసిరింది. తనకు పక్క వాయిద్యాలైన కమ్యూనిస్టులను సంతోషపెట్టి, పేదలకేదో ఊడబొడుస్తున్నట్టు జనాలను భ్రమ కొలపడానికేమో 'సోషలిస్టు' సోయగం!

       అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగంలోనే 'సెక్యులర్‌' ప్రస్తావన ఉన్నట్టూ, సెక్యులరిజమనేది అనుల్లంఘనీయమైన రాజ్యాంగ కట్టుబాటు అయినట్టూ, అది లేకుంటే మొత్తం రాజ్యాంగ వ్యవస్థ కింద మీద అవుతుందన్నట్టూ అపోహలు పెంచుకున్నవారు గుర్తించవలసిన చారిత్రక వాస్తవాలివి!

       1977 ఎన్నికల్లో ఇందిరాగాంధీ అధికారాన్ని ప్రజలు పట్టుబట్టి ఊడగొట్టాక గద్దెనెక్కిన జనతా కలగూరగంప ఎమర్జన్సీ అఘాయిత్యాలను సరిదిద్ది రాజ్యాంగాన్ని యథాపూర్వస్థితికి తేవడం కోసం 43వ, 44వ రాజ్యాంగ సవరణలనైతే తెచ్చింది. ఆ పని పూర్తయ్యేలోపే జనతా బొంత చిందరవందర అయింది. మూడేళ్లు తిరక్కుండా ఇందిరాగాంధీ మళ్ళీ వచ్చి కూర్చుంది. రాజ్యాంగ సవరణలు కోర్టుల పరిధిలోకి రావని, ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలు గొప్పవని 42వ రాజ్యాంగ సవరణలో చొప్పించిన అంశాలు రాజ్యాంగ విరుద్ధమని అదృష్టవశాత్తూ సుప్రీంకోర్టు 1980 జూలైలో మినర్వా మిల్స్‌ కేసులో కొట్టి వేసింది. దాంతో ఎమర్జన్సీ అత్యాచారం బారినుంచి భారత రాజ్యాంగం చాలా వరకు బయట పడింది.   

       మరి రాజ్యాంగ పీఠికలో 'సెక్యులర్‌, సోషలిస్టు' పదబంధం మాత్రం ఇంకా ఎందుకు కొనసాగుతున్నది ? 42వ రాజ్యాంగ సవరణలోని మిగతా అంశాలను కొట్టివేసిన సుప్రీంకోర్టు దీనిని మాత్రం ఎందుకు రద్దుచేయలేదు ?

      రద్దు చేయమని ఇప్పటిదాకా ఎవరూ సీరియస్‌గా సుప్రీంకోర్టును అభ్యర్థించలేదు కాబట్టి! ఈ విషయంలో దాఖలైన ఒకటీ అరా వ్యాజ్యాలు ఆషామాషీ మనుషులు తీరికూర్చుని వేసిన పోచుకోలు కేసులు కనుక!

      ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని ఎవరూ దావా ఎందుకు వేయలేదు? ఎందుకంటే సెక్యులరిజమనేది మన కల్లబొల్లి రాజకీయ వ్యవస్థలో 'పవిత్ర గోవు' లాంటిది కనుక! పొద్దున లేచింది మొదలు ప్రతిదీ కులం దృష్టితో, మతాల దృష్టితో మాత్రమే చూసి, రాజకీయ లబ్దికోసం ఎంతటి నీచానికైనా వెనుదీయని వాడు కూడా తాను 'సెక్యులర్‌' అని చెప్పుకుంటాడు కాబట్టి!! నిజమైన సెక్యులర్‌ తత్వం ఏ కోశానా లేకపోయినా, సెక్యులరిస్టు పచ్చబొట్టును ముఖాన పొడిపించుకొంటే గాని రాజకీయ పబ్బం గడవదు కనుక! వాటమైన ఈ కపటాన్ని వదిలిపెట్టి, పనిగట్టుకొని  సూడో సెక్యులర్‌ వేషాలను సవాలు చేసి, అందరికీ కంటగింపు కావటానికి బతక నేర్చిన వారెవరూ సాధారణంగా ఇష్టపడనందువల్ల !!


Friday, 22 June 2018

హిందూ మతాతీత లౌకిక రాజ్యం


పెక్యులరిజం - 1

- ఎం.వి.ఆర్‌.శాస్త్రి



    మనకో పెద్ద భ్రమ

    మనది మతాతీత లౌకిక రాజ్యమని! రాజ్య వ్యవహారాల్లో మతాల ప్రసక్తి, ప్రమేయం ఉండనే ఉండవని! ఒక మతం ఎక్కువ, వేరొక మతం లేక మతాలు తక్కువ అన్న వివక్ష లేకుండా భారత రాజ్యం, రాజ్యాంగం అన్ని మతాలను సమానంగా చూస్తాయని!!

    వాస్తవానికి మనది 'హిందూ మతాతీత లౌకిక రాజ్యం'. రాజ్య వ్యవహారాల్లో ఒక్క హిందూ మతానికి మాత్రమే ప్రమేయం ఉండదు.ప్రాముఖ్యం ఉండదు.

     క్రైస్తవులు మెజారిటీ అయిన దేశాలు ప్రపంచంలో 126 ఉన్నాయి. వాటిని క్రిస్టియన్‌ దేశాలు అనడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు. ముస్లింలు మెజారిటీ అయిన దేశాలు ప్రపంచంలో 50 ఉన్నాయి. వాటిని ముస్లిం దేశాలు అనడానికి మన మేధావులకు అభ్యంతరం ఉండదు.

     ప్రపంచంలో మూడవ పెద్ద మతం హైందవం. హిందువులు మెజారిటీ అయిన దేశాలు ప్రపంచంలో మూడే మూడు. 1. భారత్‌, 2. నేపాల్‌ 3. మారిషస్‌. మూడింటిలోకి అతి ముఖ్యమైనదీ, అన్నిటికంటే పెద్దదీ, ప్రపంచంలో హైందవానికి ఏకైక ఆలంబనంగా చెప్పుకోగలిగిందీ భారతదేశం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ దేశంలో 79.8 శాతం హిందువులు. అయినా దీన్ని హిందూ దేశం అంటే మన మహామేధావులు, రాజకీయ జీవులు చచ్చినా ఒప్పుకోరు!

      దేశ ప్రజల్లో నూటికి 80 మంది హిందువులే అయినా సరే ఇది హిందూజాతి కాదట! ఇక్కడున్న జాతీయ సమాజం హిందువులది కాదట! ఈ దేశంలో విలసిల్లేది హిందూ సంస్కృతి కానే కాదట.

     ప్రపంచంలో ఏ దేశంలోనూ నూటికి నూరుగురు ఒకే మతానికి చెంది ఉండరు. నూటికి 80 మంది క్రైస్తవులైన దేశాల్లో 20 శాతం అయినా క్రైస్తవేతరులు ఉంటారు. నూటికి 80 మంది ముస్లింలైన ఇస్లామిక్‌ రాజ్యాల్లోనూ 20 శాతం అయినా మహమ్మదీయేతరులు ఉంటారు. ఆ క్రైస్తవేతరులకీ, ఈ మహమ్మదీయేతరులకీ వారివారి మతాలు, సంస్కృతులు వేరే ఉంటాయి. అంత మాత్రాన ఆ దేశాలది మిశ్రమ సంస్కృతి అని, అక్కడున్నది భిన్న రీతులు, ప్లూరలిస్టిక్‌ సమాజాలనీ బుద్ధున్నవాడు ఎవడూ అనడు. 20 శాతమో, అంతకంటే ఎక్కువో తక్కువో ఇతర మతాలను, సంస్కృతులను అనుసరించే వారు ఉన్నప్పటికీ అత్యధిక సంఖ్యాకులు ఎటువైపు అన్నదానిని బట్టి ఆయా దేశాలను క్రైస్తవ దేశాలుగానో, ఇస్లామిక్‌ దేశాలుగానో పరిగణించడాన్ని ఎవరూ ఆక్షేపించరు. క్రైస్తవ దేశాల్లో క్రైస్తవానికీ, ఇస్లామిక్‌ దేశాల్లో ఇస్లామ్‌కీ జన జీవితంలో అత్యంత ప్రాధాన్యం ఇవ్వటానికి తలకాయ ఉన్నవాడెవడూ అడ్డురాడు.

      చిత్రమేమిటంటే - మిగతా ప్రపంచం విషయంలో కనపరిచే ఈ కామన్‌సెన్సు ఇండియాలో హిందూమతం దగ్గరికి వచ్చేసరికి మన విచిత్ర బుద్ధిజీవులకు మటుమాయమవుతుంది. 'ఎప్పుడైనా, ఎందులోనైనా మెజారిటీకే పెద్దపీట' అన్న ప్రజాస్వామ్య మూల సూత్రాన్ని కూడా ఇండియాలో హిందువుల దగ్గరికి వచ్చేసరికి సోకాల్డ్‌ ప్రజాస్వామ్య వాదులు తుంగలో తొక్కుతారు. ఇతర మతాల వారు 20 శాతం ఉన్నారు కాబట్టి ఆ మైనారిటీలను నెత్తిన పెట్టుకొని, వారికి ఎలాంటి అసౌకర్యం లేక మనస్తాపం కలగకుండా అతి జాగ్రత్త చూపుతూ, ఒళ్లు దగ్గర పెట్టుకొని అణిగిమణిగి ఉండటమే మెజారిటీ మతస్తుల ప్రారబ్దం అయినట్టు బుద్ధిలేని బుద్ధిజీవులు మన దేశంలో సుద్దులు చెబుతారు. 'బ్రూట్‌ మెజారిటీ' తొక్కి వేయకుండా సుకుమారపు మైనారిటీలను కళ్లలో వత్తులు వేసుకొని కాపాడటమే పాలకుల ప్రథమ కర్తవ్యమని వారు జంకు లేకుండా దబాయిస్తారు.

      సౌదీ అరేబియా లాంటి అనేక ఇస్లామిక్‌ దేశాల్లో ఒక హిందువు తన జేబులో రాముడి బొమ్మో, కృష్ణుని బొమ్మో పెట్టుకుంటే నేరం. తలుపులు మూసుకుని తన ఇంట్లో తాను ఏ గణపతి పూజో, సత్యనారాయణ వ్రతమో చేసుకోవటం మహాపరాధం. అధికారిక మతం అయిన ఇస్లామ్‌ను మినహా వేరొక మతాన్ని ఆచరించరాదని, వేరొక దైవాన్ని పూజించరాదని నిషేధించటం మానవ హక్కులకు, వ్యక్తి స్వేచ్ఛకు భంగకరమని అనడానికి ఏ హేతువాదికీ గొంతు పెగలదు. 'వారి మతం వారిష్టం. వారి దేశంలో ఉన్నప్పుడు వారు చెప్పినట్టే నడుచుకోవాలి' అంటూ పిరికి సమర్థింపు ఒకటి.

     అదే హిందూ దేశంలో 80 శాతంగా ఉన్న హిందువులు తమ ఇష్ట దైవాలను బహిరంగంగా పూజించటం, తమ మతాచారాలను, సంప్రదాయాలను బాహాటంగా పాటించటం ఇదే 'హేతువాదుల'కు సహించరాని మతోన్మాదంగా కనపడుతుంది. చదువుల తల్లి సరస్వతి దేవిని పాఠశాలల్లో రోజూ ముందుగా స్తుతించాలని కోరడం హిందూ ఫాసిజంగా, మైనారిటీల సెంటిమెంట్లను, మత హక్కులను భంగపరిచే కవ్వింపు చర్యగా మన విద్యావంతులకు ఒళ్లు మండిస్తుంది. దేశంలో 80 శాతంగా ఉన్న హిందువులకు ఆరాధ్య దైవాలు, ఆదర్శ పురుషులు, జాతీయ వీరులు అయిన శ్రీరామచంద్రుడి గురించి, శ్రీకృష్ణుడి గురించి బడి పిల్లలకు బోధించాలని చెప్పడం మెదళ్లు పుచ్చిన మన మేధావుల దృష్టిలో మహాపరాధం, క్షమించరాని మతమౌఢ్యం. ప్రజల సొమ్ముతో, ప్రభుత్వ ఖర్చుతో నడిచే మదరసాల్లో పరమత ద్వేషం ప్రబోధించడాన్ని, హిందూ కాఫిర్లను తిట్టి పోయడాన్ని తప్పు అని మన మేధావులు సుతరామూ ఒప్పుకోరు. వారి దృష్టిలో అదంతా మైనారిటీల న్యాయబద్ధ, మత హక్కుల్లో భాగమే. భారతదేశంలో ఉంటూ భారతమాతకు జై అనము పొమ్మని మొరాయించవచ్చు. జాతి పౌరులుగా సమస్త హక్కులు అనుభవిస్తాము కాని, జాతీయ గేయమైన వందేమాతరాన్ని గౌరవించము అని మొండికేయవచ్చు. అదంతా మైనారిటీల మతస్వేచ్ఛగానే భావించవలెను. అందులో జాతి ధిక్కారాన్ని చూసేవాడిని నీచ నీకృష్ట హిందూ కమ్యూనలిస్టుగా, భారతదేశపు కాంపొజిట్‌ కల్చర్‌కు పరమ శత్రువుగా కుళ్లబొడవవలెను.

     కోర్టు కచేరీల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో రామనవమి కళ్యాణోత్సవం, నవరాత్రి వేడుకలు లాంటివి జరపటం తప్పు. కోట్లు ఖర్చుపెట్టి ప్రభుత్వాలు ఇఫ్టార్‌ విందులు ఇవ్వటం ఒప్పు. ఈ దేశ ప్రధాని గంగానదికి హారతి ఇస్తే తప్పు. ముఖ్యమంత్రులు చర్చిలకు, మసీదులకు వెళ్ళి అన్యమత ప్రార్థనలు చేసినట్టు నటించటం రైటు. ఇస్లామిక్‌ దేశాలు కూడా ఇవ్వని సబ్సిడీలు హజ్‌ యాత్రికులకు విరగబడి ఇవ్వటం సముచితం. అదేరకమైన సౌకర్యాలు, రాయితీలు అమర్‌నాథ్‌, మానస సరోవర యాత్రికులకు కూడా కల్పించమని అడగటం దుర్మార్గం.

      మైనారిటీలకు చెందిన గవర్నమెంటు ఎయిడెడ్‌ స్కూళ్లలో బైబిల్‌ను, ఖురాన్‌ను బోధించటం రాజ్యాంగబద్ధం. రామాయణాన్ని, భగవద్గీతను పిల్లలకు నేర్పించాలని హిందువులు అడగటం కమ్యూనలిజం! గోద్రా హత్యాకాండ గురించి మాట్లాడటం కరెక్టు. అదే గోద్రాలో రామభక్తుల సజీవ దహనాల గురించి ప్రస్తావించటం తప్పు. మహమ్మద్‌ ప్రవక్తమీద వచ్చిన కార్టూన్‌ను, చర్చిమీద పడిన రాయిని తెగనాడటం పుణ్యం. కాశ్మీర్‌లో వేలాది హిందువుల ఊచకోతను గుర్తు చేయటం పాపం.

     ఇలా  చెబుతూ పోతే చేంతాడంత! మన సంస్కార వంతుల విచిత్రరీతులు ఎంత చెప్పినా తరగనివి!!

     క్రైస్తవం అధికార మతం కాని అమెరికాలో కూడా నూతన అధ్యక్షుడి పదవీ స్వీకారం వంటి వేడుకల్లో క్రైస్తవ మతాచార్యులకు ప్రాముఖ్యం ఇస్తారు. మెజారిటీ మతానికి సముచిత ప్రాధాన్యం ఇస్తూనే మైనారిటీ మతాలకూ తగినంత స్వేచ్ఛ కల్పించటం ప్రపంచంలో అనేక క్రైస్తవ దేశాల్లో చూస్తున్నాం. అదే సరైన పద్ధతి అని మేధావిలోకం అంగీకరిస్తుంది. కాని భారత్‌ విషయం వచ్చేసరికి మేధావి గణానికి మాయరోగం కమ్ముతుంది. మెజారిటీ మతాన్ని చీదరిస్తేగాని, మెజారిటీ మత విశ్వాసాలను, సెంటిమెంట్లను చులకన చేస్తేగాని మైనారిటీలకు న్యాయం జరగదు. మన ప్లూరలిజానికి సార్థక్యం ఉండదు అని వారి పెడబుద్ధికి తోస్తుంది.

    ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరుగని ఈ వెర్రిమొర్రి ఆలోచనా విధానానికి మన మహానుభావులు పెట్టిన ముద్దుపేరు 'సెక్యులరిజం'.

      మనది మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం అని నంగిరి కబుర్లు ఎన్ని చెప్పినా, మన రాజకీయ, పరిపాలక వ్యవస్థల్లో అడుగడుగునా ఉన్నది మత ప్రమేయమే! అధికారిక మతం అని ప్రత్యేకంగా ఏ ఒక మతాన్ని ప్రకటించక పోయినా, వాస్తవానికి మన రాజ్య వ్యవస్థకూ ఒక మతం ఉంది.

       ఆ అప్రకటిత అధికార మతం పేరు 'సెక్యులరిజం'.

       చాలా మతాల్లాగే దానికీ ఒక ప్రవక్త ఉన్నాడు. ఒక అలిఖిత పవిత్ర గ్రంథం ఉంది. అందులో ఎన్నో సువార్తలున్నాయి.

     నడమంత్రపు అధికార మతానికి ప్రవక్త పేరు జవహర్‌ లాల్‌ నెహ్రూ. కొత్త మతం స్థాపనకు ఆయన పడిన కష్టం, చేసిన తపస్సు, చూపిన దార్శనికత, అందులో బోలెడు సృజనాత్మకత వివరించాలంటే పెద్ద గ్రంథమవుతుంది.



      మతమన్నాక ఎంతో కొంత మతమౌఢ్యం ఉంటుంది. విదేశీయ మతాల్లో మరీనూ. ఉత్పత్తి స్థానం విదేశీయం కాబట్టి మన అధికార మతంలోనూ మూఢత్వం పాలు జాస్తి. సెక్యులరిజం ఒక్కటే సత్యం. అది మాత్రమే నిత్యం, శాశ్వతం. మన పౌర సమాజంలో మర్యాదస్తుడిగా, పెద్దమనిషిగా గుర్తింపు పొందాలనుకునే ప్రతివాడూ తిరుగులేని ఈ దైవ వాక్కును అంగీకరించి తీరాలి. Only True Religion  ఏకైక సత్యమతంగా సెక్యులరిజాన్ని ఎవడన్నా ఒప్పుకోకపోతే వాడికి మూడిందే. సెక్యులరిజానికి చందా కట్టని వాడికి సమాజంలో పుట్టగతులుండవు.

      ఇంతకీ 'సెక్యులరిజం' అనేది ఎప్పుడు పుట్టింది? ఎక్కడ, ఏ ఉద్దేశంతో ఏ సందర్భంలో పుట్టింది? ఇది భారతదేశానికి ఎన్నడు వచ్చింది? ఎలా రూపు మార్చుకొంది? ఏకైక సత్య మతంగా ఏ ప్రకారం అవతారమెత్తింది? దీని ప్రవక్త ఏమి చెప్పాడు ? కొత్త మతాన్ని ఎలా ముందుకు తీసికెళ్ళాడు? తనను నమ్మని అవిశ్వాసులను ఎలా శిక్షించాడు? తన మతంలో చేరని ద్రోహుల ధిక్కారాలను ఎలా అణచివేశాడు? కొత్త మతం వ్యాప్తికి ఏ అపొస్తలులను ఎంచుకున్నాడు? వారి సువార్తల ఫలమేమిటి? ప్రభావమేమిటి? అధికార మతానికి మూల సూత్రాలు, కమాండ్‌మెంట్లు ఏమిటి? వాటిని పాటిస్తే కలిగే లాభమేమిటి? పాటించకపోతే వాటిల్లే కీడు ఎలాంటిది? కాలక్రమంలో మొత్తం భారతీయ వ్యవస్థ మీద, ముఖ్యంగా హిందూ సమాజం మీద కొత్త మతం వేసిన చెరగని ముద్ర ఎటువంటిది? దాని మంచిచెడ్డలేమిటి?

       తరువాయి వ్యాసాల్లో వరసగా చర్చిద్దాం.

Friday, 15 June 2018

పిల్లలకి నేర్పే పాఠాలు ఇవా ?

ఉన్నమాట

 ఎం.వి.ఆర్‌.శాస్త్రి

...............

 అభ్యాసము :


మీ స్నేహితులతో చర్చించి కింది ప్రశ్నలకు జవాబు వ్రాయుము :

1. ఏసు క్రీస్తు జీవిత విశేషాలు

2. ఏసు క్రీస్తు బోధలు

3. క్రైస్తవ మతం ఎలా విస్తరించినది ?

4. మహమ్మద్పైగంబర్జీవిత విశేషాలు

5. హిజ్ర అనగా నేమి?

6. ఇస్లాం ఉపదేశాలు ఏమిటి?


యాక్టివిటి :


1. మీరున్న చోట చర్చిలను, మసీదులను దర్శించి అక్కడి మతాచారాలపై ఒక నోట్వ్రాయండి.

2. క్రైస్తవులలో క్రిస్టమస్వేడుక పద్ధతిని అర్థం చేసుకొనండి.

3. ముస్లింలు రంజాన్ఎలా జరుపుకొంటారో అర్థం చేసుకొనండి.

ప్రాజెక్టు వర్కు :


క్రైస్తవ, ఇస్లాం మతాలు ఎలా వ్యాప్తి చెందుతున్నాయన్న దానిపై మీ టీచర్సహాయంతో ఒక వ్యాసం వ్రాయండి.



..............

     ఇదండీ - కాంగ్రెసువారి చల్లని పాలనలో కర్నాటక సర్కారు వారు 9 తరగతి విద్యార్థుల మీద రుద్దిన సోషల్సైన్స్టెక్ట్స్బుక్లో చరిత్ర విభాగం కింద 'క్రైస్తవం, ఇస్లాం' అనే మొట్టమొదటి పాఠం చివర విద్యార్థులకు పురమాయించిన అద్భుత 'అభ్యాసం!'

     ఇది చూసి- 'మనకాలంలో లేనిది ఇప్పుడు మతాల, ప్రవక్తల బోధలను కూడా పిల్లలకు నేర్పిస్తున్నారా' అని ఆశ్చర్యపోకండి. దేశంలో నూటికి 20 మందికి ప్రాతినిధ్యం వహించే మైనారిటీ మతాలమీదే ఇంత శ్రద్ధ పెట్టారంటే ఇక నూటికి 80 శాతం అనుసరించే హిందూ మతం మీద ఇంకెంత ఓవరైపోయారోనని ఊహించేసుకోకండి. రాముడు, కృష్ణుడు లాంటి ఆరాధ్యదైవాల బోధలకు; రామాయణ, భారత, భాగవత, గీతాది పవిత్ర గ్రంథాల వాక్కులకు; ఏడాది పొడవునా సాగే హిందువుల పండుగలకు సంబంధించి ఎన్నెన్ని మంచి విషయాలు పిల్లలకు నేర్పిస్తున్నారోనని మురిసిపోండి. చర్చిలకు, మసీదులకు పిల్లల్ని పోయిరమ్మన్నట్టే హిందూ దేవాలయాలకు కూడా వెళ్లి పూజాదికాలను గమనించండని చెబితే చిన్నారులకు మంచిదే లెమ్మని సరిపెట్టుకోకండి.

     ఎందుకంటే - దేశంలో అతిప్రధాన మతమైన హైందవం ఊసు అమోఘ చరిత్ర పాఠ్యపుస్తకంలో కాగడాతో వెదికినా కానరాదు.

      ఈ టెక్ట్స్బుక్లో చరిత్ర విభాగానికి సంబంధించి postcard.news వెబ్సైట్పరిశోధనాత్మక వ్యాసంలో ప్రచురించిన విషయ సూచిక ఇది..

1. క్రైస్తవం మరియు ఇస్లాం

2. మధ్యయుగ భారతదేశం, రాజకీయ పరిణామం

3. మత ప్రచారకులు, సాంఘిక సంస్కర్తలు

4. బహమనీ మరియు విజయనగర సామ్రాజ్యాలు

     అంతే! అయిపోయింది. అంటే సెక్యులర్విద్యావిధానంలో చరిత్రకు సంబంధించి తొమ్మిదో క్లాసు విద్యార్థులకు మొట్టమొదట బోధించవలసింది క్రైస్తవ, ఇస్లాం మతాల బోధనలు, వాటి ప్రవక్తల ఉపదేశాలు, మతాలు ఎంచక్కా వ్యాపిస్తున్న తీరు గురించి! వారికి ఎంత మాత్రం తెలియనివ్వకూడనిది ప్రపంచమంతా నెత్తిన పెట్టుకున్న ¬న్నత హిందూ మతం గురించి!

     అన్ని మతాల గురించి పిల్లలకు తెలియజెప్పదలిచామని పాఠ్య పుస్తకంలో చెప్పుకున్నా, క్రైస్తవ, మహమ్మదీయ మతాలు మినహా మరో మతం ఊసు ఎక్కడా కానరాదు. సెక్యులరిస్టులకు మహా ముద్దొచ్చే రెండు మతాల గురించి చెప్పి ఊరుకోవడం గాక, పిల్లలని బలవంతంగా చర్చిలకు, మసీదులకు పంపించి, మతాల ప్రాశస్త్యాన్ని గ్రహించి, ప్రాశ్యస్తాన్ని వ్యాప్తి చేసే పనిని కూడా 'అభ్యాసం' పేరుతో వారిమీద పెట్టటం దుర్మార్గం, తీవ్రాభ్యంతరకరం.

     ఎవరెంత నెట్టినా తమ పిల్లలు కిరస్తానీ చర్చిలకు పోవటానికి మహమ్మదీయులు ఎలాగూ అంగీకరించరు. అలాగే క్రైస్తవులు తమ బిడ్డలను మసీదు గడప తొక్కనివ్వరు. ఎటొచ్చీ చర్చిలకు, మసీదులకు పోయి మతాంతీకరణ గాలాలకు వాటంగా చిక్కేదెవరయ్యా అంటే - మతాభిమానం కోశానా లేని హిందువుల పిల్లలే !

      'శ్రీరాముడి జీవిత విశేషాలు తెలుపుము. హిందూ మతం ప్రత్యేకత ఏమిటి? మీ దగ్గర్లోని రామాలయానికి, శివాలయానికి వెళ్లి అక్కడ జరిగే పూజా విధానాలను పరిశీలించండి. వేల సంవత్సరాలుగా హిందూ మతం వర్ధిల్లడానికి కారణాలు కనుక్కోండి' అని ఇవాళ పాఠ్య పుస్తకంలోనైనా విద్యార్థులకు చెబితే దేశంలోని వీర, శూర సెక్యులరిస్టులందరూ ప్రపంచం తలకిందులైనట్టు ఎంతగా గుండెలు బాదుకుంటారు ? విద్య కాషాయీకరణం జరిగిపోతోందంటూ దిక్కులు దద్దరిల్లేలా దేశమంతటా మీడియా నిండా ఎంత లొల్లి అయ్యేది?

     నిజానికి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మహా పాఠ్య గ్రంథం 'కాషాయీకరణ'కు విరుగుడుగా వచ్చిందే! కర్నాటకలో పూర్వం బిజెపి హయాంలో పాఠ్యపుస్తకాలన్నీ 'కాషాయమయం' అయిపోయాయని వామపక్ష, లిబరల్‌, సెక్యులర్మహాజ్ఞానులు గోలగోల చేశారు. మెకాలే మానస పుత్రులు భారత చరిత్రకు చేసిన దారుణ వక్రీకరణలను ఏదో కొంచెం సరిచేసి, భారతీయ విజ్ఞానాన్ని, వేదగణితం, ఆయుర్వేదం వంటి ఉజ్జ్వల శాస్త్ర వారసత్వాన్ని నేటి తరానికి తెలియజెప్పటమే హిందూ మతోన్మాదం, జాతి విద్రోహ మహాపరాధంగా సూడో సెక్యులర్విజ్ఞాన ఖనుల పక్షపాతపు కళ్లకు తోచింది. సదరు 'కాషాయ' కుత్సితాన్ని వమ్ముచేసి పాఠ్య పుస్తకాలను సెక్యులర్శాస్త్రం ప్రకారం శుద్ధి చేసే పనికి సిద్ధరామయ్య గారి కాంగ్రెసు దొరతనం బరగురు రామచంద్రప్ప అనే మహా పురుషుడు ఛైర్మన్అయిన రాష్ట్ర టెక్ట్స్బుక్రివిజన్కమిటీకి అప్పగించింది. హిందువులన్నా వారి మతమన్నా మా చెడ్డ ఎలర్జీ అయిన మహనీయుడి సమర్థ సారథ్యంలో తగలడ్డ కొత్త పాఠ్యగ్రంథాల తీరు ఇదిగో ఇది.

     వేదగణితం, ఆయుర్వేదం గురించి పిల్లలకు చెప్పడమేమో కమ్యూనల్‌ ! సొంత మతాన్ని ఈసడించి పరమతాల పంచన చేరమని బడి పిల్లలను పురికొల్పడమేమో 'సెక్యులర్‌!' భలే !!

        'సెక్యులర్విద్య అనగా భారతీయ సంస్కృతిని, యధార్థ జాతీయ చరిత్రను, హైందవ నాగరికతను తెగనాడి, హిందూమతాన్ని పాపాలపుట్టగా చిత్రించడం' అని కుహనా సెక్యులరిస్టులు ఏనాడో స్థిరం చేశారు. కాబట్టి ఇటలీ దొరసాని గారి పార్టీ ఏలుబడిలో బడి పుస్తకాలకు ఇలా చేతబడి జరిగినందుకు మరీ షాకైపోనవసరం లేదు. ఆశ్చర్యాల్లోకెల్లా ఆశ్చర్యం ఏమిటంటే దేశవ్యాప్తంగా విద్యాబోధన సవ్యంగా జరిగేట్టు, పాఠ్యగ్రంథాలు నిర్దుష్టంగా రూపొందేట్టు చూడవలసిన జాతీయ విద్యా, పరిశోధన మండలి (ఎన్‌.సి..ఆర్‌.టి.) సైతం  దిక్కుమాలిన నిర్వాకాన్ని కళ్లుండీ కానలేకపోవటం !

       కర్నాటకలో కాంగ్రెసు సర్కారు పాఠ్యగ్రంథాలను భ్రష్టు పట్టించిన తీరుకు ఒళ్లుమండిన వారు దాని సంగతేదో చూడమని ఎన్‌.సి..ఆర్‌.టి.కి ఫిర్యాదు చేస్తే ఏమయింది ? 1 నుండి 10 తరగతి వరకు కర్నాటక రాష్ట్ర పాఠ్య పుస్తకాలను దుర్భిణి వేసి పరిశీలించిన పేరుగొప్ప జాతీయ మండలి వారు చివరికి ఆర్నెల్ల కింద తేల్చిందేమిటంటే ' పుస్తకాల్లో గ్రామర్తప్పులు, స్పెల్లింగు తప్పులు, బోధన పద్ధతుల లోపాలున్నా మొత్తం మీద అవి 2005 నాటి నేషనల్కరిక్యులం ఫ్రేమ్వర్క్పరిధిలోనే ఉన్నాయి' అని ! శభాష్‌ !

        కాంగ్రెసు పార్టీ, దాని కులదైవాలు హిందూ మతానికి, హైందవ సంస్కృతికి కీడు కోరే బాపతు కాబట్టి కాంగ్రెసు హయాంలో కర్నాటక పాఠ్యగ్రంథాలు అంత సుందర ముదనష్టంగా తయారవటంలో వింత లేదు. జాతీయ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాల విలువ తెలిసినదని అందరూ అనుకొనే నరేంద్రమోది ప్రభుత్వ హయాంలో కూడా జాతీయ విద్యామండలి కీలకమైన విద్యాబోధన విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరించటం సిగ్గుచేటు.

         1999లో కొలువుతీరిన వాజపేయి ప్రభుత్వంలో మానవ వనరుల శాఖమంత్రి అయిన మురళీమనోహర్జోషి గొప్ప చొరవ చూపి అంతవరకూ పాఠ్యగ్రంథాల్లో చరిత్రకు, భారత జాతీయతకు జరిగిన దారుణ వక్రీకరణలను సరిదిద్దేందుకు ఉపక్రమిస్తే 'విద్యను కాషాయీకరణ చేస్తున్నారు బాబోయ్‌' అని దేశమంతటా పెద్ద దుమారం లేచింది. వామపక్ష కుహనా మేధావులు, దుష్ట రాజకీయ శక్తులు ఎంత గోల పెట్టినా పట్టువదలని జోషీజీ మొదలుపెట్టిన ప్రక్షాళనను పూర్తి చేసే లోపే ఎన్‌.డి.. తొలి జమానాకు నూకలే చెల్లాయి. దాని స్థానంలో గజ్జె కట్టిన యుపిఎ రాజ్యం వచ్చీరాగానే చేపట్టిన మొదటి పని పాఠ్యపుస్తకాల మరమ్మత్తు. యుపిఎ సర్కారుకు రాజ బంధువులైన కమ్యూనిస్టులు, వారి ఇష్టులైన ఎర్ర చరిత్రకారులు తెగ కష్టపడి 2005 కల్లా నేషనల్కరిక్యులం ఫ్రేమ్వర్కును తమకు కావలసినంత రీతిలో తయారు చేశారు. అంతకుముందు మురళీ మనోహర్జోషి పూనికతో పాఠ్యాంశాలకు జరిగిన మార్పులను చేర్పులను మొత్తంగా ఎత్తేసి, యథా పూర్వ మెకాలే మార్కు మూసలో జాతి శత్రువులను ఆకాశానికెత్తుతూ, జాతీయ వీరులను నీచంగా చిత్రిస్తూ, యధార్థ చరిత్రను తారుమారు చేసి చడీచప్పుడు కాకుండా పాఠాలన్నింటికి ఎర్ర రంగు పులిమి సమూలంగా మార్చేశారు.

       చిత్రమేమిటంటే కేంద్రాన యుపిఎ పోయి ఎన్డిఎ వచ్చినా యుపిఎ ఎర్రన్నలు పెట్టిపోయిన పాత మూసలోనే జాతీయ కరిక్యులం ఇప్పటికీ నడుస్తున్నది. భారతమాత దాస్యపు సంకెళ్లు తెంచటం కోసం జీవితాన్ని ధారపోసి ఉరికంబం ఎక్కిన స్వాతంత్య్ర వీరుడు భగత్సింగ్టెర్రరిస్టు అనే మాటను మన జాతీయ పాఠ్యప్రణాళిక స్వతంత్రం అనబడేది వచ్చి డెబ్భై ఏళ్లు దాటాక నేడు కూడా మన పిల్లలకు బోధిస్తున్నది.

        'నాకు మీ రక్తం ఇవ్వండి.. నేను మీకు స్వరాజ్యం తెస్తా' అని నినదించి, బ్రిటిషు వాళ్ల మీదికి సైన్యంతో దండెత్తి, తెల్లవాళ్లు మన దేశం విడిచి ఉన్నపళాన పారిపోవడానికి ముఖ్య కారకుడైన నేతాజీ సుభాష్చంద్రబోస్ను గాంధీజీకి ఎదురు తిరిగిన రాజకీయ రెబల్గానే ఎన్సిఇఆర్టి వారి పాఠ్యపుస్తకాలు పరిగణిస్తున్నాయి.

       మోసాలతో, నమ్మక ద్రోహాలతో, పాపిష్టి కుట్రలతో భారతదేశాన్ని ఆక్రమించి, శతాబ్దాల పాటు మన అపార సంపదను కొల్లగొట్టి, మనల్ని పిశాచాల్లా పీడించిన ఇంగ్లీషువారిని దేశాన్ని అభివృద్ధి చేసి, జాతికి విద్యాబుద్దులు గరపిన పుణ్యాత్ములుగానే మన టెక్ట్సుబుక్కులు ప్రస్తుతిస్తున్నాయి.

       పూర్వపు ఎన్డిఎ పాలనలో వెనకటి మెకాలే మార్కు చెత్తను తొలగించి, శుద్ధి చేసిన పుస్తకాల్లో 8 తరగతి విద్యార్థులకు నేతాజీ గురించి 500 పదాల్లో చెప్పారు. యుపిఎ జమానాలో వామపక్షుల చేయి పడ్డా పాఠం మొత్తం ఎగిరిపోయింది. 12 తరగతి పాఠంలో అంతకు ముందు 1250 పదాల్లో ఉన్న నేతాజీ ప్రస్తావన  కాస్తా  'కాషాయాన్ని' తీసేసి 'ఎర్ర'రంగు పులిమే యుపిఎ ప్రక్రియలో 87 పదాలకు దిగజారిపోయింది. చంద్రశేఖర్ఆజాద్‌, బటుకేశ్వర దత్త, రాంప్రసాద్బిస్మిల్వంటి గొప్ప జాతీయ యోధులు 36 మంది ఊసే ఎర్రశుద్ధి చేయబడిన జాతీయ పాఠ్యగ్రంథాల్లో ఎక్కడా మచ్చుకైనా కానరాదు. క్రికెట్కు, వస్త్రాల చరిత్రకు ఏకంగా 37 పేజీలు కేటాయించిన పాఠ్య పుస్తకాల్లో సిసలైన స్వాతంత్య్ర వీరుల జీవితాల గురించి ఒక్క ముక్కా చెప్పకపోవటం స్వతంత్ర జాతికి తలవంపులు.

      దీనిమీద ఒళ్లుమండిన సూర్యప్రతాప్సింగ్రాజావత్అనే బాధ్యత ఎరిగిన పౌరుడు పైన ఉటంకించిన సమాచారాన్నంతా సమాచార హక్కు (ఆర్‌.టి..) కింద అర్జీలు పెట్టి రాబట్టి తప్పులను సరిదిద్దేట్టు చూడండంటూ రెండేళ్ల కింద కేంద్ర కమీషన్ను ఆశ్రయించాడు. మన తెలుగువాడైన సెంట్రల్ఇన్ఫర్మేషన్కమిషనర్మాడభూషి శ్రీధరాచార్యులు ఎందుకిలా జరిగిందంటూ 2016 జనవరిలో ఎన్‌.సి..ఆర్‌.టి.ని నిలదీశారు. స్వామి వివేకానంద, నేతాజీ సుభాస్వంటి జాతీయ నాయకులకు సంబంధించిన పాఠాలనే ఏకంగా ఎత్తేశారంటే మీరు, మీ కరిక్యులం ఏమి చేస్తున్నట్టు ? క్షమించరాని తప్పులను సరిచేసి పాఠ్యగ్రంథాలను సంస్కరించటానికి మీరేమి చేయబోతున్నారు ? అని సూటిగా అడిగారు.

        'టెక్ట్స్బుక్కుల కంటెంటును నిపుణుల కమిటీ స్వతంత్రంగా నిర్ణయిస్తుందండి. దాని పనిలో మేము కలగజేసుకోము. ఇప్పుడు ఫిర్యాదు ఎత్తిచూపిన విషయాలను, వాటిపై మీ ఆదేశాలను తప్పక పరిగణనలోకి తీసుకొని అవసరమైన దిద్దుబాటును చేపడతాం' అని ఎన్‌.సి..ఆర్‌.టి. ప్రతినిధి సందర్భంలో కేంద్ర కమిషన్కు హామీ ఇచ్చారు.

       ఇది జరిగి రెండున్నర ఏళ్లు అయింది. పాఠాల దిద్దుబాటుకు మాత్రం అతీగతీ లేదు. కేంద్ర సమాచార కమిషన్ఇచ్చిన స్వర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మొత్తంగా పాఠ్యగ్రంథాల ప్రక్షాళణకు వెంటనే ఉపక్రమించి ఉంటే పాటికి చదువుల రంగంలో అభారతీయ కాలుష్యాన్ని పరిహరించే దిశలో పెద్ద అడుగు పడేది.

       బ్రిటిషు వలస పాలన కాలపు మైండ్సెట్నుండి నవతరాన్ని బయటవేసి, దేశ వాస్తవ చరిత్ర ఏమిటి, జాతికి సేవ చేసిన వీరులెవరు, కీడు చేసిన విలన్లెవరు అన్నది ఉన్నదున్నట్టు చెబితేగాని విద్యాబోధన సార్థకం కాదు. అతి ముఖ్యమైన పని మీద పెట్టాల్సినంత శ్రద్ధను ఎన్డిఎ ప్రభుత్వం పెట్టలేదన్నది చేదునిజం. పుణ్యకాలమంతా వృథా చేసి, ఇంకో సంవత్సరంలో ఎన్డిఎ సర్కారు టర్మ్అయిపోతుందనగా ఎన్‌.సి..ఆర్‌.టి. టెక్ట్స్బుక్కులను త్వరలో సవరిస్తామని మానవ వనరుల శాఖ కేంద్రమంత్రి ప్రకాశ్జవదేకర్చేసిన ప్రకటన ఎప్పటికి కార్యరూపం దాలుస్తుందో, దానివల్ల నికర ప్రయోజనం ఎంతో దేవుడికెరుక.

       వందలాది దేవాలయాలను కూల్చి, మతం మారడానికి నిరాకరించిన లక్షాలది హిందువులను ఊచకోత కోసిన ఇస్లామిక్పాలకులను ధర్మ ప్రభువులుగా, శతాబ్దాల పర్యంతం ఇస్లామిక్దాడులను నిలువరించి, దక్షిణాదిన హిందూ మహాసామ్రాజ్య జాతీయ కేతనాన్ని ఎగురవేసిన విజయనగర సామ్రాట్టులనేమో పట్టించుకోనక్కరలేని అనామకులుగా పాఠ్యగ్రంథాల్లో చిత్రించే దౌర్భాగ్యం దేశంలో ఇంకెంత కాలానికి మారుతుందో !